క్రికెట్‌లో నోబాల్ అతిపెద్ద నేరం. అనేక మ్యాచ్‌ల్లో నోబాల్ కారణంగా మ్యాచ్ ఫలితాలు తారుమారయ్యాయి. ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లోనూ ఒక్క నోబాల్ టీమిండియా కొంపముంచింది. జస్‌ప్రీత్ బుమ్రా వేసిన ఈ నోబాల్ మ్యాచ్‌కే టర్నింగ్ పాయింట్‌గా నిలిచింది. బుమ్రా వేసిన నోబాల్‌తో డకౌటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న హ్యారీ బ్రూక్.. ఏకంగా 99 పరుగులతో ఇంగ్లండ్ జట్టును ఆదుకున్నాడు.
రెండో రోజు ఆట చివరి ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. బుమ్రా వేసిన ఈ ఓవర్ నాలుగో బంతికి హ్యారీ బ్రూక్.. మిడ్ వికెట్‌లో క్యాచ్ ఇచ్చాడు. ఈ క్యాచ్‌ను సిరాజ్ అద్భుతంగా అందుకున్నాడు. దాంతో బ్రూక్ డకౌట్‌గా పెవిలియన్ బాట పట్టాడు. కానీ అంపైర్ ఆ బంతిని నోబాల్‌గా ప్రకటించడంతో బ్రూక్.. తిరిగి క్రీజులోకి వచ్చాడు. ఈ ఓవర్‌లో బుమ్రా మూడు నోబాల్స్ వేయడం విశేషం. ఈ అవకాశంతో మూడో రోజు ఆటలో చెలరేగిన బ్రూక్.. వన్డే తరహా బ్యాటింగ్‌తో భారత బౌలర్లను చెడుగుడు ఆడాడు. 112 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్స్‌లతో 99 పరుగులు చేశాడు.

సెంచరీ ముంగిట ప్రసిధ్ కృష్ణ బౌలింగ్‌లో క్యాచ్ ఔటయ్యాడు. బెన్ స్టోక్స్‌తో ఐదో వికెట్‌కు 51 పరుగులు జోడించిన బ్రూక్.. జేమీ స్మిత్‌తో కలిసి 6వ వికెట్‌కు 73 పరుగుల భాగస్వామ్యం అందించాడు. బ్రైడన్ కార్స్‌తో కలిసి ఏడో వికెట్‌కు 49 పరుగులు జోడించాడు. బుమ్రా నోబాల్ వేయకుండా ఉంటే.. బ్రూక్ డకౌటయ్యేవాడు. అప్పడు ఇంగ్లండ్ 400 లోపే ఆలౌటై భారత్‌కు భారీ ఆధిక్యం లభించేది. ఇంగ్లండ్ టెయిలెండర్స్ విలువైన పరుగులు చేస్తుండటంతో తొలి ఇన్నింగ్స్‌లో 465 పరుగులకు ఆలౌటైంది. ఓలీ పోప్(106) సెంచరీతో రాణించగా.. హ్యారీ బ్రూక్(99) తృటిలో శతకాన్ని చేజార్చుకున్నాడు. జేమీ స్మిత్(40) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. భారత బౌలర్లలో జస్‌ప్రీత్ బుమ్రా(5/83) ఐదు వికెట్లు తీయగా.. ప్రసిద్ కృష్ణ(3/128) మూడు వికెట్లు పడగొట్టాడు. మహమ్మద్ సిరాజ్(2/122) రెండు వికెట్లు తీసాడు. భారత్‌కు 6 పరుగుల స్వల్ప ఆధిక్యం మాత్రమే లభించింది. చెత్త ఫీల్డింగ్ కూడా టీమిండియాకు నష్టం చేసింది.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్..తొలి ఇన్నింగ్స్‌లో 471 పరుగులకు ఆలౌటైంది. యశస్వి జైస్వాల్(101), శుభ్‌మన్ గిల్(147), రిషభ్ పంత్(134) సెంచరీలతో రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో జోష్ టంగ్, బెన్ స్టోక్స్ నాలుగేసి వికెట్లు తీయగా.. బ్రైడన్ కార్స్, షోయబ్ బషీర్ తలో వికెట్ తీసారు. 41 పరుగుల వ్యవధిలోనే భారత్ 7 వికెట్లు కోల్పోయింది.