Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs ENG: ఇంగ్లండ్ ఇజ్జత్ కాపాడిన బెయిర్ స్టో.. హ్యాట్రిక్ సెంచరీలతో రికార్డు!

IND vs ENG: Jonny Bairstow slams century as England avoids follow-on

బర్మింగ్‌హామ్: భారత్‌తో జరుగుతున్న రీషెడ్యూల్ ఐదో టెస్ట్‌లో ఇంగ్లండ్ ఫాలో ఆన్ గండం తప్పించుకుంది. 83 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న జట్టును జానీ బెయిర్ స్టో(140 బంతుల్లో 14 ఫోర్లు, 2 సిక్స్‌లతో 106) సెంచరీతో ఆదుకున్నాడు. ఓవర్‌నైట్ స్కోరు 84/5తో మూడో రోజు ఆటను కొనసాగించిన ఇంగ్లండ్‌కి జానీ బెయిర్‌స్టో, కెప్టెన్ బెన్ స్టోక్స్ కలిసి శుభారంభం అందించారు. ఆరో వికెట్‌కు 66 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన తర్వాత బెన్ స్టోక్స్ ఔట్ అయ్యాడు. రెండు లైఫ్స్ లభించినా స్టోక్స్ వినియోగించుకోలేకపోయాడు. ఆ తర్వాత సామ్ బిల్లింగ్స్‌తో కలిసి బెయిర్ స్టో ఇన్నింగ్స్ ముందుకు నడిపించాడు. శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో ఫోర్ బాదిన బెయిర్ స్టో 119 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

వరుసగా మూడో సెంచరీ..

మొదటి 64 బంతుల్లో 16 పరుగులు మాత్రమే చేసిన జానీ బెయిర్‌స్టో, ఆ తర్వాత 54 బంతుల్లో 84 పరుగులు చేయడం విశేషం. మూడో రోజు ఆటలో అతని బ్యాటింగ్ పూర్తిగా టీ20 ఫార్మాట్ తరహాలో సాగింది. ఈ ఏడాదిలో జానీ బెయిర్‌స్టోకి ఇది ఐదో సెంచరీ కాగా.. వరుసగా మూడోది. ఈ క్రమంలోనే అతను పలు రికార్డులను నమోదు చేశాడు. ఐదు అంతకంటే కింది స్థాయిలో బ్యాటింగ్‌కు వచ్చి ఒకే ఏడాదిలో ఐదు టెస్టు సెంచరీలు చేసిన రెండో బ్యాటర్‌గా నిలిచాడు. ఇంతకు ముందు 2012లో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్ ఐదు సెంచరీలు చేయగా.. బెయిర్ స్టో 2022లో ఏడు నెలల్లోనే ఈ ఫీట్‌ను అందుకున్నాడు.

రెండో ప్లేయర్‌గా..

న్యూజిలాండ్‌తో జరిగిన చివరి రెండు టెస్టుల్లో సెంచరీలు చేసిన జానీ బెయిర్‌స్టో, వరుసగా మూడో టెస్టులో హ్యాట్రిక్ శతకాన్ని నమోదు చేశాడు. అంతకుముందు యాషెస్ సిరీస్‌లో ఓ సెంచరీ కొట్టిన జానీ బెయిర్‌స్టో, వెస్టిండీస్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో సెంచరీ బాదాడు. వరుసగా మూడు టెస్టుల్లో సెంచరీలు చేసిన 15వ ఇంగ్లండ్ క్రికెటర్‌గా నిలిచిన జానీ బెయిర్‌స్టో, 2016 జనవరి తర్వాత టీమిండియాపై అత్యంత వేగంగా సెంచరీ కొట్టిన ప్లేయర్‌గా నిలిచాడు.

చెలరేగిన షమీ,సిరాజ్

మరో ఎండ్‌లో సామ్ బిల్లింగ్స్ కూడా నిలదొక్కుకోవడంతో ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో ఫాలోఆన్ గండాన్ని తప్పించుకుంది. బెయిర్ స్టో ఔటైన తర్వాత ఇంగ్లండ్ ఇన్నింగ్స్ పేకమేడలా కూలింది. మహమ్మద్ షమీ, సిరాజ్ వికెట్లతో విరుచుకుపడటంతో 61 ఓవర్లు ముగిసేసరికి ఇంగ్లండ్ 9 వికెట్లకు 271 పరుగులు చేసింది. క్రీజులో మాథ్యూ పోట్స్(19 బ్యాటింగ్), జేమ్స్ అండర్సన్(6 బ్యాటింగ్) ఉన్నారు.

Story first published: Sunday, July 3, 2022, 19:41 [IST]
Other articles published on Jul 3, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+