IND vs ENG: సెహ్వాగ్ సరసన కేఎల్ రాహుల్.. సెంచరీతో లార్డ్స్‌లో మోగిన రికార్డుల మోత!

లండన్: టీమిండియా స్టార్ ఓపెనర్ కేఎల్ రాహుల్ అరుదైన ఘనతలను సొంతం చేసుకున్నాడు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో సెంచరీతో రాణించిన ఈ కర్ణాటక బ్యాట్స్‌మన్.. మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ సరసన నిలిచాడు. గురువారం ప్రారంభమైన ఈ టెస్టులో మొదటిరోజు కేఎల్ రాహుల్ (248 బంతుల్లో 12 ఫోర్లు, సిక్స్‌తో 127 బ్యాటింగ్) సెంచరీ బాదడంతో.. భారత్ భారీ స్కోర్ దిశగా దూసుకెళ్తుంది.
రాహుల్‌కు ఇంది 6వ టెస్ట్ సెంచరీ కాగా... ఓవరాల్‌గా ఇంగ్లాండ్‌పై మూడోది. ఇక ప్రతిష్ఠాత్మక లార్డ్స్ స్టేడియంలో సెంచరీ బాదిన మూడో భారత ఓపెనర్‌గా ఘనత సాధించిన కేఎల్ రాహుల్.. ఆసియా వెలుపల నాలుగు టెస్టు సెంచరీలు బాదిన దిగ్గజ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ సరసన నిలిచాడు. ఈ ఇద్దరి కంటే ముందు వరుసలో సునీల్ గవాస్కర్ 12 సెంచరీలతో టాప్‌లో ఉన్నాడు.

69 ఏళ్ల రికార్డు బ్రేక్..
రోహిత్ శర్మతో కలిసి తొలి వికెట్‌కి 126 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన కేఎల్ రాహుల్.. 2011 తర్వాత ఆసియా వెలుపల భారత్‌కి మళ్లీ టెస్టుల్లో తొలి వికెట్‌కు శతక భాగస్వామ్యాన్ని అందించాడు. అలాగే లార్డ్స్‌లో 69 ఏళ్లుగా చెక్కుచెదరకుండా ఉన్న అరుదైన రికార్డును రోహిత్‌తో కలిసి అధిగమించాడు. 1952లో లార్డ్స్ వేదికగా జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో భారత్ తరఫున వినోద్ మన్కడ్-పంకజ్ రాయ్‌లు 106 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. తాజా రోహిత్-రాహుల్ 126 రన్స్‌తో ఆ రికార్డును అధిమించారు. రోహిత్ తర్వాత క్రీజులోకి వచ్చిన కోహ్లీతోనూ రాహుల్ 117 పరుగుల భాగస్వామ్యాన్ని అందించాడు.

లార్డ్స్‌లో మూడో ప్లేయర్..
క్రికెట్ మక్కా అయిన లార్డ్స్‌లో ఇప్పటి వరకూ భారత ఓపెనర్లు వినో మాన్కడ్ (184 పరుగులు, 1952లో), రవిశాస్త్రి (100, 1990లో) మాత్రమే సెంచరీలు సాధించారు. తాజాగా శతకంతో వారి సరసన కేఎల్ రాహుల్ నిలిచాడు. అలానే లార్డ్స్‌లో 2014లో చివరిగా అజింక్య రహానె సెంచరీ నమోదు చేయగా.. మళ్లీ ఇన్నాళ్లకి టెస్టుల్లో భారత క్రికెటర్ అక్కడ మూడంకెల స్కోరు నమోదు చేయగలిగాడు. ఓవరాల్‌గా ఈ ఘనత సాధించిన పదో భారత క్రికెటర్‌గా రాహుల్ గుర్తింపు పొందాడు. వరల్డ్ టెస్ట్ చాంపిన్‌షిప్ రెండో ఎడిషనలో సెంచరీ చేసిన రెండో బ్యాట్స్‌మన్‌గా గుర్తింపు పొందాడు.

భారీ స్కోర్ దిశగా భారత్..
వర్షం అంతరాయం కలిగించడంతో నెమ్మదించిన పిచ్‌పై భారత బ్యాట్స్‌మెన్ వికెట్లను ఎంచక్కా పడగొట్టొచ్చు అనుకున్న ఇంగ్లండ్ ఎత్తుగడ పారలేదు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న రూట్ నిర్ణయం బెడిసికొట్టింది. భారత ఓపెనర్లు జోరు ప్రత్యర్థి ఆశల్ని, అవకాశాల్ని దెబ్బతీశాయి.
పట్టుదలగా క్రీజ్‌లో నిలిచిన లోకేశ్ రాహుల్ (248 బంతుల్లో 12 ఫోర్లు, 1 సిక్స్ 127 బ్యాటింగ్) సెంచరీ సాధించగా...దూకుడైన ఆటతో రోహిత్ శర్మ (145 బంతుల్లో 11 ఫోర్లు, 1 సిక్స్‌తో 83) భారీ స్కోరుకు పునాది వేశాడు వీళ్లిద్దరు ఇంగ్లండ్ బౌలర్లపై అవలీలగా పరుగులు చేయడంతో భారత్ మొదటి రోజు ఆటముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 90 ఓవర్లలో 3 వికెట్లకు 276 పరుగులు చేసింది. రాహుల్‌తో పాటు రహానే (1 నాటౌట్) క్రీజులో ఉన్నాడు. అండర్సన్‌కు 2 వికెట్లు దక్కాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications