Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs ENG: మలుపు తిప్పిన ఆకాశ్ దీప్.. పట్టుబిగించిన టీమిండియా!

ఇంగ్లండ్‌తో రెండో టెస్ట్‌లో టీమిండియా పట్టు బిగించింది. 180 పరుగుల భారీ ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన టీమిండియా మూడో రోజు ఆట ముగిసే సమయానికి 13 ఓవర్లలో వికెట్ నష్టానికి 64 పరుగులు చేసింది. దూకుడుగా ఆడిన యశస్వి జైస్వాల్(22 బంతుల్లో 6 ఫోర్లతో 28) నిరాశపర్చగా.. కరుణ్ నాయర్(7 బ్యాటింగ్)తో కలిసి కేఎల్ రాహుల్(28 బ్యాటింగ్) మరో వికెట్ పడకుండా మూడో రోజు ఆటను ముగించాడు. జోష్ టంగ్‌కు ఓ వికెట్ దక్కింది. ప్రస్తుతం భారత్ ఆధిక్యం 244 పరుగులకు చేరింది.

అంతకుముందు 77/3 ఓవర్‌నైట్ స్కోర్‌తో మూడో రోజు ఆటను కొనసాగించిన ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 407 పరుగులకు ఆలౌటైంది. జెమీ స్మిత్(207 బంతుల్లో 21 ఫోర్లు, 4 సిక్స్‌లతో 184 నాటౌట్), హ్యారీ బ్రూక్(234 బంతుల్లో 17 ఫోర్లు, సిక్స్‌తో 158) భారీ సెంచరీలతో రాణించగా.. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. ఈ ఇద్దరే 6వ వికెట్‌కు 303 పరుగులు జోడించారు. ఈ జోడీని ఆకాశ్ దీప్ విడదీసాడు. హ్యారీ బ్రూక్‌ను క్లీన్ బౌల్డ్ చేసి మ్యాచ్‌ను భారత్‌వైపు మలుపు తిప్పాడు.

IND vs ENG KL Rahul Karun Nair Keep India Solid Despite Losing Jaiswal in 2nd Test

భారత బౌలర్లలో సిరాజ్ 6 వికెట్లతో ఇంగ్లండ్ పతనాన్ని శాసించగా.. ఆకాశ్ దీప్(4/88) నాలుగు వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 587 పరుగుల భారీ స్కోర్ చేసిన విషయం తెలిసిందే. నాలుగో రోజు మరింత సాధికారికంగా బ్యాటింగ్ చేసి భారత్.. 450-500 రన్స్ టార్గెట్ ఇంగ్లండ్ ముందు ఉంచితే ఈ మ్యాచ్‌లో విజయం సాధించవచ్చు. 400లోపు టార్గెట్ పడితే మాత్రం ఇంగ్లండ్ సునాయసంగా ఛేదిస్తోంది. ఎడ్జ్‌బాస్టన్ వికెట్ పూర్తిగా బ్యాటింగ్‌కు అనుకూలంగా మారింది. కొత్త బంతి‌తోనే బౌలర్లు ప్రభావం చూపుతున్నారు.

సంక్షిప్త స్కోర్లు:

భారత్ తొలి ఇన్నింగ్స్ 587 ఆలౌట్ (శుభ్‌మన్ గిల్ 269; షోయబ్ బషీర్ 3/167)

ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ 407 ఆలౌట్ (జెమీ స్మిత్ 184 నాటౌట్, సిరాజ్ 6/70)

భారత్ రెండో ఇన్నింగ్స్ 64/1

Story first published: Friday, July 4, 2025, 23:20 [IST]
Other articles published on Jul 4, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+