ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ ఎట్టకేలకు బజ్‌బాల్ అప్రోచ్‌కు గుడ్‌బై చెప్పాడు. తన సహజ శైలికి తగ్గట్లు అసలు సిసలు టెస్ట్ బ్యాటింగ్‌తో ఇంగ్లండ్‌ను ఆదుకున్నాడు. భారత్‌తో రాంచీ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్ట్‌లో దూకుడే మంత్రంగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్..ఫస్ట్ సెషన్‌లోనే సగం వికెట్లు కోల్పోయింది.
భారత అరంగేట్ర పేసర్ ఆకాశ్ దీప్ మూడు వికెట్లతో సత్తా చాటడంతో 112 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన బెన్ ఫోక్స్‌తో కలిసి జో రూట్ జట్టును ఆదుకున్నాడు. బజ్‌బాల్ అప్రోచ్‌కు గుడ్‌బై చెప్పి.. తన సహజ శైలిలో బ్యాటింగ్ చేశాడు. పూర్తిగా డిఫెన్స్‌కు పరిమితమవుతూ.. వీలు చిక్కిన బంతిని బౌండరీకి తరలించాడు. గత మ్యాచ్‌ల మాదిరి ఎలాంటి నిర్లక్ష్యపు షాట్లు ఆడకుండా జాగ్రత్తగా బ్యాటింగ్ చేశాడు.

ఈ క్రమంలో 108 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. జోరూట్(67 బ్యాటింగ్) నిలకడైన బ్యాటింగ్‌తో ఇంగ్లండ్ 198/5 స్కోర్‌తో టీ బ్రేక్‌కు వెళ్లింది. ఇక బజ్‌బాల్ అప్రోచ్‌ను పక్కనపెట్టిన తనదైన శైలిలో బ్యాటింగ్ చేయడంపై మాజీ క్రికెటర్లు ప్రశంసిస్తున్నారు. సౌతాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్.. జోరూట్‌ను కొనియాడుతూ ట్వీట్ చేశాడు.
'ఇది టెస్ట్ మ్యాచ్‌లు గెలిపించిన జోరూట్ మోడ్. గ్లూ మోడ్. ప్లే బాల్‌కు కాస్త విశ్రాంతి ఇవ్వండి. భారత్ అద్భుతంగా ఆరంభిస్తే.. ఇంగ్లండ్ అసాధారణంగా పోరాడుతుంది. మొత్తానికి మంచి టెస్ట్ మ్యాచ్‌ను అభిమానులకు అందిస్తున్నారు.'అని ఏబీ డివిలియర్స్ పేర్కొన్నాడు. జోరూట్‌తో పాటు మైఖేల్ వాన్, సునీల్ గవాస్కర్ వంటి దిగ్గజ ఆటగాళ్లు సైతం జోరూట్ బ్యాటింగ్ తీరును ప్రశంసిస్తున్నారు.
ఈ మ్యాచ్‌లో బజ్‌బాల్ అప్రోచ్‌తో బ్యాటింగ్ చేసిన జాక్ క్రాలీ(42), బెన్ డక్కెట్(11), ఓలి పోప్(0), జానీ బెయిర్ స్టో(38), బెన్ స్టోక్స్(3) దారుణంగా విఫలమయ్యారు. భారత బౌలర్లలో ఆకాశ్ దీప్‌కు మూడు వికెట్లు దక్కగా.. జడేజా, అశ్విన్ చెరో వికెట్ తీసారు.