Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వైభవ్‌కు చోటివ్వకపోవడమే న్యాయం, ధర్మం: టీమిండియా బౌలింగ్ కోచ్

ఓపెనర్లు సంజూ శాంసన్, అభిషేక్ శర్మకు టీమిండియా మేనేజ్‌మెంట్ అండగా ఉంటుందని బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ తెలిపాడు. 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ కోసం సంజూ,అభిషేక్ శర్మల్లో ఒకర్ని తొలగించడం లేదా బ్యాటింగ్ ఆర్డర్‌ మార్పు చేయడం సరికాదని అభిప్రాయపడ్డాడు. ప్రపంచకప్ గెలిపించిన ఈ ఇద్దరు ఓపెనర్లకు అండగా ఉండటమే న్యాయం, ధర్మం అని స్పష్టం చేశాడు.

భారత్ X ఇంగ్లండ్ రెండో టీ20కి అడ్డంకి!

భారత్ X ఇంగ్లండ్ రెండో టీ20కి అడ్డంకి!

ఐపీఎల్‌లో సంచలన ప్రదర్శనతో భారత జట్టులో చోటు దక్కించుకున్న టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ అరంగేట్రం కోసం ఎదురు చూస్తున్నాడు. వరుసగా మూడు మ్యాచ్‌ల్లో అతన్ని బెంచ్‌కే పరిమితం చేయడంతో అభిమానులు కోల్పోయి మేనేజ్‌మెంట్‌పై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ మూడు మ్యాచ్‌ల్లో విఫలమైన సంజూ శాంసన్‌ను పక్కనపెట్టి వైభవ్ సూర్యవంశీని ఆడించాలని డిమాండ్ చేస్తున్నారు. కానీ మేనేజ్‌మెంట్ మాత్రం సీనియర్ ఆటగాళ్లకే ప్రాధాన్యత ఇస్తుంది.

IND vs ENG Bowling Coach Morne Morkel Assures Unconditional Support for World Cup Winners Despite Dip in Form

వైభవ్‌ను నేరుగా ఆడించలేం..

ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న టీమిండియా.. ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా శనివారం రెండో టీ20 ఆడనుంది. ఈ మ్యాచ్ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన మోర్నీ మోర్కెల్‌ను వైభవ్ సూర్యవంశీ అరంగేట్రం గురించి ప్రశ్నించగా.. అతను ఇంకొన్నాళ్లు వేచి చూడాల్సిందేనని పరోక్షంగా వెల్లడించాడు.

'వైభవ్ సూర్యవంశీని నేరుగా తుది జట్టులో ఆడించడం అంత సులువు కాదు. ప్రపంచకప్‌‌లు గెలిపించి, క్లిష్ట పరిస్థితుల్లో బాగా రాణించిన ఆటగాళ్లకు అండగా ఉండటం ముఖ్యం. ప్రస్తుత పరిస్థితుల్లో టాపార్డర్‌ను అత్యుత్తమంగా మార్చడానికి, జట్టును నిర్మించడానికి ప్రయత్నించాలి.

అతను వరల్డ్ నెంబర్ వన్ బ్యాటర్..

వైభవ్ కోసం ఆటగాళ్లను తప్పించాలని.. బ్యాటింగ్ ఆర్డర్‌లో మార్పు చేయాలని మేం అనుకోవడం లేదు. టీ20 క్రికెట్‌లోనే వరల్డ్ నెంబర్ వన్ బ్యాటర్ అయిన అభిషేక్ శర్మ జట్టులో ఉన్నాడనే విషయాన్ని మనం గౌరవించాలి. సంజూ శాంసన్ ప్రపంచకప్‌లో అద్భుతంగా రాణించాడు. ఐపీఎల్‌లో కూడా సత్తా చాటాడు. కోచ్‌లుగా మా ఆటగాళ్లను నమ్మి, వారికి మద్దతు ఇవ్వడమే మేం చేయాల్సిన సరైన పని. ఒక యువ ప్లేయర్ అరంగేట్రానికి సిద్దంగా ఉండటం చాలా ఉత్సాహాన్నిస్తుంది. కానీ టాప్ 2 బ్యాటర్లే కాకుండా జట్టులోని మిగతా వారందరికీ మేం అండగా ఉన్నామని తెలియజేయడం ఒక మంచి సంకేతం.

IND Vs ENG: వైభవ్ కోసం సంజూ‌నే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు: సబా కరీం

IND Vs ENG: వైభవ్ కోసం సంజూ‌నే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు: సబా కరీం

వైభవ్ బాగా కలిసిపోయాడు..

వైభవ్ సూర్యవంశీ జట్టుతో చాలా బాగా కలిసిపోయాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆటగాళ్లను అనుసరిస్తే వారితో కలిసి వైభవ్ దిగిన ఫొటోలు ఇప్పటికే చాలా కనిపిస్తాయి. జట్టు అతనికి అద్భుతంగా స్వాగతం పలికింది. 15 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టడం కొంచెం భయపెట్టేదిగా ఉంటుంది. కానీ మేం నిర్వహించిన కొన్ని ప్రాక్టీస్ సెషన్లలో వైభవ్ తన ఆటతో అందర్నీ ఆకట్టుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ ఆడేందుకు అతను సిద్దంగా ఉన్నాడు. అవకాశం వచ్చినప్పుడు అతను సత్తా చాటుతాడనే నమ్మకం నాకుంది.'అని మోర్నీ మోర్కెల్ చెప్పుకొచ్చాడు.

Story first published: Saturday, July 4, 2026, 17:08 [IST]
Other articles published on Jul 4, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+