టెస్ట్ క్రికెట్ చచ్చిపోయేది ఇందుకే..
టెస్ట్ క్రికెట్‌కు ఆదరణ పెంచడానికి అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ)తో పాటు క్రికెట్ బిగ్ నేషన్స్ కృషి చేస్తున్నాయి. ఈ క్రమంలోనే డై/నైట్ టెస్ట్, వరల్డ్ కప్ తరహాలో వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిన్‌ను నిర్వహిస్తున్నాయి. కరోనా ఆటంకాలు ధాటుకొని ఫస్ట్ ఎడిషన్ దిగ్విజయంగా పూర్తయింది. ఇక భారత్-ఇంగ్లండ్ మధ్య జరిగిన ఫస్ట్ మ్యాచ్‌తోనే రెండో ఎడిషన్‌కు తెరలేచింది. కానీ కరోనా కారణంగా ఈ మ్యాచ్ ఫలితం తేలకుండా ముగియడం.. అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది. ఫస్ట్ మ్యాచ్ ఇలా అయితే ఇంకెవడూ చూస్తాడని వారంతా అసహనానికి లోనవుతున్నారు. ఇలా నిరాశపరిచే ఘటనలతోనే టెస్ట్ క్రికెట్ చచ్చిపోతుందంటున్నారు. అసలు ఇంగ్లండ్‌లో క్రికెట్ మ్యాచ్‌లే నిర్వహించవద్దని కామెంట్ చేస్తున్నారు.
జలకాలాటలు పెట్టాలి..
ఇంగ్లండ్ వాతావరణం ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పడం కష్టం. అలాంటి దేశంలో ప్రతిష్టాత్మకమైన వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ షురూ చేయడం బుద్ది తక్కువ పనని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఐసీసీ కేంద్రమైన దుబాయ్‌లోనే ఇలాంటి ప్రతిష్టాత్మక మ్యాచ్‌లు నిర్వహించాలని అభిప్రాయపడుతున్నారు. అక్కడ ఇలాంటి వాతావరణ పరిస్థితులు ఉండవని, హాయిగా మ్యాచ్‌లు నిర్వహించుకోవచ్చని కామెంట్ చేస్తున్నారు. ఏదీ ఏమైనప్పటికీ ఐసీసీ అనాలోచిత నిర్ణయాల వల్ల అభిమానులకు కావాల్సిన అసలు సిసలు ఆట లభించడం లేదని, వాతావరణ పరిస్థితుల వల్ల ఏదో ఒక దేశానికి తీవ్ర నష్టం జరుగుతుందంటున్నారు. వర్షం వస్తుందని తెలిసినప్పుడు రిజర్వ్ డే కేటాయించాల్సిందని అభిప్రాయపడుతున్నారు.
భారత్ బతికిపోయింది..
ఇక గెలిచే మ్యాచ్‌లో ఓడామని భారత అభిమానులు అసహనానికి గురవుతుంటే.. ఇంగ్లండ్ అభిమానులు మాత్రం భిన్నంగా స్పందిస్తున్నారు. వర్షంతో ఓటమి తప్పించుకున్నారని విచిత్రంగా కామెంట్ చేస్తున్నారు. బౌలింగ్‌కు అనుకూలమైన పిచ్‌పై భారత బ్యాట్స్‌మన్ 100 లోపు ఆలౌటయ్యేవారని, జోరూట్ సేన మంచి అవకాశాన్ని కోల్పోయిందని అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ కామెంట్స్‌కు భారత అభిమానులు ధీటుగా బదులిస్తున్నారు. 157 పరుగులను భారత జట్టు సులువుగా చేసేదని, లంచ సెషన్‌లోపు మ్యాచ్ పూర్తయ్యేదని కామెంట్ చేస్తున్నారు. ఏదీ ఏమైనప్పటికీ వర్షం ఆటంకం కలిగించడాన్ని ఇరు జట్ల అభిమానులు ఇబ్బందిగానే ఫీలవుతున్నారు.
కోహ్లీసేనను వెంటాడుతున్న వరణుడు..
ఇక కోహ్లీసేనను వరణుడు ఓ గండంలా వెంటాడుతున్నాడు. ప్రతీసారి ప్రతికూల ఫలితాలకు కారణమవుతున్నాడు. 2019 వన్డే ప్రపంచకప్ సెమీఫైనల్లో వర్షం ఆటకు అంతరాయం కలిగించడంతో భారత జట్టు రిజర్వ్ డే బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. కవర్లపై కప్పి ఉన్న పిచ్, చల్లని వాతావరణంతో న్యూజిలాండ్ స్వింగ్ బౌలర్లు చెలరేగారు. టాపార్డర్‌ను కుప్పకూల్చి ఇంటికి పంపించారు. ఇక గత నెలలో అదే న్యూజిలాండ్‌తో జరిగిన ప్రతిష్టాత్మక వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్‌లోనూ వరణుడు కోహ్లీసేన కొంపముంచాడు. రెండున్నర రోజుల ఆట తుడిచిపెట్టుకుపోగా.. తొలుత బౌలింగ్ చేసిన కివీస్‌కు పరిస్థితులు కలిసొచ్చాయి. దాంతో భారత జట్టు వర్షం కారణంగా మరోసారి మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. తాజాగా అదే పరిస్థితి నెలకొంది.


Click it and Unblock the Notifications
