టీమిండియా స్టార్ పేసర్, హైదరాబాద్ బౌలర్ మహమ్మద్ సిరాజ్‌పై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ నాసర్ హుస్సేన్ ప్రశంసల జల్లు కురిపించాడు. సిరాజ్ అద్భుత ప్రదర్శనతోనే ఐదు టెస్ట్‌ల అండర్సన్-సచిన్ ట్రోఫీలో టీమిండియా మెరుగైన ప్రదర్శన చేసిందని తెలిపాడు. ఓవల్ మైదానం వేదికగా జరుగుతున్న ఆఖరి టెస్ట్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 224 పరుగులకే ఆలౌటైంది. అనంతరం ఇంగ్లండ్ 247 పరుగులు చేసింది. బజ్‌బాల్ గేమ్‌తో తొలి వికెట్‌కు 92 పరుగులు చేసిన ఇంగ్లండ్.. సిరాజ్ ధాటికి 247 పరుగులకే పరిమితమైంది. కెప్టెన్ ఓలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, జాకోబ్ బెతెల్‌ను ఆలౌట్ చేసిన సిరాజ్.. ఇంగ్లండ్ పతనాన్ని శాసించాడు.
23 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ 396 పరుగుల భారీ స్కోర్ చేసింది. యశస్వి జైస్వాల్(118) సెంచరీతో సత్తా చాటగా.. ఆకాష్ దీప్(66), రవీంద్ర జడేజా(53), వాషింగ్టన్ సుందర్(53) హాఫ్ సెంచరీలతో రాణించారు. 374 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్‌ను సిరాజ్ ఆరంభంలోనే దెబ్బతీసాడు. జాక్ క్రాలీని క్లీన్ బౌల్డ్ చేశాడు. భారత్ విజయానికి మరో 8 వికెట్లు కావాలి. భుజ గాయంతో క్రిస్ వోక్స్ బ్యాటింగ్ చేయలేని పరిస్థితి నెలకొన్న సంగతి తెలిసిందే.

ఐదో టెస్ట్‌ను ఉద్దేశించి డెయిలీ మెయిల్‌కు రాసిన కథనంలో నాసర్ హుస్సేన్.. సిరాజ్ ప్రదర్శనను ప్రత్యేకంగా కొనియాడాడు. 'సిరాజ్.. కెప్టెన్‌కు అత్యంత ఇష్టమైన ఆటగాడు. అతను ఎప్పుడూ జట్టును ఉత్సాహ పరుస్తుంటాడు. నేను ఇంగ్లండ్ కెప్టెన్‌గా ఉన్నప్పుడు డారెన్ గఫ్ నాకిష్టమైన బౌలర్ అని ఎప్పుడూ చెబుతూ ఉండేవాడిని. భారత్‌కు సిరాజ్ అలాంటి ఆటగాడే. ఈ సిరీస్‌లో అతను కనబర్చిన ప్రదర్శన అద్భుతం. అతని కారణంగానే ఈ సిరీస్‌లో టీమిండియా గట్టి పోటీ ఇవ్వగలిగింది.
ఈ సిరీస్‌లో భారత్ పోరాడిన తీరు నన్ను ఆకట్టుకుంది. తొలి టెస్ట్ పరాజయం తర్వాత భారత్ పుంజుకోదని కొందరు అనుకున్నారు. కానీ భారత్ ఎంత కఠినమైన జట్టు అనే విషయాన్ని ఆటతోనే చూపెట్టారు. ఈ సిరీస్‌లో ఇంగ్లండ్ తరహాలోనే సమంగా సెషన్లను గెలిచారు. కీలక సమయాల్లో మాత్రమే వారు కాస్త వెనుకబడ్డారు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లేకుండా అత్యంత ప్రదర్శన కనబర్చడం అద్భుతం.'అని నాసర్ హుస్సేన్ పేర్కొన్నాడు.
ఈ సిరీస్‌లో ఐదుకు ఐదు మ్యాచ్‌లు ఆడిన సిరాజ్.. ఇప్పటికే 20 వికెట్లను ఖాతాలో వేసుకున్నాడు. ఈ సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. సిరాజ్ తర్వాత క్రిస్ వోక్స్ మాత్రమే ఈ సిరీస్‌లో ఐదు మ్యాచ్‌లు ఆడాడు. కానీ అతను ఆఖరి టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో ఫీల్డింగ్ చేస్తూ గాయపడి జట్టుకు దూరమయ్యాడు.