Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Ind vs Eng: తుది జట్టులో అశ్విన్ లేడా.. నేను నమ్మలేకపోతున్నా! ఆరు వికెట్లు తీసినా లాభం లేకపాయె!!

Ind vs Eng: Michael Vaughan Shocked After No Ashwin In India Playing 11

హైదరాబాద్: లార్డ్స్ వేదికగా భారత్‌, ఇంగ్లండ్ జట్ల మధ్య రెండో టెస్టు మొదలైంది. వర్షం కురవడంతో టాస్‌ 20 నిమిషాలు ఆలస్యమైన సంగతి తెలిసిందే. టాస్‌ గెలిచిన ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్‌ ఫీల్డింగ్‌ ఎంచుకున్నాడు. ఇంగ్లీష్ జట్టు మూడు మార్పులు చేసింది. డాన్‌ లారెన్స్‌, జాక్‌ క్రాలీ, స్టువర్ట్‌ బ్రాడ్‌ స్థానాల్లో మొయిన్‌ అలీ, హసీబ్ హమీద్‌, మార్క్‌ వుడ్‌ జట్టులోకి వచ్చారు. వర్షం పడడం, వాతావరణం చల్లగా ఉండటంతో.. సొంతగడ్డ అనూకూలతను ఉపయోగించుకునేందుకు ఇంగ్లండ్ బౌలింగ్‌ తీసుకుంది. మరోవైపు గాయపడ్డ శార్దూల్‌ ఠాకూర్‌ బదులు ఇషాంత్‌ శర్మను టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ జట్టులోకి తీసుకున్నాడు.

అశ్విన్‌కు మరోసారి నిరాశే

రెండో టెస్ట్ ఆరంభానికి ముందు నలుగురు పేసర్లు, ఒక స్పిన్నర్‌తో బరిలోకి దిగుతామని కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పష్టం చేశాడు. అదే సమయంలో ఆల్‌రౌండర్‌ శార్దూల్‌ ఠాకూర్‌కు గాయం అయింది. రెండో టెస్ట్ కోసం మంగళవారం సాధన చేసేటప్పుడు శార్దూల్‌ పిక్క కండరాలకు గాయం అయింది. అతడు రెండో టెస్ట్ ఆడడని తేలిపోయింది.

దీంతో స్పెషలిస్ట్ స్పిన్నర్ అయిన రవిచంద్రన్ అశ్విన్‌ జట్టులోకి వస్తాడని అందరూ ఊహించారు. మాజీలు కూడా అశ్విన్‌ను జట్టులోకి తీసుకోవాలి సూచించారు. అయితే కెప్టెన్ విరాట్ కోహ్లీ మాత్రం స్పిన్ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజాపై నమ్మకం ఉంచి.. సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మను తుది జట్టులోకి తీసుకున్నాడు. దీంతో అశ్విన్‌కు మరోసారి నిరాశే ఎదురైంది.

అశ్విన్ లేడా

అశ్విన్ లేడా

రవిచంద్రన్ అశ్విన్‌కు రెండో టెస్టులో చోటు దక్కకపోవడంపై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్, స్టార్ కామెంటేటర్ మైఖేల్ వాన్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. 'నో అశ్విన్' అంటూ ఓ ట్వీట్ చేశాడు. తుది జట్టులో రవిచంద్రన్ అశ్విన్ లేడా.. నేను నమ్మలేకపోతున్నా అని తన అసహనం వ్యక్తం చేశాడు. అయితే కొందరు నెటిజన్లు అశ్విన్‌కు మద్దతుగా నిలిస్తే.. మరికొందరు మాత్రం విమర్శిస్తున్నారు. 'యాష్ భారతదేశం వెలుపల బాగా బౌలింగ్ చేయలేడు. ఇది అందరికీ తెలుసు', 'విదేశీ గడ్డపై అశ్విన్ రాణించలేడు' అని ట్వీట్ చేస్తున్నారు. 'బ్యాడ్ టీమ్ సెలక్షన్', 'అశ్విన్ కంటే ఇషాంత్ చెత్త బ్యాట్స్‌మన్‌', 'అశ్విన్‌ను ఎందుకు తీసుకోలేదో కోహ్లీకి తెలుసా' అంటూ మరొకొందరు అండగా నిలిచారు.

ఒకే ఫ్రేమ్‌లో త‌ల‌ప‌తి విజ‌య్‌, త‌ల ధోనీ.. పండగ చేసుకుంటున్న ఫాన్స్!!

ఆరు వికెట్లు తీసినా లాభం లేకపాయె

ఆరు వికెట్లు తీసినా లాభం లేకపాయె

ఇంగ్లండ్ సిరీసుకు ముందు రవిచంద్రన్ అశ్విన్ కౌంటీ క్రికెట్ ఆడాడు. సర్రే తరఫున ఆడిన అశ్విన్.. ఒక ఇన్నింగ్స్‌లో 6 వికెట్లు పడగొట్టాడు. కౌంటీ జట్టు సోమర్‌సెట్‌తో జరిగిన మ్యాచులో యాష్ చెలరేగాడు. రెండో ఇన్నింగ్స్‌లో 15 ఓవర్లు వేసిన అశ్విన్.. 6 వికెట్లు తీశాడు. ఏకధాటిగా 15 ఓవర్లు వేసి సోమర్‌సెట్‌ నడ్డివిరిచాడు. వెటరన్ స్పిన్నర్ ధాటికి సోమర్‌సెట్‌ 69 పరుగులకే ఆలౌట్ అయింది. ముగ్గురు బ్యాట్స్‌మన్‌ మాత్రమే రెండంకెల స్కోర్ అందుకున్నాడు. ఈ మ్యాచ్ జరిగిన తర్వాత కూడా అశ్విన్‌కు తొలి, రెండో టెస్టులో చోటు దక్కలేదు. మొత్తానికి ఆరు వికెట్లు తీసినా లాభం లేకపాయె.

మరోసారి అడ్డుపడ్డ వరుణుడు

మరోసారి అడ్డుపడ్డ వరుణుడు

తొలి టెస్టులాగే రెండో టెస్టుకు కూడా వరుణుడు అడ్డంకిగా మారాడు. తొలి రోజు ఆట ప్రారంభానికి ముందే అరగంట ఆలస్యం కాగా.. ఇప్పుడు తాజాగా మరోసారి అడ్డుపడ్డాడు. దాంతో అంపైర్లు 18.4 ఓవర్ల వద్ద ఆటను నిలిపివేశారు. అప్పటికి రోహిత్‌ శర్మ (35), కేఎల్ రాహుల్‌ (10) పరుగులతో ఉన్నారు. టీమిండియా స్కోర్‌ 46/0గా నమోదైంది. వరుణుడు అడ్డంకిగా మారడంతో తొలి టెస్టులో గెలవాల్సిన భారత్.. విజయాన్ని అందుకోలేకపోయింది.

Story first published: Thursday, August 12, 2021, 17:57 [IST]
Other articles published on Aug 12, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+