
నాటింగ్‌హోమ్: భారత్, ఇంగ్లండ్ మధ్య తొలి టెస్ట్ రసవత్తరంగా సాగుతోంది. బౌలింగ్‌లో చెలరేగి ప్రత్యర్థిని తక్కువ స్కోర్‌కే పరిమితం చేసిన భారత జట్టు.. ఆ తర్వాత కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా సూపర్ బ్యాటింగ్‌కు తోడు చివర్లో జస్‌ప్రీత్ బుమ్రా మెరుపులు మెరిపించడంతో 95 పరుగుల ఆధిక్యాన్ని అందుకుంది. అయితే మ్యాచ్‌లో మూడో రోజైన శుక్రవారం జస్‌ప్రీత్ బుమ్రా (34 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 28) వరుస బౌండరీలతో మెరుపులు మెరిపించాడు. హైదరాబాద్ పేసర్ మహమ్మద్ సిరాజ్ ( 8 బంతుల్లో 1ఫోర్ 7 నాటౌట్)కలిసి పదో వికెట్‌కి 33 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. దాంతో ఇంగ్లాండ్ బౌలర్లు సహనం కోల్పోయారు. సామ్ కరన్ వేసిన ఓ ఓవర్‌లో బుమ్రా వరుసగా 4,6,4 బాదేయగా.. అండర్సన్ బౌలింగ్‌లోనూ పరుగులు వచ్చాయి.
బుమ్రా, సిరాజ్ ఇన్నింగ్స్ చివర్లో వేగంగా పరుగులు రాబట్టడంతో ఓ దశలో జేమ్స్ అండర్సన్ సహనం కోల్పోయి స్లెడ్జింగ్‌కు దిగాడు. బౌన్సర్ బంతులతో సిరాజ్‌ను కవ్వించే ప్రయత్నం చేశాడు. అంతటితో ఆగకుండా సిరాజ్‌పై నోరు పారేసుకున్నాడు. దీనికి సిరాజ్ సైతం ధీటుగా బదులిచ్చాడు. అదే రీతిలో మాటలతో బదులిస్తూనే అండర్సన్‌ను భుజంతో ఢీకొట్టి మరింత రెచ్చగొట్టాడు. ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సిరాజ్ నుంచి ఊహించనిరీతిలో ప్రతిఘటన ఎదురవడంతో అండర్సన్ ఆ తర్వాత మౌనంగా ఉండిపోయాడు.
ఇక ఓవర్‌నైట్ స్కోరు 125/4తో మూడో రోజైన శుక్రవారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్ 278 వద్ద ఆలౌటైంది. ఓవర్‌నైట్ బ్యాట్స్‌మన్ కేఎల్ రాహుల్ (84) మరో 27 రన్స్ జోడించగా... ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా (86 బంతుల్లో 8 ఫోర్లు, సిక్సర్‌తో 56) అర్ధ సెంచరీతో చెలరేగాడు. బుమ్రా 28, పంత్ 25 పరుగులు చేశారు. రాబిన్‌సన్ 5, అండర్సన్ 4 వికెట్లు తీశారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ వర్షంతో ఆట నిలిపివేసే సమయానికి 25/0 స్కోరు చేసింది. అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 183 స్కోరు వద్ద ఆలౌటైంది. నాలుగో రోజు ఆట టీ విరామానికి ఇంగ్లండ్ 2 వికెట్లు కోల్పోయి 71 పరుగులు చేసింది.