For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND vs ENG: జస్‌ప్రీత్ బుమ్రా X గంభీర్ మధ్య వాగ్వాదం?

టీమిండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌కు సంబంధించిన ఓ ఫొటో నెట్టింట వైరల్‌గా మారింది. డ్రెస్సింగ్ రూమ్‌లో ఈ ఇద్దరూ తీవ్ర వాగ్వాదానికి దిగినట్లుగా ఉన్న ఈ ఫొటో అనేక ఊహగానాలకు తావిస్తోంది. ఇంగ్లండ్‌తో ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా లీడ్స్ వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ రెండో రోజు ఆట చివరి సెషన్ సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకున్నట్లు అర్థమవుతుంది. బౌలింగ్ ప్రణాళికలు, ఫీల్డ్ ప్లేస్‌మెంట్స్ విషయంలో బుమ్రా-గంభీర్ వాగ్వాదానికి దిగినట్లు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

కొందరేమో గిల్ కెప్టెన్సీ బాలేదని, గంభీర్‌కు బుమ్రా ఫిర్యాదు చేశాడని అంటున్నారు. భారత బౌలర్లలో బుమ్రా ఒక్కడే మూడు వికెట్లు తీసాడు. అతనికి ఇతర బౌలర్ల నుంచి ఏ మాత్రం సహకారం లభించలేదు. బుమ్రా బౌలింగ్‌ను ఓపికగా ఆడిన ఇంగ్లండ్ బ్యాటర్లు.. సిరాజ్, శార్దూల్, ప్రసిధ్ కృష్ణలపై విరుచుకుపడ్డారు. దాంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 49 ఓవర్లలో 3 వికెట్లకు 209 పరుగులు చేసింది. భారత్ కంటే ఇంగ్లండ్ 262 పరుగుల వెనుకంజలో ఉంది. క్రీజులో ఓలీ పోప్(100 బ్యాటింగ్)తో పాటు హ్యార్రీ బ్రూక్(0 బ్యాటింగ్) ఉన్నారు.

IND vs ENG Jasprit Bumrah s Dressing Room Chat With Gautam Gambhir Goes Viral Amid India s Day 2 Bowling Woes

ఆఖరి ఓవర్‌లో హైడ్రామా..?

రెండో రోజు ఆట చివరి ఓవర్‌లో హైడ్రామా చోటు చేసుకుంది. బుమ్రా వేసిన ఈ ఓవర్‌ నాలుగో బంతికి హ్యారీ బ్రూక్.. మిడ్ వికెట్‌లో క్యాచ్ ఇచ్చాడు. ఈ క్యాచ్‌ను సిరాజ్ అద్భుతంగా అందుకున్నాడు. దాంతో బ్రూక్ డకౌట్‌గా పెవిలియన్ బాట పట్టాడు. కానీ అంపైర్ ఆ బంతిని నోబాల్‌గా ప్రకటించడంతో బ్రూక్.. తిరిగి క్రీజులోకి వచ్చాడు. ఈ ఓవర్‌లో బుమ్రా మూడు నోబాల్స్ వేయడం విశేషం. ఇతర బౌలర్ల వైఫల్యంతో పాటు ఈజీ క్యాచ్‌లను వదిలేయడం టీమిండియాకు నష్టం చేసింది. బుమ్రా బౌలింగ్‌లో బెన్ డకెట్ ఇచ్చిన రెండు క్యాచ్‌లను జైస్వాల్, జడేజా వదిలేయగా.. అతను హాఫ్ సెంచరీతో రాణించాడు. చివరకు అతన్ని బుమ్రానే క్లీన్ బౌల్డ్ చేశాడు. ఓలీ పోప్ ఇచ్చిన ఈజీ క్యాచ్‌ను స్లిప్‌లో జైస్వాల్ వదిలేసాడు. ఈ క్యాచ్‌లు అందుకొని ఉంటే ఇంగ్లండ్ మరన్ని వికెట్లు కోల్పోయేది.

IND vs ENG Jasprit Bumrah s Dressing Room Chat With Gautam Gambhir Goes Viral Amid India s Day 2 Bowling Woes

భారత్ 471 ఆలౌట్

అంతకుముందు 359/3 ఓవర్‌నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆటను కొనసాగించిన భారత్‌.. మొదటి ఇన్నింగ్స్‌లో 471 పరుగులకు ఆలౌటైంది. రిషభ్ పంత్(178 బంతుల్లో 12 ఫోర్లు, 6 సిక్స్‌లతో 134), శుభ్‌మన్ గిల్(227 బంతుల్లో 19 ఫోర్లు, సిక్స్‌తో 147), యశస్వి జైస్వాల్(159 బంతుల్లో 16 ఫోర్లు, సిక్స్‌తో 101) సెంచరీలతో రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో జోష్ టంగ్(4/86), బెన్ స్టోక్స్(4/66) నాలుగేసి వికెట్లు తీయగా.. బ్రైడన్ కార్స్ ఓ వికెట్ పడగొట్టాడు.

Story first published: Sunday, June 22, 2025, 15:05 [IST]
Other articles published on Jun 22, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+