కపిల్ దేవ్ ఉన్నాడు..
ఇక టాస్ సందర్భంగా తననును కొనియాడుతూ అధికారిక బ్రాడ్‌కాస్టర్ స్కై స్పోర్ట్స్ హోస్ట్ మార్క్ బౌచర్ చేసిన తప్పిదాన్ని జస్‌ప్రీత్ బుమ్రా సరిదిద్దాడు. భారత్ జట్టుకు సారథ్యం వహిస్తున్న తొలి పేసర్ బుమ్రా అంటూ బౌచర్ అతన్ని ఆకాశానికెత్తగా..' లేదు లేదు.. నా కన్నా ముందు కపిల్ దేవ్ ఉన్నాడు'అంటూ బుమ్రా బదులిచ్చాడు. దాంతో నాలుక కరుచుకున్న మార్క్ బౌచర్.. అతను ఆల్‌రౌండర్ అంటూ కవరింగ్ ఇచ్చాడు. దానికి బుమ్రా సరే సరే అంటూ.. తన ఫీలింగ్‌ను పంచుకున్నాడు.

మాటల్లో వర్ణించలేను..
టీమిండియాకు కెప్టెన్సీ వహించడం గొప్ప విషయమని, ఈ అనుభూతిని మాటల్లో చెప్పలేనని జస్‌ప్రీత్ బుమ్రా సంతోషం వ్యక్తం చేశాడు. తన జీవితంలో ఇంతకన్నా మధురమైన క్షణం మరొకటి లేదన్నాడు. ఈ మ్యాచ్ కోసం అద్భుతంగా సన్నదమయ్యామని చెప్పిన బుమ్రా.. ప్రాక్టీస్ మ్యాచ్‌తో ఇంగ్లండ్ పరిస్థితులకు అలవాటుపడ్డామని చెప్పాడు. ఇది తమను మానసికంగా మరింత బలంగా మార్చిందని చెప్పాడు. ప్రస్తుం బుమ్రాకు సంబంధించిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి.

కపిల్ దేవ్ తొలి కెప్టెన్..
భారత జట్టుకు సారథ్యం వహించిన తొలి భారత పేసర్ కపిల్ దేవ్. 1983-87 వరకు అతను భారత కెప్టెన్‌గా వ్యవహరించాడు. టెస్ట్‌ల్లో 111 వికెట్లు తీసిన కపిల్ దేవ్.. ఇందులో నాలుగు సార్లు నాలుగు వికెట్ల ఘనతను అందుకున్నాడు. గతేడాది ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా జరగాల్సిన ఈ మ్యాచ్ కరోనా కారణంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. ఆ మ్యాచ్‌ను ఇప్పుడు మళ్లీ నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సిరీస్‌లో నాలుగు మ్యాచ్‌లు జరగ్గా.. భారత్ 2-1తో ఆధిక్యంలో ఉంది. ఈ చివరి మ్యాచ్ గెలిచినా, డ్రా చేసుకున్నా.. సిరీస్ భారత్‌దే అవుతోంది.

ఓపెనర్లు విఫలం.. ఇదే జరిగితే 15 ఏళ్ల తర్వా
త ఇంగ్లండ్ గడ్డపై సిరీస్ గెలిచిన జట్టుగా బుమ్రా సేన చరిత్రకెక్కుతోంది. 2007లో చివరిసారిగా భారత్.. ఇంగ్లండ్ గడ్డపై సిరీస్ విజయాన్నందుకుంది. ఇక టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు శుభారంభం దక్కలేదు. జేమ్స్ అండర్సన్ ధాటికి ఓపెనర్లు శుభ్‌మన్ గిల్ (17), చతేశ్వర్ పుజారా(13) పెవిలియన్ చేరారు. దాంతో భారత్ 46 పరుగులకే కీలక రెండు వికెట్లు కోల్పోయింది. క్రీజులో విరాట్ కోహ్లీ(1 బ్యాటింగ్), హనుమ విహారి(14 బ్యాటింగ్) ఉండగా.. 20 ఓవర్లలో భారత్ 2 వికెట్ల నష్టానికి 53 పరుగులు చేసింది.


Click it and Unblock the Notifications












