IND vs ENG: పుజారా.. పుట్నాలు అమ్ముకోపో.. నీ కెరీర్ ఖేల్ ఖతమ్! నెట్టింట పేలుతున్న సెటైర్స్!

హైదరాబాద్: ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఫస్ట్ టెస్ట్‌లోను టీమిండియా నయావాల్ చతేశ్వర్ పుజారా(16 బంతుల్లో 4) తన వైఫల్యాన్ని కొనసాగించాడు. ఓపెనర్లు అందిచిన శుభారంభాన్ని ఈ సౌరాష్ట్ర ప్లేయర్ కొనసాగించలేకపోయాడు. ఎల్బీ రూపంలో ఎదురైన తొలి గండాన్ని రివ్యూతో అధిగమించిన పుజారా.. ఆ తర్వాత అండర్సన్ బౌలింగ్‌లో క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు.
ఈ వైఫల్యంతో పుజారా భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. పదే పదే విఫలమవుతున్నా టీమ్‌మేనేజ్‌మెంట్ ఇప్పటికే లెక్కకు మించిన అతనికి అవకాశాలు ఇచ్చింది. అయినా అతను నిరూపించుకోలేకపోయాడు. దాంతో అభిమానులు పుజారాపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా ఫన్నీ కామెంట్స్, సెటైర్లతో మీమ్స్ ట్రెండ్ చేస్తున్నారు.

రెండేళ్లుగా సెంచరీ లేదు..
వాస్తవానికి పుజారా గత రెండేళ్లుగా సతమతమవుతున్నాడు. ఆస్ట్రేలియా పర్యటనలో కొన్ని అద్భుత ఇన్నింగ్స్ ఆడినా అంతకు ముందు ఆ తర్వాత పెద్దగా రాణించిందేం లేదు. 2019లో అతను చివరిసారిగా సెంచరీ చేశాడు. గతేడాది అతని బ్యాటింగ్ యావరేజ్ 28 కాగా.. ఈ ఏడాది నాలుగు టెస్ట్‌ల్లో సగటు 20 మాత్రమే. ఈ రెండేళ్లలో అతను 21 ఇన్నింగ్స్‌లు ఆడి కేవలం ఐదు హాఫ్ సెంచరీలు మాత్రమే చేశాడు.
ఈ క్రమంలోనే వరుసగా విఫలమవుతున్న పుజారా జట్టులో అవసరమా? అనే ప్రశ్న తలెత్తుంది. కొంత మంది మాజీ క్రికెటర్లు, విశ్లేషకులు పుజారాకు అండగా నిలుస్తున్నా.. యువ ఆటగాళ్లతో రిజర్వ్ బెంచ్ బలంగా ఉన్నప్పుడు పదేపదే అవకాశాలు ఇవ్వడం సమంజసమా? అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఈ క్రమంలోనే పుజారా కెరీర్ ముగిసిందని కొంతమంది అభిమానులు కామెంట్ చేస్తున్నారు.
పుట్నాలు అమ్ముకోపో..
కొందరైతే పుజారా కెరీర్ ముగిసిందని, పుట్నాలు అమ్ముకోవాలని ఘాటుగా కామెంట్ చేస్తున్నారు. ఇంకొందరు ఈ సిరీస్ తర్వాత పుజారానే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతాడని కామెంట్ చేస్తున్నారు. రెండు, మూడు ఇన్నింగ్స్‌లకే దిగ్గజ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్‌తో పోల్చారని, కానీ అతని స్థానాన్ని భర్తీ చేయడం ఎవరి వల్ల కాదని కామెంట్ చేస్తున్నారు. పుజారా ఏం రాహుల్ ద్రవిడ్ కాదని, వెంటనే అతనిపై వేటు వేయాలని డిమాండ్ చేస్తున్నారు. లేకుంటే భారత జట్టుకు బొక్కేనని, అతనితో వచ్చే లాభం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంగ్లండ్ గడ్డపై పుజారాకు మెరుగైన రికార్డు లేదని హనుమ విహారీని ఆడించాల్సిందని మరికొంతమంది అభిప్రాయపడుతున్నారు.
సూర్య అరంగేట్రం ఖాయం..
పుజారా తాజా వైఫల్యంతో సుదీర్ఘ ఫార్మాట్‌లో సూర్యకుమార్ యాదవ్ అరంగేట్రం చేయడం ఖాయమని అభిమానులు కామెంట్ చేస్తున్నారు. సెకండ్ ఇన్నింగ్సే పుజారా భవిష్యత్తును నిర్ణయిస్తుందని చెబుతున్నారు. సెంచరీ చేస్తేనే అతను జట్టులో ఉంటాడని, కనీసం హాఫ్ సెంచరీ చేసినా పర్వాలేదంటున్నారు. లేకుంటే అతని కెరీర్ ముగుస్తుందని చెబుతున్నారు. కొందరైతే.. పృథ్వీషాను ఓపెనర్‌గా ఆడించి రాహుల్‌ను పుజారా స్థానంలో పంపించాలని సూచిస్తున్నారు. అలా కాకుంటే సూర్యకుమార్ యాదవ్ కన్నా అవకాశం ఇవ్వాలంటున్నారు.
మరికొందరు మాత్రం పుజారాను వెనకేసుకొస్తున్నారు. గోల్డెన్ డక్ అయిన కోహ్లీపైన లేవని నోళ్లు.. పుజారాపై లేస్తున్నాయని కామెంట్ చేస్తున్నారు. మొత్తానికి నెట్టింట పుజారాను అభిమానులు రోస్ట్ చేస్తున్నారు.
ఆధిక్యంలో భారత్..
ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓపెనర్లు శుభారంభం చేసినా మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ చతేశ్వర్ పుజారా (4), కెప్టెన్ కోహ్లీ (0), అజింక్యా రహానె (5) దారుణంగా విఫలమయ్యారు. కేఎల్ రాహుల్(77) శతకం వైపు దూసుకెళ్తుండటంతో మూడో రోజు భోజన విరామ సమయానికి టీమిండియా 66 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది.
ప్రస్తుతం భారత్ 8 పరుగుల ఆధిక్యంలో ఉంది. రాహుల్‌తో పాటు రవీంద్ర జడేజా (27) దూకుడుగా ఆడుతున్నాడు. వీరిద్దరూ ఇప్పటికే 46 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ క్రమంలోనే భారత్‌ను ఆధిక్యంలోకి తీసుకెళ్లారు. రాహుల్, జడేజా రెండో సెషన్లో కూడా ఇలాగే మంచి భాగస్వామ్యం నెలకొల్పితే.. కోహ్లీసేన మ్యాచ్‌పై పట్టు సాధించే అవకాశముంది. అంతకుముందు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 183 రన్స్ చేసింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications