Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs ENG: బూమ్ బూమ్ బుమ్రా.. 2 బంతుల్లో 2 వికెట్లు!

IND vs ENG: టీమిండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా దుమ్మురేపాడు. వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో బుమ్రా వరుస బంతుల్లో రెండు వికెట్లు తీసాడు. 230 పరుగుల స్వల్ప లక్ష్యచేధనకు బరిలోకి దిగిన ఇంగ్లండ్‌కు బుమ్రా దిమ్మతిరిగే షాకిచ్చాడు. నిప్పులు చెరిగే బంతులతో ఇంగ్లండ్ బ్యాటర్లు డేవిడ్ మలాన్(16), జోరూట్(0)లను పెవిలియన్ చేర్చాడు.

జస్‌ప్రీత్ బుమ్రా వేసిన ఇన్నింగ్స్ 5వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ నాలుగో బంతికి డేవిడ్ మలాన్‌ను క్లీన్ బౌల్డ్ చేసిన బుమ్రా.. మరుసటి బంతికే జోరూట్‌ను వికెట్ల ముందు బోల్తా కొట్టించాడు.

IND vs ENG: Jasprit Bumrah gives back to back blows to England

అరౌండ్ ఆఫ్ లెంగ్త్ బాల్‌ను మలాన్ కట్ షాట్ ఆడే ప్రయత్నం చేయగా.. ఇన్‌సైడ్ ఎడ్జ్ తీసుకున్న బంతి వికెట్లను గీరాటేసింది. క్రీజులోకి జోరూట్ రాగా.. ఇన్‌స్వింగర్‌తో బోల్తా కొట్టించాడు. ఔట్ స్వింగర్‌ వేస్తాడని భ్రమపడిన జోరూట్.. ఫ్లిక్ చేయబోయి మూల్యం చెల్లించుకున్నాడు. బంతిని అంచనా వేయడంలో విఫలమైన జోరూట్ వికెట్ల ముందు దొరికిపోయాడు.

జోరూట్ రివ్యూ తీసుకున్నా ఫలితం లేకుండా పోయింది. క్రీజులోకి వచ్చిన బెన్ స్టోక్స్(0)ను మహమ్మద్ షమీ క్లీన్ బౌల్డ్ చేశాడు. దాంతో ఇంగ్లండ్ 33 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. 2 బంతుల్లో 2 వికెట్లు తీసిన బుమ్రాను నెటిజన్లు కొనియాడుతున్నారు. బూమ్ బూమ్ బుమ్రా అంటూ కామెంట్ చేస్తున్నారు.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 229 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ(101 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స్‌లతో 87) తృటిలో శతకం చేజార్చుకోగా.. సూర్యకుమార్ యాదవ్(47 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 49) హాఫ్ సెంచరీకి పరుగు దూరంలో ఔటయ్యాడు. కేఎల్ రాహుల్(58 బంతుల్లో 3 ఫోర్లతో 39), జస్‌ప్రీత్ బుమ్రా(25 బంతుల్లో ఫోర్‌తో 16) కీలక ఇన్నింగ్స్ ఆడారు.

ఇంగ్లండ్ బౌలర్లలో డేవిడ్ విల్లే(3/45) మూడు వికెట్లు తీయగా.. క్రిస్ వోక్స్(2/33), ఆదిల్ రషీద్(2/35) రెండేసి వికెట్లు దక్కాయి. మార్క్‌వుడ్ (1/46) ఓ వికెట్ పడగొట్టాడు. స్వల్ప లక్ష్యమే అయినా.. డ్యూ రాకపోతే మ్యాచ్ రసవత్తరంగా మారనుంది. ఇప్పటికే మూడు వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్.. తీవ్ర ఒత్తిడిలో ఉంది.

Story first published: Sunday, October 29, 2023, 19:33 [IST]
Other articles published on Oct 29, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+