IND vs ENG: వారెవ్వా నితీష్ రెడ్డి.. వాటే క్యాచ్! (వీడియో)
టీమిండియా యువ ఆల్‌రౌండర్, తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి కళ్లు చెదిరే క్యాచ్‌తో ఔరా అనిపించాడు. ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో కోల్‌కతా వేదికగా జరుగుతున్న తొలి టీ20లో నితీష్ కుమార్ రెడ్డి సూపర్ ఫీల్డింగ్‌తో ఆకట్టుకున్నాడు. అసాధారణమైన డైవ్‌తో బంతిని అందుకొని జోస్ బట్లర్‌ను పెవిలియన్ చేర్చాడు. ప్రస్తుతం ఈ క్యాచ్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. నితీష్ కుమార్ రెడ్డిపై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. 'వారెవ్వా నితీష్ రెడ్డి.. వాటే క్యాచ్'అని కామెంట్ చేస్తున్నారు.
వరుణ్ చక్రవర్తీ వేసిన 17వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ రెండో బంతిని వరుణ్ చక్రవర్తీ షాట్ బాల్‌గా వేయగా.. బట్లర్ డీప్ స్క్వేర్ లెగ్ వైపు పుల్ షాట్ ఆడాడు. అయితే డీప్‌లో ఫీల్డింగ్ చేస్తున్న నితీష్ కుమార్ రెడ్డి ముందుకు డైవ్ చేసి బంతిని అద్భుతంగా అందుకున్నాడు. థర్డ్ అంపైర్ రిప్లేలను పరిశీలించి క్లియర్ క్యాచ్‌గా ప్రకటించాడు. దాంతో జోస్ బట్లర్(44 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లతో 68) ఒంటరి పోరాటం ముగిసింది.

ఈ మ్యాచ్‌లో భారత బౌలర్లు దుమ్మురేపారు. మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తీ(3/22) తీన్మార్ బౌలింగ్‌కు అర్ష్‌దీప్ సింగ్(2/17), అక్షర్ పటేల్(2/22), హార్దిక్ పాండ్యా(2/42) రెండేసి వికెట్లు తీయడంతో ఇంగ్లండ్ 132 పరుగులకే కుప్పకూలింది.
ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్(44 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లతో 68) ఒంటరి పోరాటం చేయగా.. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. హ్యారీ బ్రూక్(17), జోఫ్రా ఆర్చర్(12) మినహా అంతా సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు.
Runs in ✅
— BCCI (@BCCI) January 22, 2025
Dives forward ✅
Completes a superb catch ✅
Superb work this is from Nitish Kumar Reddy! 👏 👏
Follow The Match ▶️ https://t.co/4jwTIC5zzs#TeamIndia | #INDvENG | @NKReddy07 | @IDFCFIRSTBank pic.twitter.com/LsKP5QblJO
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications