
లండన్: ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న భారత జట్టులో కరోనా కలకలం రేగిన విషయం తెలిసిందే. నాలుగో టెస్ట్ నాలుగో రోజు ఆట ప్రారంభానికి ముందు టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రికి కరోనా వైరస్ సోకిందని, అతని సన్నిహితంగా ఉన్న బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, ఫీల్డింగ్ కోచ్ శ్రీధర్, ఫిజియో నితిన్ పటేల్‌ను ఐసోలేషన్‌కు తరలించామని బీసీసీఐ ప్రకటించింది. అయితే హెడ్ కోచ్ రవిశాస్త్రితో పాటు బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, ఫీల్డింగ్ కోచ్ ఆర్.శ్రీధర్‌లు కూడా కోవిడ్-19 బారిన పడ్డారు. వీరికి తాజాగా నిర్వహించిన ఆర్‌టీ-పీసీఆర్ పరీక్షలో కరోనా పాజిటివ్‌గా తేలినట్లు బీసీసీఐ సోమవారం ప్రకటించింది.
శనివారం, ఆదివారం చేసిన ర్యాపిడ్ టెస్టుల్లో రవిశాస్త్రికి కరోనా ఉన్నట్లు తేలింది. దాంతో ఇంగ్లండ్‌తో మాంచెస్టర్‌లో జరిగే ఐదో టెస్టుకు వీరు అందుబాటులో ఉండరు. శనివారం చేసిన లేటరల్ ఫ్లో టెస్ట్‌లో శాస్త్రి ఒక్కడే పాజిటీవ్‌గా తేలగా.. కన్ఫర్మేషన్ కోసం ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయగా.. శాస్త్రితో పాటు శ్రీధర్, భరత్ అరుణ్ వైరస్ బారిన పడ్డట్లు స్పష్టమైంది. గొంతు నొప్పి వంటి స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్న శాస్త్రి పది రోజులు ఐసోలేషన్‌లో ఉంటాడని బోర్డు వర్గాలు చెప్పాయి. శ్రీధర్, భరత్ అరుణ్‌కు ఎలాంటి లక్షణాలు లేవని తెలిసింది.
యా భై ఏళ్ల తర్వాత ఓవల్‌లో భారత్‌కు టెస్టు విజయం దక్కింది. ఆఖరి రోజు అద్భుతంగా బౌలింగ్ చేసిన టీమ్ ఇండియా నాలుగో టెస్టులో 157 పరుగుల తేడాతో ఆతిథ్యఇంగ్లండ్ను ఓడించింది. 368 పరుగుల లక్ష్య ఛేదనలో ఓవర్‌నైట్ స్కోరు 77/0తో అయిదో రోజు, సోమవారం బరిలోకి దిగినఇంగ్లండ్.. 210 పరుగులకు ఆలౌటైంది. ఉమేశ్ యాదవ్ (3/60), శార్దూల్ ఠాకూర్ (2/22), బుమ్రా (2/27), జడేజా (2/50) ఆ జట్టు పతనాన్ని శాసించారు. ఓపెనర్లు హమీద్ (63), బర్న్స్ (50) తొలి వికెట్‌కు వంద పరుగులు జోడించినా.. ఆ తర్వాత వచ్చినఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ తేలిపోయారు. రోహిత్ శర్మకు 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు లభించింది. చివరి టెస్టు శుక్రవారం ఆరంభమవుతుంది.
సంక్షిప్త స్కోర్లు..
భారత్ తొలి ఇన్నింగ్స్: 191 ఆలౌట్ (శార్దూల్ ఠాకూర్ 57, కోహ్లీ 50)
ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 290 ఆలౌట్ (ఓలీ పోప్ 81, క్రిస్ వోక్స్ 50
భారత్ రెండో ఇన్నింగ్స్: 466 (రోహిత్ 127, పుజారా 61, శార్దూల్ 60, పంత్ 50)
ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్: 210 ఆలౌట్