Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs ENG: శ్రేయస్ అయ్యర్‌‌‌కు నో ఛాన్స్.. ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లే భారత్-ఏ జట్టు ఇదే!

ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లే భారత్-ఏ జట్టును భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ప్రకటించింది. 20 మంది సభ్యులతో కూడిన జంబో టీమ్‌ వివరాలను శుక్రవారం వెల్లడించింది. ఈ మేరకు బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా ఓ ప్రకటనను విడుదల చేశారు. ఇంగ్లండ్‌తో ఐదు టెస్ట్ సిరీస్‌లకు సన్నాహకంగా భారత్-ఏ టీమ్.. ఇంగ్లండ్ లయన్స్‌తో రెండు అనధికారిక టెస్ట్‌లు ఆడనుంది. మే 30 నుంచి జూన్ 2 మధ్య తొలి అనధికారిక టెస్ట్ జరగనుండగా.. జూన్ 6-25 మధ్య రెండో అనధికారిక మ్యాచ్ జరగనుంది. జూన్ 13-16 మధ్య ఇంట్రాస్క్వాడ్ మ్యాచ్ జరగనుంది.

ఇంగ్లండ్‌తో ఐదు టెస్ట్‌ల సిరీస్‌కు ఎంపిక చేసే ఆటగాళ్లందరిని భారత్-ఏ జట్టులో చేర్చారు. శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన్ రెండో ప్రాక్టీస్ మ్యాచ్‌కు అందుబాటులో ఉంటారని బీసీసీఐ తమ ప్రకటనలో పేర్కొంది. ఈ అనధికారిక టెస్ట్ సిరీస్‌లో టీమిండియాను అభిమన్యు ఈశ్వరన్‌ నడిపించనున్నాడు. దేశవాళీ క్రికెట్‌లో నిలకడగా రాణించిన కరుణ్ నాయర్‌కు ఈ జట్టులో చోటు దక్కింది. శార్దూల్ ఠాకూర్ మళ్లీ టీమిండియా పిలుపును అందుకున్నాడు.

IND vs ENG No Shreyas Iyer BCCI Announces India A Squad For England Tour

ధ్రువ్ జురెల్, నితీష్ కుమార్ రెడ్డి, ఇషాన్ కిషన్, సర్ఫరాజ్ ఖాన్‌లు కూడా తమ స్థానాన్ని నిలబెట్టుకున్నారు. అందరూ ఊహించనట్లుగానే శ్రేయస్ అయ్యర్‌‌ను ఈ సిరీస్‌కు పరిగణలోకి తీసుకోలేదు. భారత్-ఏ టీమ్ మే 25 తర్వాత ఇంగ్లండ్ ఫ్లైట్ ఎక్కే అవకాశం ఉంది. ఐపీఎల్ ప్లే ఆఫ్స్ ఆడే ఆటగాళ్లు తర్వాత జట్టుతో కలవనున్నారు. ఇంగ్లండ్ పరిస్థితులకు అలవాటు పడాలనే ఉద్దేశంతోనే ప్రధాన ఆటగాళ్లందరినీ భారత్-ఏ జట్టులోకి ఎంపిక చేశారు.

ఐపీఎల్ 2025 సీజన్ ముగిసిన వెంటనే భారత్ జట్టు ఇంగ్లండ్‌లో పర్యటించనుంది. ఈ ఐదు టెస్ట్‌ల సిరీస్‌తోనే డబ్ల్యూటీసీ 2027 సైకిల్ ప్రారంభం కానుంది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించడంతో వారి స్థానాల్లో ఎవరికి అవకాశం దక్కుతుందా? అనేది ఆసక్తికరంగా మారింది.

భారత్-ఏ జట్టు: అభిమన్యు ఈశ్వరన్(కెప్టెన్), యశస్వి జైస్వాల్, కరుణ్ నాయర్, ధ్రువ్ జురెల్(వైస్ కెప్టెన్), నితీష్ కుమార్ రెడ్డి, శార్దూల్ ఠాకూర్, ఇషాన్ కిషన్(కీపర్), మానవ్ సుతార్, తనూష్ కోటియన్, ముఖేష్ కుమార్, ఆకాశ్ దీప్, హర్షిత్ రాణా, అన్షుల్ కంబోజ్, ఖలీల్ అహ్మద్, రుతురాజ్ గైక్వాడ్, సర్ఫరాజ్ ఖాన్, తుషార్ దేశ్‌పాండే, హర్ష్ దూబే

రెండో అనధికారిక టెస్ట్‌కు సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్

Story first published: Friday, May 16, 2025, 20:10 [IST]
Other articles published on May 16, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+