Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs ENG: సిరాజ్ కమాల్.. బిగ్ పార్టనర్‌షిప్‌కు బ్రేక్!

 IND vs ENG: Mohammed Siraj gets Bairstow for 37 breaks 89-run partnership
Mohammed Siraj బ్రేక్ త్రూ, Bairstow వికెట్ల ముందు బోల్తా IND vs ENG || Oneindia Telugu

ఓవల్: ఇంగ్లండ్‌‌తో జరుగుతున్న నాలుగో టెస్ట్‌లో ఇంగ్లండ్ కీలక బెయిర్ స్టో(37) వికెట్ కోల్పోయింది. క్రీజులో పాతుకుపోయిన అతన్ని మహమ్మద్ సిరాజ్ అద్భుత బంతితో వికెట్ల ముందు బోల్తా కొట్టించాడు. సిరాజ్ వేసిన 47 ఓవర్ ఐదో బంతిని అంచనా వేయడంలో విఫలమైన బెయిర్ స్టో వికెట్ల ముందు దొరికిపోయాడు. రివ్యూ తీసుకున్నా ఫలితం లేకపోయింది. దాంతో 6వ వికెట్‌కు నమోదైన 89 పరుగుల భారీ భాగస్వామ్యానికి తెరపడింది. క్రీజులోకి ఆల్‌రౌండర్ మోయిన్ అలీ(4 బ్యాటింగ్) రాగా.. ఓలీ పోప్(58 బ్యాటింగ్) ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపిస్తున్నాడు.

అంతకుముందు 53/3 ఓవర్‌నైట్ స్కోరుతో రెండో రోజు ఆటను కొనసాగించిన ఇంగ్లండ్ ఆదిలోనే ఓవర్‌నైట్ బ్యాట్స్‌మన్ డేవిడ్ మలాన్‌ (31), ఒవర్టన్‌ (1 )వికెట్లను కోల్పోయింది. ఉమేశ్ యాదవ్ బౌలింగ్‌లో ఈ ఇద్దరు పెవిలియన్ చేరారు. ముందుగా నైట్ వాచ్‌మన్ ఓవర్టన్‌ను స్లిప్ క్యాచ్‌గా పెవిలియన్ చేర్చిన ఉమేశ్ యాదవ్.. ఆ తర్వాత డెవిడ్ మలాన్‌ను కూడా స్లిప్ క్యాచ్‌గానే ఔట్ చేశాడు. దాంతో 62 పరుగులకే 5 కీలక వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ పీకల్లోతు కష్టాల్లో పడింది.

ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన బెయిర్ స్టో, ఓలీపోప్ ధాటిగా ఆడుతూ స్కోర్ బోర్డు పరుగెత్తించారు. మహమ్మద్ సిరాజ్ బౌలింగ్‌లో బెయిర్ స్టో వరుస బౌండరీలతో దూకుడు కనబర్చగా.. శార్దూల్, ఉమేశ్ బౌలింగ్‌లోనూ ఓలీ పోప్ ధాటిగా ఆడాడు. దాంతో ఇంగ్లండ్ 139/5 స్కోర్‌తో లంచ్ బ్రేక్‌కు వెళ్లింది. ఈ ఇద్దరి జోరుతో ఫస్ట్ సెషన్‌‌ను ఇరు జట్లు సమంగా పంచుకున్నాయి. ఇక లంచ్ బ్రేక్ తర్వాత సిరాజ్.. బెయిర్ స్టోను ఔట్ చేసి బ్రేక్ త్రూ అందించాడు. బిగ్ పార్టనర్‌షిప్‌కు బ్రేక్ వేసాడు. ఆ తర్వాత మొయిన్ అలీ బ్యాటింగ్‌కు రాగా.. ఓలీ పోప్ 92 బంతుల్లో 6 ఫోర్లతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇంగ్లండ్ ఇంకా 19 పరుగుల వెనుకంజలో ఉంది.

ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 61.3 ఓవర్లలో 191 పరుగుల వద్ద ఆలౌటైంది. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ (96 బంతుల్లో 8 ఫోర్లతో 50), శార్దుల్‌ ఠాకూర్‌ (36 బంతుల్లో 57; 7 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధ సెంచరీలతో రాణించారు. రాబిన్సన్‌కు 3 వికెట్లు దక్కాయి. షమీ, ఇషాంత్‌ల స్థానాల్లో వచ్చిన శార్దుల్, ఉమేశ్‌ తమ ఎంపికకు న్యాయం చేశారు. తొలి ఇన్నింగ్స్‌ను ఉత్సాహంగా ప్రారంభించిన ఇంగ్లండ్‌పై బుమ్రా (2/15) నిప్పులు చెరిగాడు. బర్న్స్‌ (5)ను బౌల్డ్‌ చేశాడు. హమీద్‌ (0)ను కీపర్‌ పంత్‌ క్యాచ్‌తో పెవిలియన్‌ చేర్చాడు. ఉమేశ్‌ అత్యంత కీలకమైన సెంచరీల మాస్టర్, కెప్టెన్‌ రూట్‌ (21)ను క్లీన్‌బౌల్డ్‌ చేశాడు.

Story first published: Friday, September 3, 2021, 19:18 [IST]
Other articles published on Sep 3, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+