Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs ENG: స్టార్ ప్లేయర్‌కు నిరాశే.. భారత్‌తో రెండో టెస్ట్ ఆడే ఇంగ్లండ్ తుది జట్టు ఇదే!

ఐదు టెస్ట్‌ల అండర్సన్-సచిన్ ట్రోఫీలో భాగంగా భారత్‌తో జరిగే రెండో టెస్ట్‌కు ఇంగ్లండ్ తమ తుది జట్టును ప్రకటించింది. బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ వేదికగా బుధవారం ఈ మ్యాచ్ ప్రారంభం కానుండగా.. ఇంగ్లండ్ సోమవారమే తమ తుది జట్టు వివరాలను వెల్లడించింది. తొలి టెస్ట్‌లో విజయం సాధించిన జట్టునే ఎలాంటి మార్పులు లేకుండా కొనసాగించింది.

ఈ మ్యాచ్‌కు ఇంగ్లండ్ స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్ అందుబాటులోకి వచ్చినా అతనికి తుది జట్టులో చోటు దక్కలేదు. నాలుగేళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత జోఫ్రా ఆర్చర్ ఇంగ్లండ్ టెస్ట్‌ టీమ్‌లోకి రీఎంట్రీ ఇచ్చాడు. అయినా అతనికి నిరాశే ఎదురైంది. జోఫ్రా ఆర్చర్ తన చివరి టెస్ట్ మ్యాచ్‌ను 2021 ఫిబ్రవరిలో భారత్‌తో అహ్మదాబాద్ వేదికగా ఆడాడు. ఆ తర్వాత గాయాల కారణంగా ఇంగ్లండ్ టెస్ట్‌ టీమ్‌కు ఎంపికయ్యాడు.

IND vs ENG No Jofra Archer England announces playing XI

వ్యక్తిగత కారణాలతోనే జోఫ్రా ఆర్చర్.. భారత్‌తో రెండో టెస్ట్ మ్యాచ్‌కు దూరమయ్యాడని తెలుస్తోంది. కుటుంబంలో అత్యవసర పరిస్థితి తలెత్తడంతో జోఫ్రా ఆర్చర్.. సోమవారం ప్రాక్టీస్ సెషన్‌కు దూరంగా ఉన్నాడు. ఆర్చర్ మంగళవారం జట్టుతో కలుస్తాడని ఇంగ్లండ్ టీమ్ వర్గాలు పేర్కొన్నాయి.

వామ్మో ఎడ్జ్‌బాస్టన్..

ఎడ్జ్‌బాస్టన్ పిచ్ సాంప్రదాయకంగా పేస్ బౌలర్లకు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా తొలి రెండు రోజులు పేస్‌కు సహకరిస్తోంది. వాతావరణం చల్లగా ఉండి, పిచ్‌పై పచ్చ గడ్డి ఉంటే బంతి స్వింగ్ అవుతోంది. మ్యాచ్ సాగుతున్నా కొద్ది పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా మారుతోంది. ఆట ఆఖరి రోజుకు చేరితే పిచ్‌పై పగుళ్లు ఏర్పడి స్పిన్‌కు అనుకూలిస్తోంది. ఇక్క టాస్ గెలిచిన జట్టు బౌలింగ్ ఎంచుకోవడానికి మొగ్గు చూపుతోంది. పిచ్ కండిషన్స్ నేపథ్యంలో రెండో టెస్ట్‌లో బుమ్రా ఆడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

Story first published: Tuesday, July 1, 2025, 11:50 [IST]
Other articles published on Jul 1, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+