Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs ENG: నిప్పులు చెరిగిన బుమ్రా.. టీమిండియాకు స్వల్ప ఆధిక్యం!

ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో టీమిండియాకు తొలి ఇన్నింగ్స్‌లో 6 పరుగుల స్వల్ప ఆధిక్యం దక్కింది. జస్‌ప్రీత్ బుమ్రా నిప్పులు చెరగడంతో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 465 పరుగులకు ఆలౌటైంది. ఓలీ పోప్(106) సెంచరీతో రాణించగా.. హ్యారీ బ్రూక్(99) తృటిలో శతకాన్ని చేజార్చుకున్నాడు. జేమీ స్మిత్(40) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. భారత బౌలర్లలో జస్‌ప్రీత్ బుమ్రా(5/83) ఐదు వికెట్లు తీయగా.. ప్రసిద్ కృష్ణ(3/128) మూడు వికెట్లు పడగొట్టాడు. మహమ్మద్ సిరాజ్(2/122) రెండు వికెట్లు తీసాడు. చెత్త ఫీల్డింగ్‌తో టీమిండియా భారీ ఆధిక్యాన్ని అందుకోలేకపోయింది. భారత ఆటగాళ్లు దాదాపు ఐదు క్యాచ్‌లు నేలపాలు చేశారు. బుమ్రా వేసిన నోబాల్‌తో బ్రూక్ డకౌటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు.

IND vs ENG Jasprit Bumrah gets his five-wicket haul India lead by 6 runs

209/3 ఓవర్‌నైట్ స్కోర్‌తో మూడో రోజు ఆటను కొనసాగించిన ఇంగ్లండ్‌కు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. సెంచరీ హీరో ఓలి పోప్(106)ను ప్రసిధ్ కృష్ణ కీపర్ క్యాచ్‌గా పెవిలియన్ చేర్చాడు. అయితే ఈ ఆనందం భారత్‌కు ఎక్కువ సేపు లేదు. హ్యారీ బ్రూక్‌కు జత కలిసిన బెన్ స్టోక్స్ ఆచితూచి ఆడాడు. స్టోక్స్ నెమ్మదిగా ఆడినా హ్యారీ బ్రూక్ వన్డే తరహా బ్యాటింగ్‌తో పరుగులు రాబట్టాడు. క్రీజులో సెట్ అయిన ఈ జోడీని సిరాజ్ విడదీసాడు. దాంతో ఐదో వికెట్‌కు నమోదైన 51 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. క్రీజులోకి వచ్చిన జెమీ స్మిత్ సైతం దూకుడుగా ఆడాడు. ఈ ఇద్దరూ సిరాజ్, ప్రసిధ్ కృష్ణలను చెడుగుడు ఆడారు. ఈ క్రమంలో హ్యారీ బ్రూక్ 65 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. దాంతో ఇంగ్లండ్ 327/5 స్కోర్‌తో లంచ్ బ్రేక్‌కు వెళ్లింది.

రెండో సెషన్‌లోనూ ఈ జోడీ సాధికారికంగా బ్యాటింగ్ చేసింది. దూకుడుగా ఆడిన జేమీ స్మిత్‌ను ప్రసిధ్ కృష్ణ పెవిలియన్ చేర్చాడు. బౌండరీ లైన్‌పై జడేజా, సాయి సుదర్శన్ అద్భుతమైన ఫీల్డింగ్ విన్యాసంతో క్యాచ్ ఔట్ చేశాడు. దాంతో ఆరో వికెట్‌కు నమోదైన 73 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఆ కాసేపటికే సెంచరీకి ఒక్క పరుగు ముంగిట హ్యారీ బ్రూక్(99) క్యాచ్ ఔటయ్యాడు. ఈ పరిస్థితుల్లో క్రిస్ వోక్స్, బ్రైడన్ కార్స్ ఆచితూచి ఆడి 8వ వికెట్‌‌కు 55 పరుగులు జోడించారు. బ్రైడన్ కార్స్(22)ను సిరాజ్ ఔట్ చేయగా.. క్రిస్ వోక్స్‌ను బుమ్రా పెవిలియన్ చేర్చాడు. జోష్ టంగ్‌ను బుమ్రా ఆఖరి వికెట్‌గా పెవిలియన్ చేర్చి ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌కు తెరదించాడు. దాంతో అంపైర్లు రెండో సెషన్‌కు ముగింపు పలికారు.

Story first published: Sunday, June 22, 2025, 20:35 [IST]
Other articles published on Jun 22, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+