For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

పాపం కరుణ్ నాయర్.. కళ్లు చెదిరే క్యాచ్‌కు డకౌట్!(వీడియో)

టీమిండియా వెటరన్ బ్యాటర్ కరుణ్ నాయర్‌ను మరోసారి దురదృష్టం వెంటాడింది. 8 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత భారత టెస్ట్ టీమ్‌లో చోటు దక్కించుకున్న కరుణ్ నాయర్.. తన పునరాగమనాన్ని ఘనంగా చాటుకోలేకపోయాడు. కళ్లు చెదిరే క్యాచ్‌కు కరుణ్ నాయర్(0) డకౌట్‌గా వెనుదిరిగాడు. 2017లో చివరి సారిగా టెస్ట్ మ్యాచ్ ఆడిన కరుణ్ నాయర్‌కు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ రిటైర్మెంట్ నేపథ్యంలో భారత జట్టులో చోటు దక్కింది.

ఇంగ్లండ్‌తో ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా లీడ్స్ వేదికగా జరుగుతున్న తొలి మ్యాచ్‌లో 6వ స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన కరుణ్ నాయర్.. బెన్ స్టోక్స్ బౌలింగ్‌లో ఓలిపోప్ కళ్లు చెదిరే క్యాచ్‌కు వెనుదిరిగాడు. బెన్ స్టోక్స్ వేసిన 105వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ ఐదో బంతిని బెన్ స్టోక్స్ ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ లైన్‌లో వేయగా.. కరుణ్ నాయర్ కవర్స్ వైపు ఆడే ప్రయత్నం చేశాడు. కానీ ఎక్స్‌ట్రా కవర్‌లో ఫీల్డింగ్ చేస్తున్న ఓలిపోప్ గోల్ కీపర్ తరహాలో లెఫ్ట్‌సైడ్ డైవ్ చేసి బంతిని అందుకున్నాడు. దాంతో కరుణ్ నాయర్ నిరాశగా పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం ఈ క్యాచ్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. నెటిజన్లు పాపం కరుణ్ నాయర్ అంటూ కామెంట్ చేస్తున్నారు.

IND vs ENG Karun Nair Out For Duck in Return After Eight Years against England video
Photo Credit: X (twitter)

359/3 ఓవర్‌నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆటను కొనసాగించిన భారత్‌..మొదటి ఇన్నింగ్స్‌లో 471 పరుగులకు ఆలౌటైంది. రిషభ్ పంత్(178 బంతుల్లో 12 ఫోర్లు, 6 సిక్స్‌లతో 134), శుభ్‌మన్ గిల్(227 బంతుల్లో 19 ఫోర్లు, సిక్స్‌తో 147), యశస్వి జైస్వాల్(159 బంతుల్లో 16 ఫోర్లు, సిక్స్‌తో 101) సెంచరీలతో రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో జోష్ టంగ్(4/86), బెన్ స్టోక్స్(4/66) నాలుగేసి వికెట్లు తీయగా.. బ్రైడన్ కార్స్ ఓ వికెట్ పడగొట్టాడు. శుభ్‌మన్ గిల్ వికెట్ అనంతరం టీమిండియా ఇన్నింగ్స్ పేకమేడల్లా కుప్పకూలింది. లోయరార్డర్ బ్యాటర్లు కరుణ్ నాయర్(0), రవీంద్ర జడేజా(11), శార్దూల్ ఠాకూర్(1) తీవ్రంగా నిరాశపర్చడంతో 41 పరుగుల వ్యవధిలోనే భారత్ చివరి 7 వికెట్లు కోల్పోయింది.

అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్.. బుమ్రా ధాటికి 4 పరుగుల వద్దే ఓపెనర్ జాక్ క్రాలీ(4) వికెట్ కోల్పోయింది. ఓలీపోప్, బెన్ డకెట్ ఆచితూచి ఆడుతున్నారు.

Story first published: Saturday, June 21, 2025, 21:04 [IST]
Other articles published on Jun 21, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+