Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs ENG: కొంపముంచిన కేఎల్ రాహుల్!

ఇంగ్లండ్ పర్యటనలో టీమిండియా ఫీల్డింగ్ వైఫల్యం కొనసాగుతోంది. లార్డ్స్ వేదికగా జరుగుతున్న మూడో టెస్ట్‌లోనూ భారత ఆటగాళ్లు కీలకమైన క్యాచ్‌లను నేలపాలు చేశారు. తొలి ఇన్నింగ్స్‌లోనే 6 క్యాచ్‌లు వదిలేయడం గమనార్హం. ముఖ్యంగా రెండు రోజు ఆట ప్రారంభంలో టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ వదిలేసిన క్యాచ్‌ జట్టుకు తీవ్ర నష్టం చేసింది. మహమ్మద్ సిరాజ్ బౌలింగ్‌లో ఇంగ్లండ్ డేంజరస్ బ్యాటర్ జెమీ స్మిత్ ఇచ్చిన సునాయస క్యాచ్‌‌ను స్లిప్‌లో కేఎల్ రాహుల్ అందుకోలేకపోయాడు. మహమ్మద్ సిరాజ్ వేసిన 87 ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.

ఆ క్యాచ్ పట్టి ఉంటే..

ఈ క్యాచ్‌ను రాహుల్ పట్టి ఉంటే జెమీ స్మిత్ ఒక్క పరుగుకే వెనుదిరిగేవాడు. కానీ ఈ అవకాశంతో అతను క్రీజులో పాతుకుపోయాడు. ఈ ఓవర్‌కు ముందే బుమ్రా.. బెన్ స్టోక్స్‌(44) క్లీన్ బౌల్డ్ చేశాడు. రాహుల్ క్యాచ్ వదిలిన తర్వాతి ఓవర్‌లో వరుసగా రెండు వికెట్లు తీసాడు. జెమీ స్మిత్ కూడా ఔటై ఉంటే ఇంగ్లండ్ తొలి సెషన్‌లోనే ఆలౌటయ్యేది. కానీ రాహుల్ ఇచ్చిన లైఫ్‌తో స్మిత్ చెలరేగాడు. దూకుడుగా ఆడి 56 బంతుల్లో 6 ఫోర్లతో 51 పరుగులు చేశాడు. బ్రైడన్ కార్స్‌తో కలిసి 8వ వికెట్‌కు 84 పరుగులు జోడించాడు. ఈ భాగస్వామ్యం ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌ను నిలబెట్టింది.

IND vs ENG KL Rahul s Costly Dropped Catch Hurts India in Lord s Test

6 క్యాచ్‌లు నేలపాలు..

సిరాజ్ బౌలింగ్‌లో ఆకాశ్ దీప్, ధ్రువ్ జురెల్ మరో రెండు క్యాచ్‌లు నేలపాలు చేశారు. తన బౌలింగ్‌లోనే క్యాచ్‌లు నేలపాలవ్వడంతో సిరాజ్ తీవ్ర అసహనానికి గురయ్యాడు. తొలి రోజు ఆటలోనూ భారత ఆటగాళ్లు మూడు కీలక క్యాచ్‌లు నేలపాలు చేశారు. బుమ్రా బౌలింగ్‌లో బెన్ డకెట్ ఇచ్చిన కష్టతరమైన క్యాచ్‌ను రిషభ్ పంత్ అందుకోలేకపోయాడు. నితీష్ బౌలింగ్‌లో ఒలీ పోప్ క్యాచ్‌ను గిల్ చేజార్చాడు. సిరాజ్ బౌలింగ్‌లో ఒలీ పోప్ ఇచ్చిన మరో క్యాచ్‌ను రాహుల్ అందుకోలేకపోయాడు. ఈ ఫీల్డింగ్ వైఫల్యం టీమిండియాకు తీరని నష్టం చేసింది.

ఇంగ్లండ్ భారీ స్కోర్..

ఇక 251/4‌ ఓవర్‌నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆటను కొనసాగించిన ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 387 పరుగులకే ఆలౌటైంది. జోరూట్(199 బంతుల్లో 10 ఫోర్లతో 104) సెంచరీతో రాణించగా.. జెమీ స్మిత్(56 బంతుల్లో 6 ఫోర్లతో 51), బ్రైడన్ కార్స్(83 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 56) హాఫ్ సెంచరీలతో రాణించారు. బెన్ స్టోక్స్(44), ఒలీ పోప్(44) కీలక ఇన్నింగ్స్ ఆడారు. భారత బౌలర్లలో జస్‌ప్రీత్ బుమ్రా(5/74) ఐదు వికెట్లు తీయగా.. మహమ్మద్ సిరాజ్(2/85), నితీష్ కుమార్ రెడ్డి(2/62) రెండేసి వికెట్లు పడగొట్టారు.

Story first published: Friday, July 11, 2025, 18:03 [IST]
Other articles published on Jul 11, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+