For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND vs ENG: ఇంగ్లండ్ కొంపముంచిన జోరూట్.. ఆ క్యాచ్ పట్టుంటే! (వీడియో)

భారత్‌తో జరుగుతున్న ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ జో రూట్ వైఫల్యం కొనసాగుతోంది. తొలి రెండు మ్యాచ్‌ల్లో బ్యాటింగ్‌లో దారుణంగా విఫలమైన జోరూట్.. మూడో టెస్ట్‌లో ఫీల్డింగ్‌లో ఘోర తప్పిదం చేశాడు. అతను చేసిన మిస్టేక్ ఇంగ్లండ్ కొంపముంచింది. రాజ్‌కోట్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా 33 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.

ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన రవీంద్ర జడేజాతో రోహిత్ ఆచితూచి ఆడుతూ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. ఈ క్రమంలో టామ్ హార్ట్‌లీ వేసిన 13వ ఓవర్‌లో రోహిత్ శర్మ ఇచ్చిన క్యాచ్‌ను ఫస్ట్ స్లిప్‌లో ఉన్న జోరూట్ నేలపాలు చేశాడు. ఈ ఓవరి చివరి బంతిని కాస్త షార్ట్‌గా వేయగా.. మిడ్‌వికెట్ దిశగా రోహిత్ భారీ షాట్ ఆడే ప్రయత్నం చేశాడు.

IND vs ENG: Joe Root drops Rohit Sharma Catch cost England in Rajkot Test

కానీ బంతి అతని బ్యాట్ ఎడ్జ్ తీసుకొని స్లిప్‌లో ఉన్న జోరూట్ వైపు దూసుకెళ్లింది. కానీ అతను బంతిని అందిపుచ్చుకోలేకపోయాడు. కాస్త కష్టతరమైన క్యాచే అయినా.. పట్టాల్సినదే. ఈ అవకాశంతో రోహిత్ శర్మ చెలరేగిపోయాడు. ఆచితూచి ఆడి భారత ఇన్నింగ్స్‌ను నిలబెట్టాడు. ఆ తర్వాత తనదైన శైలిలో స్వేచ్చగా షాట్లు ఆడాడు.

196 బంతుల్లో 14 ఫోర్లు, 3 సిక్స్‌ల సాయంతో 131 పరుగులు చేసి వెనుదిరిగాడు. రవీంద్ర జడేజా సాయంతో నాలుగో వికెట్‌కు 204 పరుగులు జోడించాడు. రోహిత్ సూపర్ బ్యాటింగ్‌తో భారత్ భారీ స్కోర్ దిశగా దూసుకెళ్తోంది. రోహిత్ శర్మ ఇచ్చిన క్యాచ్‌ను జోరూట్ పట్టి ఉంటే అతను 27 పరుగుల వ్యక్తిగత స్కోర్‌‌కే వెనుదిరిగేవాడు. అదే జరిగితే టీమిండియా మరింత ఒత్తిడికి గురై ఆలౌటయ్యే అవకాశం ఉండేది. జోరూట్ చేసిన తప్పిదం ఇంగ్లండ్ కొంపముంచింది.

భారత బ్యాటర్లలో యశస్వి జైస్వాల్(10), శుభ్‌మన్ గిల్(0), రజత్ పటీదార్(5) విఫలమైనా.. రోహిత్, జడేజా(96 బ్యాటింగ్), సర్ఫరాజ్ ఖాన్(57 బ్యాటింగ్) విధ్వంసకర బ్యాటింగ్‌తో సత్తా చాటారు. ముఖ్యంగా అరంగేట్ర మ్యాచ్‌లోనే సర్ఫరాజ్ హాఫ్ సెంచరీతో మెరిసాడు. భారత్ తరఫున అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ నమోదు చేసిన బ్యాటర్‌గా రికార్డు సాధించాడు.

Story first published: Thursday, February 15, 2024, 16:46 [IST]
Other articles published on Feb 15, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+