For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND vs ENG: టీమిండియా డ్రెస్సింగ్‌ రూమ్‌లో ధోనీ సందడి.. యువ ఆటగాళ్లకు క్లాస్‌లు!

IND vs ENG: MS Dhoni Visits Team India Dressing Room In Edgbaston, Pic Goes Viral

బర్మింగ్‌హామ్: మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ మళ్లీ టీమిండియా డ్రెస్సింగ్ రూమ్‌లోకి వచ్చాడు. ఆటగాడిగా.. జట్టు సారథిగా జట్టుకు ఎన్నో చిరస్మరణీయ విజయాలందించిన మహీ.. మళ్లీ జట్టుతో కలిసి సందడి చేశాడు. తనతో కలిసి ఆడిన ఆటగాళ్లతో ముచ్చటించాడు. కుర్రాళ్లకు విలువైన సూచనలు ఇస్తూ క్లాస్‌లు పీకాడు. గతేడాది దుబాయ్ వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్‌లో బీసీసీఐ రిక్వెస్ట్ మేరకు టీమ్ మెంటార్‌గా పనిచేసిన ధోనీ.. మళ్లీ డ్రెస్సింగ్ రూమ్‌లోకి రావడం చర్చనీయాంశమైంది.

మెంటార్‌గా ధోనీ..

ఆస్ట్రేలియా వేదికగా జరిగే టీ20 ప్రపంచకప్‌కు కూడా ధోనీ సేవలను వాడుకుంటారా? అనే వాదన తెరపైకి వచ్చింది. అయితే మహీ భారత జట్టు డ్రెస్సింగ్ రూమ్‌లోకి వచ్చింది అతిథిగా మాత్రమేనని బోర్డు వర్గాలు స్పష్టం చేశాయి. తన పెళ్లి రోజు, పుట్టిన రోజు వేడుకల కోసం ధోనీ వారం క్రితమే కుటుంబంతో కలిసి లండన్ వేకేషన్‌కు వెళ్లాడు. అక్కడే అత్యంత సన్నిహితుల మధ్య పెళ్లి రోజు(జూలై 4), పుట్టిన రోజు(జూలై 7)వేడుకలను ఘనంగా జరుపుకున్నాడు. బర్త్ డే వేడుకులకు టీమిండియా నుంచి రిషభ్ పంత్ హాజరయ్యాడు.

మ్యాచ్‌ను చూసేందుకు వచ్చి..

ఆ తర్వాత వింబుల్డన్ మ్యాచ్‌లకు హాజరై ఆస్వాదించాడు. ఈ క్రమంలోనే శనివారం రాత్రి బర్మింగ్ హోమ్ వేదికగా భారత్, ఇంగ్లండ్ మధ్య జరిగిన రెండో టీ20 మ్యాచ్‌కు హాజరయ్యాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత టీమిండియా డ్రెస్సింగ్ రూమ్‌లోకి వచ్చిన మహీ .. ఆటగాళ్లందరితో ముచ్చటించాడు. యువ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్, స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్, జట్టు సహాయక సిబ్బందితో మాట్లాడుతున్న ఫొటోలను బీసీసీఐ ట్విటర్ వేదికగా అభిమానులతో పంచుకుంది. దీనికి గ్రేట్ ధోనీ మాట్లాడుతుంటే వినేందుకు అందరూ సిద్ధమే అని క్యాప్షన్‌గా పేర్కొంది. అలాగే, స్టేడియంలో రిషభ్ పంత్ తో ధోనీ ఫొటో దిగాడు. ఇవన్నీ ట్విటర్‌లో హల్‌చల్ చేస్తున్నాయి.

దుమ్మురేపిన బౌలర్లు..

దుమ్మురేపిన బౌలర్లు..

ఈ మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన టీమిండియా 49 పరుగులతో గెలుపొందింది. ఈ విజయంతో రోహిత్ సేన మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0తో సిరీస్ కైవసం చేసుకుంది. మొదట భారత్‌ 20 ఓవర్లలో 8 వికెట్లకు 170 పరుగులు చేసింది. రవీంద్ర జడేజా (29 బంతుల్లో 46 నాటౌట్‌; 5 ఫోర్లు), రోహిత్‌ శర్మ (20 బంతుల్లో 31; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించారు.

ఇంగ్లండ్‌ బౌలర్లు జోర్డాన్‌ (4/27), గ్లీసన్‌ (3/15) అదరగొట్టారు. తర్వాత ఇంగ్లండ్‌ 17 ఓవర్లలో 121 పరుగులకే కుప్పకూలింది. మొయిన్‌ అలీ (21 బంతుల్లో 35; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), డేవిడ్‌ విల్లే (22 బంతుల్లో 33 నాటౌట్‌; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) పరువు నిలిపే పరుగులు చేశారు. భువనేశ్వర్‌ (3/15), బుమ్రా (2/10), యజువేంద్ర చహల్‌ (2/10)ల నమ్మశక్యంకాని బౌలింగ్‌తో ఇంగ్లండ్ పతనాన్ని శాసించారు.

Story first published: Sunday, July 10, 2022, 11:17 [IST]
Other articles published on Jul 10, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+