Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సెంచరీ చేయక 950 రోజులవుతోంది.. ఇలానే ఆడితే జట్టులో నీకు ప్లేస్ దండుగ! కోహ్లీపై ఫ్యాన్స్ ఫైర్!

IND vs ENG: Netizens brutally troll Virat Kohli after dismissal in Edgbaston Test

హైదరాబాద్: టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీపై సొంత అభిమానులే విమర్శలు గుప్పిస్తున్నారు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న రీషెడ్యూల్ ఐదో టెస్ట్‌లో కోహ్లీ(11) దారుణంగా విఫలమయ్యాడు. యువ పేసర్ ప్యాటీ మ్యాటీ పోట్స్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అతను వేసిన ఔట్‌సైడ్ ఆఫ్ స్టంప్ బాల్‌ను ఆడాలా? వద్దా అనే సంశయంతో గందరగోళానికి గురైన కోహ్లీ చివరకు మూల్యం చెల్లించుకున్నాడు. దాంతో సహనం కోల్పోయిన అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. తమ అభిమాన క్రికెటర్ తడబడటం తట్టుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ తరహాలో స్వచ్చందంగా అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

సెంచరీ చేయక 950 రోజులు..

ఇక రన్ మెషిన్‌గా పేరొందిన విరాట్ కోహ్లీ సెంచరీ చేసి 950 రోజులు అవుతోంది. సరిగ్గా చెప్పాలంటే మూడేండ్లకు ఓ రెండు మాసాలు తక్కువ. ప్రపంచ దిగ్గజ బ్యాటర్‌గా విమర్శకుల ప్రశంసలు అందుకున్న విరాట్ కోహ్లీ ఇంతలా తడబడటం చూసి అతని అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. విరాట్ కోహ్లీ కాబట్టే వరుసగా విఫలమవుతున్నా తుది జట్టులో అవకాశం అందుకుంటున్నాడని, సాధారణ ఆటగాడు అయితే ఎప్పుడో పాతళంల కలిసిపోయేవాడని సొంత అభిమానులే కామెంట్ చేస్తున్నారు. విరాట్ కోహ్లీని తప్పించాల్సిన సమయం ఆసన్నమైందని అభిప్రాయపడుతున్నారు.

ఓపికకు కూడా హద్దులు..

ఓపికకు కూడా హద్దులుంటాయని, సహనం నశిస్తే ఏమవుతుందనేది కొత్తగా చెప్పాల్సిన పన్లేదంటున్నారు. కోహ్లీ మాత్రం గత మూడేండ్లుగా అభిమానుల సహనాన్ని పరీక్షిస్తూనే ఉన్నాడని, ప్రతి మ్యాచ్‌కు ముందు ఆడుతాడులే అని ఆశలు పెంచుకున్న అభిమానులను ప్రతీసారి నిరాశపరుస్తున్నాడని వాపోతున్నారు. ఐపీఎల్ 2022 సీజన్‌లో విఫలమైన విరాట్ కోహ్లీని చూసి అందరూ అతడిని విమర్శించడం కంటే 'పాపం కోహ్లీ కాస్త విశ్రాంతి తీసుకుంటే మంచిదేమో.. అప్పుడైనా తిరిగి ఫామ్ లోకి వస్తాడు..'అని జాలి చూపించారు.

మాది బుద్ది తక్కువ..

కోహ్లీకి అత్యంత సన్నిహితుడైన మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రితో పాటు క్రికెట్ పండితులంతా ఇదే సలహాలిచ్చారు. వాళ్ల కోరిక మేరకు ఐపీఎల్ ముగిశాక కోహ్లీ.. సతీమణి అనుష్క శర్మతో కలిసి మాల్దీవులు ట్రిప్ వెళ్లొచ్చాడు. దాదాపు నెల రోజుల తర్వాత గ్రౌండ్ లోకి వచ్చిన కోహ్లీ ఎలాంటి మార్పు లేకుండా అదే తడబాటును కనబర్చాడు. స్వింగ్ బంతులను ఆడలేక మూల్యం చెల్లించుకున్నాడు. కోహ్లీ ఔటైన తీరును కొందరు అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. నిన్ను నమ్ముకున్నాం చూడు.. మాదీ బుద్ది తక్కువ..' అని కామెంట్లు పెడుతున్నారు.

జట్టులో చోటు కూడా గల్లంతే..

విరాట్ కోహ్లీ చివరిసారిగా 2019 ఆగస్టు‌లో ఈడెన్ గార్డెన్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన చారిత్రాత్మక టెస్టులో సెంచరీ చేశాడు. ఆ తర్వాత మళ్లీ అతడి బ్యాట్ నుంచి సెంచరీ రాలేదు. ఫలితంగా.. టెస్టులలో 2020 కి ముందు కోహ్లీ సగటు 54.97 ఉండగా.. ఆ తర్వాత అది 27.48 గా మారింది. కోహ్లీ ఇలాగే ఆడితే మరికొద్దిరోజుల్లో అతను భారత జట్టులో కూడా చోటు కోల్పోనున్నాడు. ఈ ఇంగ్లండ్ పర్యటన అతని కెరీర్ భవితవ్యాన్ని తేల్చనుంది. మ్యాచ్ విషయానికి వస్తే.. 53 ఓవర్లలో 5 వికెట్లకు 223 పరుగులు చేసింది. రిషభ్ పంత్(86 బ్యాటింగ్) సెంచరీ దిశగా దూసుకెళ్తుండగా.. జడేజా(43 బ్యాటింగ్) హాఫ్ సెంచరీకి చేరువయ్యాడు.

Story first published: Friday, July 1, 2022, 22:05 [IST]
Other articles published on Jul 1, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+