For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సెమీ ఫైనల్‌లో భారత్‌పై సరికొత్త అస్త్రాన్ని సిద్ధం చేసిన ఇంగ్లాండ్..!!

 IND vs ENG: Phil Salt set to replace injured Dawid Malan in the Semi Finals against India

అడిలైడ్: టీ20 ప్రపంచకప్ 2022 టోర్నమెంట్ సెమీ ఫైనల్స్‌కు ముహూర్తం సమీపిస్తోంది. ఇంకొన్ని గంటల్లో తొలి సెమీ ఫైనల్ ఆరంభం కాబోతోంది. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్స్ ఈ మ్యాచ్‌కు ఆతిథ్యాన్ని ఇస్తోంది. భారత కాలమానం ప్రకారం.. బుధవారం మధ్యాహ్నం 1:30 గంటలకు మ్యాచ్ ఆరంభమౌతుంది. ఇందులో న్యూజిలాండ్-పాకిస్తాన్ తలపడబోతోన్నాయి. ఈ మెగా ఈవెంట్‌ సెమీ ఫైనల్స్‌లో మొట్టమొదటగా అడుగుపెట్టిన బ్లాక్ క్యాప్స్‌తో ఢీ కొట్టబోతోంది పాకిస్తాన్.

ఎల్లుండి రెండో సెమీఫైనల్..

ఎల్లుండి రెండో సెమీఫైనల్..

రెండో సెమీ ఫైనల్ ఎల్లుండి షెడ్యూల్ అయింది. అడిలైడ్‌ ఓవల్ స్టేడియంలో మధ్యాహ్నం 1:30 గంటలకు మ్యాచ్ మొదలవుతుంది. భారత్-ఇంగ్లాండ్ మధ్య జరిగే పోరు ఇది. ఈ రెండు జట్లు కూడా ఫైనల్‌పై కన్నేశాయి. టైటిల్ హాట్ ఫేవరెట్‌గా టోర్నమెంట్‌లో అడుగు పెట్టాయి. ఈ నెల 13వ తేదీన మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్స్‌లో ఫైనల్ జరుగుతుంది. ఈ రెండు జట్లు కూడా సూపర్ 12 దశలో సత్తా చాటాయి.

ఊహించని షాక్..

ఊహించని షాక్..

కాగా భారత్‌తో సెమీ ఫైనల్స్ కోసం సమాయాత్తమౌతోన్న ఇంగ్లాండ్‌ను ఊహించని షాక్ తగిలింది. డాషింగ్ బ్యాటర్ డేవిడ్ మలన్ ఈ మ్యాచ్‌కు దూరం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం మలన్.. గజ్జల్లో గాయంతో బాధపడుతున్నాడు. నెట్ ప్రాక్టీస్‌కు కూడా దూరంగా ఉంటోన్నాడు. ఆస్ట్రేలియాతో మ్యాచ్ ఆడుతున్న సమయంలోనే అతను అర్ధాంతరంగా గ్రౌండ్ నుంచి వెళ్లిపోయాడు. 15వ ఓవర్‌లో బౌండరీ వద్ద ఫీల్డింగ్ చేస్తోన్న సమయంలో గజ్జల్లో నొప్పితో డ్రెస్సింగ్ రూమ్‌కు చేరుకున్నాడు.

ఫిల్ సాల్ట్‌కు ఛాన్స్..

ఫిల్ సాల్ట్‌కు ఛాన్స్..

జోస్ బట్లర్‌తో కలిసి ప్రస్తుతం ఓపెనింగ్ పార్టనర్‌గా ఇన్నింగ్‌ను ఆరంభిస్తోన్నాడు అలెక్స్ హేల్స్. అతన్ని అలాగే కొనసాగించే అవకాశాలు ఉన్నాయి. రెండో ప్రత్యామ్నాయంగా టోర్నమెంట్‌లో ఇంకా ఆడని ఫిల్ సాల్ట్‌ను తుదిజట్టులోకి తీసుకోవచ్చు. జేమ్స్ విన్స్, జేసన్ రాయ్, సామ్ బిల్లింగ్స్‌ పేర్లను కూడాపరిశీలనలోకి తీసుకున్నప్పటికీ- ఫిల్ సాల్ట్ వైపే ఈసీబీ మొగ్గు చూపింది. అతన్ని నంబర్ 3 స్థానంలో పంపించనుంది.

ఎవరీ ఫిల్ సాల్ట్..

ఎవరీ ఫిల్ సాల్ట్..

26 సంవత్సరాల ఫిల్ సాల్ట్‌కు టీ20 స్పెషలిస్ట్ బ్యాటర్‌గా గుర్తింపు ఉంది. ఇప్పటివరకు అతను 11 మ్యాచ్ టీ20 ఇంటర్నేషనల్స్ ఆడాడు. 164.33 స్ట్రైక్ రేట్‌ను నమోదు చేశాడు. ఈ ఫిగర్.. అతని కెపాసిటీ ఏమిటో స్పష్టం చేస్తోంది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో పాకిస్తాన్‌తో ద్వైపాక్షిక సిరీస్‌లో రాణించాడు. పాకిస్తాన్‌పై లాహోర్‌లో జరిగిన మ్యాచ్‌లో 88 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో సాధించిన విజయంతో సిరీస్‌ను సొంతం చేసుకుంది ఇంగ్లాండ్.

రోహిత్ శర్మ చేతికి గాయం - సెమీ ఫైనల్స్‌కు ముందు తీవ్ర ఆందోళన..!!

Story first published: Tuesday, November 8, 2022, 11:10 [IST]
Other articles published on Nov 8, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+