ఇంగ్లండ్‌తో నాలుగో టెస్ట్‌లో రిషభ్ పంత్ వికెట్ కీపింగ్ చేయలేకపోతే విశ్రాంతి ఇవ్వడమే ఉత్తమమని టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవి శాస్త్రి అన్నాడు. కేవలం బ్యాటర్‌గా ఆడించవద్దని టీమిండియా మేనేజ్‌మెంట్‌కు సూచించాడు. ఐదు టెస్ట్‌ల అండర్సన్-సచిన్ ట్రోఫీలో భాగంగా లార్డ్స్ వేదికగా జరిగిన మూడో టెస్ట్‌లో రిషభ్ పంత్ వికెట్ కీపింగ్ చేస్తూ గాయపడిన విషయం తెలిసిందే. దాంతో అతను ఆ మ్యాచ్‌లో బ్యాటింగ్‌కే పరిమితమయ్యాడు. పంత్ స్థానంలో ధ్రువ్ జురెల్ కీపింగ్ చేశాడు. ఈ మ్యాచ్‌లో టీమిండియా 22 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.
జూలై 23 నుంచి మాంచెస్టర్ వేదికగా నాలుగో టెస్ట్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌కు రిషభ్ పంత్ అందుబాటులో ఉండటంపై సందేహాలు నెలకొన్నాయి. రిషభ్ పంత్ గాయం చిన్నదేనని, 8 రోజుల విశ్రాంతి దొరికిందని, నాలుగో టెస్ట్ వరకు ఫిట్‌నెస్ సాధిస్తాడని మూడో టెస్ట్ ఓటమి అనంతరం శుభ్‌మన్ గిల్ తెలిపాడు. అయినా పంత్ ఫిట్‌నెస్‌పై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కేవలం బ్యాటర్‌గా కొనసాగిస్తారనే ప్రచారం కూడా జరుగుతుంది.

తాజాగా ఈ వ్యవహారంపై స్పందించిన రవి శాస్త్రి.. రిషభ్ పంత్ వికెట్ కీపింగ్ చేయలేకపోతే పక్కనపెట్టేయాలని సూచించాడు. ఆటగాడిగా కొనసాగితే పంత్ గాయపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సూచించాడు. పూర్తి ఫిట్‌నెస్ సాధించే వరకు జట్టుకు దూరంగా ఉంచడం ఉత్తమమని అభిప్రాయపడ్డాడు.
'రిషభ్ పంత్ కీపింగ్ చేయలేకపోతే.. బ్యాటర్‌గా ఆడకూడదు. కేవలం బ్యాటర్‌గా బరిలోకి దిగితే ఫీల్డింగ్ చేయాల్సి వస్తుంది. అప్పుడు అతని గాయం మరింత పెద్దదవుతుంది. కీపింగ్ చేస్తే గ్లోవ్స్ అయినా రక్షణగా ఉంటాయి. అదే బ్యాటర్‌గా బరిలోకి దిగితే ఎలాంటి రక్షణ లేకుండా ఫీల్డింగ్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు అతని చేతికి బంతి తగిలితే.. గాయం మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉంటుంది.అతని చేతికి ఫ్రాక్చర్ అయితే.. విశ్రాంతి తీసుకొని ఆఖరి టెస్ట్‌కు ఫిట్‌గా తిరిగి రావాలి. ఒకవేళ ఫ్రాక్చర్ లేకపోతే మాత్రం ఈ 8 రోజుల విశ్రాంతి సరిపోతుంది.'అని రవిశాస్త్రి చెప్పుకొచ్చాడు.
ఈ ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో టీమిండియా 1-2తో వెనుకంజలో నిలిచింది. ఈ సిరీస్‌పై ఆశలు సజీవంగా ఉండాలంటే మాంచెస్టర్ వేదికగా జరిగే నాలుగో టెస్ట్‌లో విజయం సాధించాలి. ఈ సిరీస్‌లో రిషభ్ పంత్ అద్భుత ప్రదర్శన కనబర్చాడు. ఇప్పటి వరకు పంత్ 6 ఇన్నింగ్స్‌ల్లో 70.83 సగటుతో 425 పరుగులు చేశాడు. ఇందులో రెండు శతకాలతో పాటు రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి.