టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ సిరాజ్‌కు బదులు ఎక్స్‌ట్రా బ్యాటర్‌ను తుది జట్టులోకి తీసుకోవాలని మాజీ క్రికెటర్, కామెంటేటర్ పార్దీవ్ పటేల్ అన్నాడు. ఇంగ్లండ్‌తో ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా హైదరాబాద్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో టీమిండియా 28 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. 231 పరుగుల లక్ష్యచేధనకు దిగిన భారత్ 202 పరుగులకే కుప్పకూలింది.
తొలి ఇన్నింగ్స్‌లో 190 పరుగుల భారీ ఆధిక్యం అందుకున్న భారత్.. రెండో ఇన్నింగ్స్‌లో పేలవ బౌలింగ్, బ్యాటింగ్‌తో మూల్యం చెల్లించుకుంది. జియోసినిమా షోలో టీమిండియా పరాజయంపై స్పందించిన పార్దీవ్ పటేల్ మేనేజ్‌మెంట్‌కు కీలక సూచన చేశాడు. మహమ్మద్ సిరాజ్‌తో ఏడు ఓవర్లు మాత్రమే వేయించాలనుకుంటే అతనికి బదులు ఎక్స్‌ట్రా బ్యాటర్‌ను తీసుకోవాలని చెప్పాడు.

అదే సమయంలో అక్షర్ పటేల్‌కు బదులు కుల్దీప్ యాదవ్‌ను తుది జట్టులోకి తీసుకోవాలని సూచించాడు. హైదరాబాద్ టెస్ట్‌లో లోకల్ భాయ్ సిరాజ్‌కు రోహిత్ శర్మ రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 7 ఓవర్లు మాత్రమే బౌలింగ్ ఇచ్చాడు. ఈ క్రమంలోనే అతనికి బదులు స్పెషలిస్ట్ బ్యాటర్‌ను తీసుకోవడం ఉత్తమమని పార్టీవ్ పటేల్ అభిప్రాయపడ్డాడు.
'తుది జట్టులో ముగ్గురు స్పిన్నర్లు సరిపోతారు. ఈ విషయంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. కానీ నాకు భిన్నమైన దృక్పథం ఉంది.టెస్ట్ మ్యాచ్ మొత్తంలో సిరాజ్‌తో కేవలం 11 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేయించారు. అలాగే మ్యాచ్‌కు ముందు రోహిత్ శర్మ మాట్లాడుతూ బ్యాటింగ్ సామర్థ్యం ఉండటంతోనే కుల్దీప్ యాదవ్‌కు బదులు అక్షర్ పటేల్‌ను ఆడిస్తున్నామని తెలిపాడు.
అయితే కాస్త భిన్నంగా ఆలోచిస్తే.. అక్షర్ పటేల్ స్థానంలో కుల్దీప్ యాదవ్ ఆడించి.. సిరాజ్ స్థానంలో స్పెషలిస్ట్ బ్యాటర్‌ను తీసుకుంటే జట్టుకు అడ్వాంటేజ్ అవుతోంది. అప్పుడు భారత బ్యాటింగ్ డెప్త్ బలంగా మారుతోంది. సిరాజ్‌తో ఎక్కువగా బౌలింగ్ చేయించనప్పుడు అతన్ని ఆడించడం ఎందుకు? ఏడు ఓవర్ల కోసం ఓ స్పెషలిస్ట్ పేసర్ అవసరమా?
కుల్దీప్ యాదవ్ జట్టులోకి వస్తే బౌలింగ్ బలం పెరుగుతోంది. అశ్విన్, కుల్దీప్, జడేజా, బుమ్రా బౌలింగ్ విభాగాన్ని నడిపిస్తారు.'అని పార్దీవ్ పటేల్ చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 246 పరుగులకు ఆలౌటైంది. బెన్ స్టోక్స్(70) ఒక్కడే హాఫ్ సెంచరీతో రాణించగా.. జడేజా, అశ్విన్ మూడేసి వికెట్లు తీసారు. అనంతరం భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 436 పరుగుల భారీ స్కోర్ చేసింది. రవీంద్ర జడేజా(87), యశస్వి జైస్వాల్(80), కేఎల్ రాహుల్(86) హాఫ్ సెంచరీలతో సత్తా చాటారు.
దాంతో భారత్‌కు 190 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్.. ఓలిపోప్(196) సూపర్ బ్యాటింగ్‌తో 420 పరుగులు చేసింది. ఈ ఓటమితో ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో ఇంగ్లండ్ 1-0తో ఆధిక్యంలో నిలిచింది. రెండో టెస్ట్ ఫిబ్రవరి 2న వైజాగ్ వేదికగా ప్రారంభం కానుంది.