Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs ENG: శుభ్‌మన్ గిల్ శతకం.. ఇంగ్లండ్ ముందు కొండంత లక్ష్యం!

ఇంగ్లండ్‌తో రెండో టెస్ట్‌ రెండో ఇన్నింగ్స్‌లోనూ టీమిండియా బ్యాటర్లు దుమ్మురేపారు. తొలి ఇన్నింగ్స్ జోరును కొనసాగిస్తూ.. ఇంగ్లండ్ బౌలర్లను చెడుగుడు ఆడారు. దాంతో 64/1 ఓవర్‌నైట్ స్కోర్‌తో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 427/6 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్(162 బంతుల్లో 13 ఫోర్లు, 8 సిక్స్‌లతో 161) మరో భారీ శకంతో చెలరేగాడు.

కేఎల్ రాహుల్(84 బంతుల్లో 10 ఫోర్లతో 55), రిషభ్ పంత్(58 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్‌లతో 65), రవీంద్ర జడేజా(118 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 69) హాఫ్ సెంచరీలతో రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో జోష్ టంగ్(2/93), షోయబ్ బషీర్(2/119) రెండేసి వికెట్లు తీయగా.. బ్రైడన్ కార్స్, జో రూట్ చెరో వికెట్ పడగొట్టారు. దాంతో ఇంగ్లండ్ ముందు 608 పరుగుల భారీ లక్ష్యం నమోదైంది.

IND vs ENG Massive Target Set India Declare at 427 6 Leave England to Chase 608 in 2nd Test

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 587 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసిన సంగతి తెలిసిందే. అనంతరం ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 407 పరుగులకు ఆలౌటైంది. దాంతో భారత్‌కు 180 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది.

సంక్షిప్త స్కోర్లు:

భారత్ తొలి ఇన్నింగ్స్ 587 ఆలౌట్ (శుభ్‌మన్ గిల్ 269; షోయబ్ బషీర్ 3/167)

ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ 407 ఆలౌట్ (జెమీ స్మిత్ 184 నాటౌట్, సిరాజ్ 6/70)

భారత్ రెండో ఇన్నింగ్స్ 427/6 డిక్లేర్డ్ (శుభ్‌మన్ గిల్ 161, జోష్ టంగ్ 2/93)

Story first published: Saturday, July 5, 2025, 22:00 [IST]
Other articles published on Jul 5, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+