IND vs ENG: ఓటమి బాధలో ఉన్న టీమిండియాకు బిగ్ షాక్.. రెండో టెస్ట్‌కు ఆ స్టార్ ప్లేయర్ దూరం!
ఇంగ్లండ్ పర్యటనను ఓటమితో ప్రారంభించిన టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జూలై 2 నుంచి ప్రారంభం కానున్న రెండో టెస్ట్‌కు టీమిండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా దూరంగా ఉండనున్నాడు. వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌లో భాగంగా బుమ్రాకు రెండో టెస్ట్ నుంచి విశ్రాంతి కల్పించాలని టీమిండియా మేనేజ్‌మెంట్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ సిరీస్ ప్రారంభానికి ముందే బుమ్రా మూడు టెస్ట్‌లు మాత్రమే ఆడుతాడని హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌తో పాటు చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ తెలిపారు.
లీడ్స్ వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో బరిలోకి దిగిన జస్‌ప్రీత్ బుమ్రా అసాధారణ ప్రదర్శన కనబర్చాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు పడగొట్టాడు. రెండో ఇన్నింగ్స్‌లో అతని బౌలింగ్‌ను ఇంగ్లండ్ బౌలర్లు జాగ్రత్తగా ఆడటంతో ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉన్న వికెట్‌పై బుమ్రా తన బౌలింగ్‌తో ఇంగ్లండ్ బ్యాటర్లను బెంబేలెత్తించాడు. మిగతా బౌలర్ల నుంచి అతనికి సరైన సహకారం లభించలేదు. చెత్త ఫీల్డింగ్ కూడా భారత్ పతనాన్ని శాసించింది.

తొలి టెస్ట్‌లో భారత్ ఓడినా.. వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌లో భాగంగా అతనికి విశ్రాంతి ఇవ్వాలని టీమిండియా మేనేజ్‌మెంట్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. అతని స్థానంలో లెఫ్టార్మ్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ బరిలోకి దిగే అవకాశం ఉంది. అతను ఇప్పటి వరకు టెస్ట్ క్రికెట్‌లోకి అరంగేట్రం చేయలేదు. బుమ్రా గైర్హాజరీపై బీసీసీఐ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఒకవేళ బుమ్రా దూరమైతే.. బౌలింగ్‌లో విభాగంలో ఎలాంటి మార్పులు జరిగే అవకాశం లేదు.
ఇంగ్లండ్‌తో రెండో టెస్ట్‌కు భారత తుది జట్టు(అంచనా): కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్, సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్, కరుణ్ నాయర్, రిషభ్ పంత్, రవీంద్ర జడేజా, నితీష్ కుమార్ రెడ్డి, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిధ్ కృష్ణ, మహమ్మద్ సిరాజ్.
ఇంగ్లండ్ పర్యటనకు ఎంపికైన భారత జట్టు:
శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రిషభ్ పంత్ (వైస్ కెప్టెన్, వికెట్ కీపర్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్, కరుణ్ నాయర్, నితీష్ రెడ్డి, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్. సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఆకాష్ దీప్, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications