
ఒకే ఫ్రేమ్‌లో తలపతి, తల
తమిళులు ఎంతగానో ఆరాధించే స్టార్ హీరో తలపతి విజయ్.. టీమిండియా మాజీ కెప్టెన్, ఐపీఎల్ టీమ్ చెన్నై సూపర్ కింగ్స్ సారథి ఎంఎస్ ధోనీ కలిసి దిగిన ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చెన్నైలోని గోకులం స్టూడియోలో బీస్ట్ షూటింగ్ కోసం వెళ్లిన విజయ్.. కమర్సియల్స్ షూట్‌లో పాల్గొనడానికి వెళ్లిన ధోనీ కలిశారు. ఒకే స్టూడియోలో ఉన్నామని తెలియడంతో ఈ ఇద్దరూ కలిసి కాసేపు సరదాగా ముచ్చటించుకున్నారు. చాలా సమయం తలపతి, తల మాట్లాడుకున్నారట. ఇద్దరు కలిసి ఒకే ఫ్రేమ్‌లో కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.

అంబాసిడర్‌గా విజయ్
2008లో తొలిసారి చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ లాంచ్ చేసినప్పుడు తమిళ స్టార్ హీరో విజయ్ ఆ టీమ్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నాడు. ఆయతో పాటు స్టార్ హీరోయిన్ నయనతార కూడా బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించింది. ఆ తర్వాత తలపతి, తల ఇద్దరూ కలవడం ఇదే తొలిసారి. ఎంఎస్ ధోనీ ఫ్రెండ్ సీమంత్ లొహానీ ఈ ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు.
'దీనికి క్యాప్షన్ అవసరం లేదు.. తలపతి, తల' అని లొహానీ ఈ ఫొటోకు కామెంట్ చేశాడు. తమిళ సూపర్‌స్టార్ విజయ్‌ను అభిమానులు ముద్దుగా 'తలపతి' అని పిలుస్తారు. అలాగే కెప్టెన్ కూల్ ఎంఎస్ ధోనీని తల (లీడర్) అని అంటారు. ధోనీ ఈ కమర్షియల్ షూటింగ్స్ పూర్తి చేసిన తర్వాత ఐపీఎల్ 2021 కోసం ఈ నెల 13న చెన్నై టీమ్‌తో కలిసి దుబాయ్ వెళ్లనున్నాడు.

చెన్నై చేరుకున్న ధోనీ
యూఏఈ వేదికగా సెప్టెంబరు 19 నుంచి అక్టోబరు 15 వరకూ ఐపీఎల్ 2021 సీజన్ రెండో దశ మ్యాచ్‌లు జరగనుండగా.. చెన్నై నుంచి చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ బయల్దేరనుంది. ఈ మేరకు కెప్టెన్ ఎంఎస్ ధోనీ తాజాగా అక్కడికి చేరుకోగా.. మిగిలిన క్రికెటర్లు కూడా అక్కడికి త్వరలోనే రానున్నారు.
చెన్నైలో ఈసారి ఎలాంటి క్యాంప్‌ని ఏర్పాటు చేయబోమని ఆ టీమ్ సీఈవో కాశీ విశ్వనాథన్ ఇప్పటికే స్పష్టం చేశాడు. మహీ వెంట అతని భార్య సాక్షి ధోనీ, కూతురు జీవా ఉన్నారు. అంబటి రాయుడు, సురేష్ రైనా కూడా చెన్నై చేరుకున్నారని ససమాచారం. ప్రస్తుతం అక్కడికి వచ్చిన చెన్నై ప్లేయర్స్ అందరికి కరోనా నెగటివ్ వచ్చిందట.

37 పరుగులే
ఐపీఎల్ 2021 సీజన్‌లో ఏడు మ్యాచ్‌లాడిన ఎంఎస్ ధోనీ 12.33 సగటుతో కేవలం 37 పరుగులే చేశాడు. ఇందులో నాలుగు ఫోర్లు, ఒక సిక్స్ మాత్రమే ఉన్నాయి. గెలిపించే ఇన్నింగ్స్ ఒక్కటీ కూడా ఆడలేదు. దాంతో మిగిలిన మ్యాచ్‌ల్లోనైనా ధోనీ చెలరేగాలని చెన్నై అభిమానులు ఆశిస్తున్నారు. ఆ ఏడు మ్యాచ్‌ల్లో బ్యాటింగ్‌లో ధోనీ ఫెయిలైనా.. కెప్టెన్, వికెట్ కీపర్‌గా మాత్రం అద్భుతంగా రాణించాడు.
ఐపీఎల్ 2021 సీజన్ వాయిదాపడే సమయానికి 7 మ్యాచ్‌లాడిన చెన్నై సూపర్ కింగ్స్.. ఐదింట్లో గెలుపొంది పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. మొదటి స్థానంలో ఢిల్లీ క్యాపిటల్స్ (12 పాయింట్లు) ఆరు విజయాలతో ఉండగా.. మూడో స్థానంలో రాయల్స్ ఛాలెంజర్స్ బెంగళూరు (10 పాయింట్లు), నాలుగులో ముంబై ఇండియన్స్ (8 పాయింట్లు) ఉన్నాయి.

ఆగష్టు 15న రిటైర్మెంట్
టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ చివరగా 2019 వరల్డ్ కప్ సెమీ ఫైనల్ మ్యాచ్ ఆడాడు. న్యూజిలాండ్‌తో జరిగిన సెమీ ఫైనల్లో 18 పరుగుల తేడాతో కోహ్లీసేన ఓటమిపాలైంది. అదే మహీకి చివరి మ్యాచ్ అని అప్పుడు ఎవరూ కూడా ఊహించలేదు. ఆ మ్యాచ్ జరిగిన ఏడాదికి మహీ ఆటకు వీడ్కోలు చెప్పాడు.
గతేడాది ఆగష్టు 15న ధోనీ రిటైర్మెంట్ ఇచ్చాడు. దీంతో యావత్ క్రీడాలోకం ఒక్కసారిగా ఆచర్యపోయింది. అంతర్జాతీయ కెరీర్‌లో ఎంఎస్ ధోనీ 90 టెస్ట్ మ్యాచ్‌ల్లో 4876 పరుగులు చేశాడు. ఇందులో 6 సెంచరీలు, 33 అర్ధ శతకాలు ఉన్నాయి. 350 వన్డే మ్యాచ్‌ల్లో 10773 రన్స్ చేశాడు. 10 శతకాలతో పాటు 73 అర్థ శతకాలు ఉన్నాయి. ఇక 98 టీ20 మ్యాచ్‌లలో 1600 పరుగుల బాదాడు.


Click it and Unblock the Notifications

IND vs ENG:టీమిండియాదే బ్యాటింగ్..మూడు మార్పుతో బరిలోకి ఇంగ్లండ్!శార్దూల్ ఔట్..ఇషాంత్ ఇన్!అశ్విన్‌కు నిరాశే!










