Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs ENG: అతని కెరీర్ ముగిసేలా గంభీర్, గిల్ కుట్ర?

టీమిండియా హెడ్ కోచ్ గౌతం గంభీర్‌, కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌పై స్టార్ స్పిన్నర్ కుల్దీ యాదవ్ చిన్ననాటి కోచ్ కపిల్ పాండే ఆగ్రహం వ్యక్తం చేశారు. కుల్దీప్ యాదవ్ కెరీర్‌ను ముగించేలా గంభీర్ కుట్ర చేస్తున్నాడని ఆరోపించారు. ఇంగ్లండ్ పర్యటనలో కుల్దీప్ యాదవ్‌‌ను తుది జట్టులో ఆడించకపోవడాన్ని పాండే తప్పుబట్టారు. ఇంగ్లండ్ గడ్డపై కుల్దీప్ యాదవ్‌కు మెరుగైన రికార్డ్ ఉందని తెలిపారు. ఆస్ట్రేలియా దివంగత స్పిన్నర్ షేన్ వార్న్.. ఇంగ్లండ్‌ గడ్డపై మెరుగైన ప్రదర్శన చేశారని గుర్తు చేశాడు.

ఇంగ్లండ్ పర్యటనలో వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లోనూ కుల్దీప్ యాదవ్‌కు అవకాశం దక్కలేదు. బ్యాటింగ్ డెప్త్ కోసం టీమిండియా ఇద్దరు స్పిన్ ఆల్‌రౌండర్లు రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్‌తో ఆడుతోంది. కుల్దీప్ యాదవ్‌ను ఆడించాలని క్రికెట్ విశ్లేషకులు సూచిస్తున్నా.. గంభీర్ పట్టించుకోవడం లేదు. మాంచెస్టర్ వేదికగా బుధవారం ప్రారంభమైన నాలుగో టెస్ట్‌లోనైనా కుల్దీప్ యాదవ్‌కు అవకాశం దక్కుతుందని అంతా భావించారు. కానీ గంభీర్ మరోసారి బ్యాటింగ్ డెప్త్ కోసం వాషింగ్టన్ సుందర్‌నే కొనసాగించాడు. దాంతో కుల్దీప్ యాదవ్‌కు నిరాశ తప్పలేదు.

IND vs ENG Kuldeep Yadav s coach slams Gambhir Gill for conspiracy theory against spinner

మూల్యం చెల్లించుకున్నా..

నాలుగో టెస్ట్‌లో కుల్దీప్ యాదవ్‌కు అవకాశం ఇవ్వకపోవడంపై స్పందించిన కపిల్ పాండే.. గంభీర్‌పై విమర్శలు గుప్పించారు. సూపర్ ఫామ్‌లో ఉన్న కుల్దీప్ నైపుణ్యాలను ఉపయోగించుకోకపోవడంపై మండిపడ్డారు. 'కుల్దీప్ యాదవ్‌ను ఆడించకుండా టీమిండియా ఇప్పటికే చాలా సార్లు మూల్యం చెల్లించుకుంది. ప్రస్తుతం అతను సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీలోనూ మెరుగైన ప్రదర్శన చేశాడు. సరైన సమయంలో అతనికి అవకాశం ఇవ్వడం లేదు. ఇది జట్టుకు తీరని నష్టం చేస్తుంది.

కుల్దీప్ యాదవ్ 2017లో టెస్ట్ క్రికెట్‌లోకి అరంగేట్రం చేస్తే.. ఇప్పటి వరకు కేవలం 13 టెస్ట్ మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. అవకాశం వచ్చినప్పుడుల్లా నిలకడగా రాణిస్తున్నాడు. గతంలో మ్యాచ్ విన్నింగ్ పెర్ఫామెన్స్ చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్న తర్వాత కూడా తుది జట్టులో చోటివ్వలేదు. ఇంగ్లండ్ పర్యటనలో భారత వైఫల్యానికి ప్రధాన కారణం బ్యాటింగ్ వైఫల్యమే. బౌలర్లు మెరుగ్గానే రాణించారు. బౌలర్ల నుంచి పరుగులు ఆశించడం సరికాదు. బుమ్రా, కుల్దీప్ వంటి వాళ్ల నుంచి అద్భుతమైన బౌలింగ్‌నే ఆశించాలి తప్పా బ్యాటింగ్‌ను కాదు. మాంచెస్టర్ వికెట్ స్పిన్‌కు అనుకూలంగా ఉంటుంది. కుల్దీప్ యాదవ్ వంటి మణికట్టు స్పిన్నర్ టీమిండియాకు కీలకమయ్యేవాడు.

సవతి తల్లి ప్రేమ

కుల్దీప్ యాదవ్ మనోధైర్యం ఎక్కువగా ఉన్నప్పటికీ.. అవకాశం కోసం నిరీక్షించి నిరాశకు గురి కావచ్చు. అతను కూడా మనిషే కదా? కుల్దీప్ కెరీర్ ముగిసేలా గంభీర్ కుట్ర చేస్తున్నాడనిపిస్తోంది. కుల్దీప్ వేరే దేశానికి ఆడి ఉంటే ఇప్పటికే టెస్ట్‌ల్లో 200 వికెట్లు తీసేవాడు. టీమ్ మేనేజ్‌మెంట్ కుల్దీప్ యాదవ్ పట్ల సవతి తల్లి ప్రేమ చూపిస్తోంది. ఇంగ్లండ్ గడ్డపై షేన్ వార్న్ సత్తా చాటాడు. ఇంగ్లండ్ జట్టులో షోయబ్ బషీర్ వరుసగా మూడు మ్యాచ్‌లు ఆడి రాణించాడు. యువ పేసర్ అన్షూల్ కంబోజ్‌కు కూడా అవకాశం దక్కింది. కెప్టెన్, కోచ్ సిఫార్సు లేకుండా అతనికి అవకాశం దక్కదు. కోచ్‌గా కుల్దీప్ యాదవ్‌తో నేను తరుచుగా మాట్లాడుతాను. ఫిట్‌గా ఉండాలని, అవకాశం వచ్చినప్పుడు సద్వినియోగం చేసుకోవాలని చెబుతాను. తుది జట్టు ఎంపిక కోచ్, కెప్టెన్‌పైనే ఆధారపడి ఉంటుంది. 'అని కపిల్ పాండే చెప్పుకొచ్చారు.

Story first published: Thursday, July 24, 2025, 21:22 [IST]
Other articles published on Jul 24, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+