ఇండియా వర్సెస్ ఇంగ్లండ్: టీమిండియా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ పేలవ ఫామ్ కొనసాగుతోంది. ఇంగ్లండ్‌తో వైజాగ్ వేదికగా శుక్రవారం ప్రారంభమైన రెండో టెస్ట్‌లోనూ శ్రేయస్ అయ్యర్ తీవ్రంగా నిరాశపరిచాడు. 59 బంతుల్లో 3 ఫోర్లతో 27 పరుగులే చేసి వెనుదిరిగాడు. టామ్ హార్ట్‌లీ వేసిన బౌలింగ్‌లో వికెట్ కీపర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దాంతో శ్రేయస్ అయ్యర్‌పై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇంకెన్ని అవకాశాలు ఇస్తారంటూ? మండిపడుతున్నారు. శ్రేయస్ అయ్యర్‌కు గుడ్‌బై చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని, అతనికి బదులు కుర్రాళ్లకు అవకాశం ఇవ్వాలని టీమిండియా మేనేజ్‌మెంట్‌కు రిక్వెస్ట్ చేస్తున్నారు. శ్రేయస్ అయ్యర్ పరిస్థితి మరి దారుణంగా తయారైందని, స్పిన్నర్లు సైతం అతనికి షాట్ పిచ్ బాల్స్ వేస్తూ భయపెడుతున్నారని గుర్తు చేస్తున్నారు.

వైజాగ్ టెస్ట్‌లో ఇంగ్లండ్ స్పిన్నర్లు శ్రేయస్ అయ్యర్‌కు షాట్ పిచ్ బాల్స్ వేస్తూ టెంప్ట్ చేసే ప్రయత్నం చేశారు. శ్రేయస్ అయ్యర్‌కు షాట్ పిచ్ బాల్ ఆడటం బలహీనతగా మారింది. షాట్ పిచ్ బాల్ వేయగానే.. ముందు వెనుకా చూసుకోకుండా పుల్ షాట్ ఆడుతాడు. దాంతో ప్రత్యర్థి జట్లు అతని షాట్‌కు తగ్గట్లు ఫీల్డ్ సెట్ చేసి అయ్యర్‌ను బుట్టలో వేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే అయ్యర్ క్రీజులోకి రాగానే ప్రత్యర్థి బౌలర్లు షాట్ పిచ్ బాల్స్‌తో అతన్ని అటాక్ చేస్తూ ఉంటారు.
గత 11 ఇన్నింగ్స్‌ల్లో అయ్యర్ ఒక్క హాఫ్ సెంచరీ కూడా నమోదు చేయలేదు. బంగ్లాదేశ్‌తో టెస్ట్ సిరీస్‌లో చివరిసారిగా హాఫ్ సెంచరీ బాదిన అతను అప్పటి నుంచి విఫలమవుతూనే ఉన్నాడు. గత 11 ఇన్నింగ్స్‌ల్లో వరుసగా 12(10), 4(15), 26(27), 0(2), 6(12), 31(50), 4*(6), 0(2), 35(63), 13(31), 27(59) విఫలమయ్యాడు.
ఇంత దారుణంగా విఫలమవుతున్నా అతనికి ఎందుకు అవకాశాలు ఇస్తున్నారు? అంటూ ఫ్యాన్స్ బీసీసీఐని నిలదీస్తున్నారు. శ్రేయస్ అయ్యర్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలకాలని సూచిస్తున్నారు. ప్రతీ ఫార్మాట్‌లోనూ అయ్యర్ ఇలానే విఫలమవుతున్నాడని గుర్తు చేస్తున్నారు. కొందరైతే అయ్యర్.. టీమిండియాకు శనిలా దాపురించాడని ఘాటుగా విమర్శిస్తున్నారు.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా.. కెప్టెన్ రోహిత్ శర్మ(14), శుభ్‌మన్ గిల్(34), శ్రేయస్ అయ్యర్(27) వికెట్లు త్వరగా కోల్పోయినా.. యశస్వి జైస్వాల్ (185 బంతుల్లో 14 ఫోర్లు, 3 సిక్స్‌లతో 125 బ్యాటింగ్) భారీ శతకంతో భారీ స్కోర్ దిశగా దూసుకెళ్తోంది. రెండో సెషన్ ముగిసే సమయానికి టీమిండియా 63 ఓవర్లలో 3 వికెట్లకు 225 పరుగులు చేసింది. యశస్వితో పాటు రజత్ పటీదార్(25 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు.