Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs ENG: 100వ టెస్ట్‌లో అశ్విన్ చెత్త రికార్డ్!

ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదో టెస్ట్‌తో కెరీర్‌లో 100 టెస్ట్ మ్యాచ్‌ల మైలు రాయి అందుకున్న టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్.. చెత్త రికార్డ్ నమోదు చేశాడు. చిరస్మరణీయమైన 100వ టెస్ట్‌లో బౌలింగ్‌లో నాలుగు వికెట్లతో సత్తా చాటిన అశ్విన్.. బ్యాటింగ్‌లో మాత్రం దారుణంగా విఫలమయ్యాడు.

100వ మ్యాచ్‌లో డకౌట్ అయిన రెండో భారత ఆటగాడిగా అప్రతిష్టను మూటగట్టుకున్నాడు. ఓవరాల్‌గా 8వ బ్యాటర్‌గా ఈ చెత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. భారత్ తరఫున 100 టెస్ట్‌ల మైలు రాయి అందుకున్న 14వ ఆటగాడిగా నిలిచిన అశ్విన్.. ఈ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 9వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి 5 బంతులాడి ఒక్క పరుగు కూడా చేయకుండా టామ్‌హార్ట్‌లీ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు.

IND vs ENG R Ashwin sets unwanted record after being dismissed for a duck in 100th Test

అశ్విన్ కన్నా ముందు భారత్ తరఫున దిలీప్ వెంగ్‌సర్కార్.. 100వ టెస్ట్‌లో డకౌటయ్యాడు. ఓవరాల్‌గా బ్రెండన్ మెక్‌కల్లమ్, అలిస్టర్ కుక్, స్టీఫెన్ ఫ్లెమింగ్, మార్క్ టేలర్, కోర్ట్‌నీ వాల్ష్, అలన్ బోర్డర్ 100వ టెస్ట్‌లో డకౌటైన జాబితాలో ఉన్నారు.

ఈ మ్యాచ్‌లో భారత్ భారీ స్కోర్ దిశగా దూసుకెళ్తోంది. 135/1 ఓవర్‌నైట్ స్కోర్‌తో తమ ఆటను కొనసాగించిన భారత్.. రెండో రోజు ఆట ముగిసే సమయానికి 120 ఓవర్లలో 8 వికెట్లకు 473 పరుగులు చేసింది. ఓవర్ నైట్ బ్యాటర్లు రోహిత్ శర్మ(162 బంతుల్లో 13 ఫోర్లు, 3 సిక్స్‌లతో 103), శుభ్‌మన్ గిల్(150 బంతుల్లో 12 ఫోర్లు, 5 సిక్స్‌లతో 110) సెంచరీలతో చెలరేగారు.

ఈ ఇద్దరూ రెండో వికెట్‌కు 171 పరుగులు జోడించారు. రోహిత్‌ను బెన్ స్టోక్స్ ఔట్ చేయగా.. శుభ్‌గిల్‌ను అండర్సన్ పెవిలియన్ చేర్చాడు. దేవదత్ పడిక్కల్(65), సర్ఫరాజ్ ఖాన్(56) హాఫ్ సెంచరీలతో రాణించారు. క్రీజులో కుల్దీప్ యాదవ్(27 బ్యాటింగ్)తో పాటు జస్‌ప్రీత్ బుమ్రా(19 బ్యాటింగ్) ఉన్నారు. ఇంగ్లండ్ బౌలర్లలో షోయబ్ బషీర్(4/170) నాలుగు వికెట్లు తీయగా.. టామ్ హార్ట్‌లీ రెండు వికెట్లు తీసాడు. జేమ్స్ అండర్సన్, బెన్ స్టోక్స్‌లకు తలో వికెట్ దక్కింది.

ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 218 పరుగులకు ఆలౌటైన విషయం తెలిసిందే. కుల్దీప్ యాదవ్ ఐదు వికెట్లు, రవిచంద్రన్ అశ్విన్ నాలుగు వికెట్లతో చెలరేగారు. ఇంగ్లండ్ బ్యాటర్లలో జాక్ క్రాలీ (79)మినహా అంతా విఫలమయ్యారు. ప్రస్తుతం భారత్ ఆధిక్యం 255 పరుగులకు చేరింది.

Story first published: Friday, March 8, 2024, 17:17 [IST]
Other articles published on Mar 8, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+