
బర్మింగ్‌హామ్: అంతా ఊహించినట్లుగానే ఇంగ్లండ్‌తో శుక్రవారం నుంచి జరగనున్న ఐదో టెస్ట్ మ్యాచ్‌కు కెప్టెన్ రోహిత్ శర్మ దూరమయ్యాడు. కరోనా బారిన పడిన అతను కోలుకోకపోవడంతో జస్‌ప్రీత్ బుమ్రా పేరును టీమ్ కెప్టెన్‌గా భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ప్రకటించింది. అతనికి డిప్యూటీగా రిషభ్ పంత్ పేరును ఖరారు చేసింది. ఈ మేరకు బీసీసీఐ ట్వీట్ చేసింది.
'ఇంగ్లండ్‌తో జరగనున్న ఐదో టెస్ట్‌లో జస్‌ప్రీత్ బుమ్రా జట్టును నడిపించనున్నాడు. ఈ మ్యాచ్‌లో రిషభ్ పంత్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు'అని ట్వీట్‌లో పేర్కొంది. అయితే రోహిత్ శర్మ స్థానంలో ఎంపిక చేసిన ఆటగాడి వివరాలు మాత్రం బీసీసీఐ వెల్లడించలేదు. మరోవైపు ఇంగ్లండ్ జట్టు మాత్రం తమ తుది జట్టును ప్రకటించి టీమిండియాకు సవాల్ విసిరింది. జేమ్స్ అండర్సన్ జట్టులోకి రాగా.. కరోనా బారిన పడిన బెన్ ఫోక్స్ దూరమయ్యాడు. అతని స్థానంలో సామ్ బిల్లింగ్స్ తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు.
ఇక టాస్ సమయంలోనే టీమిండియా తమ తుది జట్టును ప్రకటించే అవకాశం ఉంది. రోహిత్ శర్మ స్థానంలో చతేశ్వర్ పుజారా లేదా కేఎస్ భరత్ ఓపెనింగ్ చేసే అవకాశం ఉంది. పుజారా ఓపెనర్‌గా వస్తే హనుమ విహారి తుది జట్టులో చోటు దక్కించుకోనున్నాడు. ఇంగ్లండ్ ముగ్గురు పేసర్లు, ఏకైక స్పిన్నర్‌తో బరిలోకి దిగడంతో టీమిండియా సైతం అదే ఫార్మూలాను కొనసాగించే అవకాశం ఉంది. బుమ్రాతో పాటు మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్ ప్రధాన పేసర్లుగా బరిలోకి దిగే అవకాశం ఉంది. ఏకైక స్పిన్నర్‌గా రవీంద్ర జడేజా జట్టులోకి రానున్నాడు.

గతేడాది ఐదు టెస్ట్‌ల సిరీస్ కోసం టీమిండియా ఇంగ్లండ్‌లో పర్యటించగా.. చివరి మ్యాచ్ కరోనాతో వాయిదా పడింది. దాంతో ఇరు జట్లు పరస్పర అంగీకారంతో చివరి మ్యాచ్‌ను రీ షెడ్యూల్ చేశారు. ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా ఇప్పటికే నాలుగు మ్యాచ్‌లు జరగ్గా.. 2-1తో భారత్ ఆధిక్యంలో ఉంది. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరగనున్న చివరి మ్యాచ్‌లో భారత్ గెలిచినా.. కనీసం డ్రా చేసుకున్నా సిరీస్ సొంతమవుతోంది.