Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs ENG: వైజాగ్ టెస్ట్.. అశ్విన్‌ను ఊరిస్తున్న రేర్ రికార్డ్స్!

టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ను అరుదైన రికార్డ్స్ ఊరిస్తున్నాయి. ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న రెండో టెస్ట్‌లో అశ్విన్ నాలుగు వికెట్ల తీస్తే సుదీర్ఘ ఫార్మాట్‌లో 500 వికెట్ల మైలు రాయిని చేరుకుంటాడు. ఈ ఘనతను అందుకున్న తొమ్మిదో క్రికెటర్‌గా.. రెండో భారత ప్లేయర్‌గా చరిత్రకెక్కుతాడు.

ప్రస్తుతం అశ్విన్ ఖాతాలో 496 వికెట్లు ఉన్నాయి. 96 మ్యాచ్‌ల్లో అతను ఈ ఫీట్ సాధించాడు. 132 టెస్ట్‌ల్లో 619 వికెట్లతో అనిల్ కుంబ్లే టాప్‌లో ఉన్నాడు. ఈ ఒక్క రికార్డే కాకుండా ఇంగ్లండ్‌తో టెస్ట్‌ల్లో 100 వికెట్లు పడగొట్టిన తొలి భారత బౌలర్‌గా కూడా అశ్విన్ అరుదైన ఘనతను సొంతం చేసుకుంటాడు.

IND vs ENG: Ravichandran Ashwin in line to break a few records in Vizag Test

టెస్ట్‌లో ఇంగ్లండ్‌పై అత్యధిక వికెట్ తీసిన భారత బౌలర్‌గా భగవత్ చంద్రశేఖర్ ఉన్నారు. ఆయన 23 మ్యాచ్‌ల్లో 95 వికెట్లు తీసాడు. ప్రస్తుతం అశ్విన్ ఇంగ్లండ్‌పై 20 టెస్ట్‌ల్లో 93 వికెట్లు తీసాడు. వైజాగ్ టెస్ట్‌లో అతను 3 వికెట్లు తీస్తే 21 టెస్ట్‌ల్లో 96 వికెట్లు తీసి చంద్రశేఖర్ రికార్డును అధిగమిస్తాడు.

ఈ మ్యాచ్‌లో ఏడు వికెట్లు తీస్తే ఇంగ్లండ్‌పై 100 వికెట్లు తీసిన తొలి భారత బౌలర్‌గా చరిత్రకెక్కుతాడు. అంతేకాకుండా ఇరు జట్ల మధ్య అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా గుర్తింపు పొందుతాడు. అశ్విన్ కన్నా ముందు జేమ్స్ అండర్స్ (139 వికెట్లు) ఈ ఘనతను అందుకున్నాడు.

వైజాగ్ టెస్ట్‌లో అశ్విన్ 8 వికెట్లు పడగొడితే.. భారత గడ్డపై అత్యధిక వికెట్లు తీసిన తొలి భారత బౌలర్‌గా చరిత్రకెక్కుతాడు. ఈ క్రమంలో అనిల్ కుంబ్లే(350) రికార్డును అధిగమిస్తాడు. ప్రస్తుతం అశ్విన్ సొంతగడ్డపై 56 టెస్ట్ మ్యాచ్‌లు ఆడి 343 వికెట్లు తీసాడు.

టెస్ట్ కెరీర్‌లో ఇప్పటి వరకు 34 సార్లు ఐదు వికెట్ల ఘనతను అందుకున్న అశ్విన్.. ఇంగ్లండ్‌తో రెండో టెస్ట్‌లో రెండు ఇన్నింగ్స్‌లో ఫిఫర్ తీసుకుంటే అనిల్ కుంబ్లే రికార్డును బద్దలు కొడుతాడు. భారత్ తరఫున అత్యధిక ఐదు వికెట్ల ఘనతను అందుకున్న ప్లేయర్‌గా నిలుస్తాడు. విశాఖ పిచ్ స్పిన్నర్లకు అనుకూలంగా ఉన్న నేపథ్యంలో అశ్విన్ ఈ రికార్డులను అందుకునే అవకాశం ఉంది.

ఐదు టెస్ట్‌ల సిరీస్‌ను ఓటమితో ప్రారంభించిన టీమిండియా వైజాగ్ వేదికగా జరిగే రెండో టెస్ట్‌కు ముందు క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటుంది. సీనియర్ ఆటగాళ్ల గైర్హాజరీలో కుర్రాళ్లతో బరిలోకి దిగనుంది. మిడిలార్డర్‌లో శుభ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్ పేలవ ఫామ్ టీమిండియాను కలవరపెడుతుంది. సునాయసంగా గెలవాల్సిన హైదరాబాద్ టెస్ట్‌ను టీమిండియా చేజేతులా చేజార్చుకుంది. 231 పరుగుల లక్ష్యాన్ని చేధించలేక 28 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.

Story first published: Thursday, February 1, 2024, 22:11 [IST]
Other articles published on Feb 1, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+