Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs ENG: అండర్సన్ స్టన్నింగ్ డెలివరీ.. బిత్తరపోయిన రోహిత్ శర్మ(వీడియో)

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పేలవ ఫామ్ కొనసాగుతోంది. వైజాగ్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్ సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ రోహిత్ శర్మ(13) విఫలమయ్యాడు. ఇంగ్లండ్ వెటరన్ పేసర్ జేమ్స్ అండర్సన్ స్టన్నింగ్ డెలివరీకి రోహిత్ శర్మ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఓవర్‌నైట్ స్కోర్‌కు ఒక్క పరుగు కూడా జత చేయకుండానే వెనుదిరిగాడు.

వైజాగ్ ఓవర్‌కాస్ట్ కండిషన్స్‌ను అడ్వాంటేజ్‌గా మార్చుకున్న అండర్సన్.. సూపర్ ఇన్‌స్వింగర్‌తో రోహిత్ శర్మను క్లీన్ బౌల్డ్ చేశాడు. దాంతో మూడో రోజు ఆట రెండో ఓవర్‌లోనే టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. జోరూట్ వేసిన తొలి ఓవర్‌ను మెయిడిన్ చేసిన రోహిత్.. అండర్సన్ బౌలింగ్‌లోనూ అసౌకర్యంగా కనిపించాడు.

IND vs ENG: James Anderson Cleans Up Rohit Sharma With Stunning Delivery goes Viral

నాలుగో బంతిని అతను ఫుల్లర్ లెంగ్త్‌లో వేయగా.. రోహిత్ డిఫెన్స్ చేస్తూ కవర్స్‌వైపు ఆడాలనుకున్నాడు. కానీ బంతి అద్భుతంగా ఇన్‌స్వింగ్ అయ్యి ఆఫ్ వికెట్‌ను లేపేసింది. ఈ స్టన్నింగ్ డెలివరీకి రోహిత్ బిత్తరపోయాడు. ప్రస్తుతం మ్యాజికల్ డెలివరీకి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. నాలుగు పదుల వయసులోనూ అండర్సన్‌ అదరగొడుతుండటంపై ఫ్యాన్స్ ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఈ మ్యాచ్‌ రెండు ఇన్నింగ్స్‌లో తీవ్రంగా నిరాశపరిచిన రోహిత్‌పై అభిమానులు మండిపడుతున్నారు.

రోహిత్ వికెట్‌తో టీమిండియాపై అనవసర ఒత్తిడి నెలకొంది. అండర్సన్ మరుసటి ఓవర్‌లోనే డబుల్ సెంచరీ హీరో యశస్వి జైస్వాల్(17) క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. దాంతో భారత్ 30 పరుగులకే రెండు కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. క్రీజులోకి వచ్చిన శుభ్‌మన్ గిల్(6 బ్యాటింగ్), శ్రేయస్ అయ్యర్(5 బ్యాటింగ్) ఇబ్బంది పడుతూ బ్యాటింగ్ చేస్తున్నారు.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 396 పరుగులకు ఆలౌటైంది. యశస్వి జైస్వాల్(290 బంతుల్లో 19 ఫోర్లు, 7 సిక్స్‌లతో 209) ఒక్కడే డబుల్ సెంచరీ‌తో రాణించాడు. ఇంగ్లండ్ బౌలర్లలో జేమ్స్ అండర్సన్(3/47), షోయబ్ బషీర్(3/138), రెహాన్ అహ్మద్(3/65) మూడేసి వికెట్లు తీసాడు. టామ్ హార్ట్‌లీకి ఓ వికెట్ దక్కింది.

అనంతరం ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 55.3 ఓవర్లలో 253 పరుగులకు కుప్పకూలింది. జాక్ క్రాలీ(78 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్స్‌లతో 76) ఒక్కడే హాఫ్ సెంచరీతో సత్తా చాటగా.. బెన్ స్టోక్స్(47) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. భారత బౌలర్లలో బుమ్రా(6/45) సిక్సర్ కొట్టగా.. కుల్దీప్ యాదవ్ మూడు వికెట్లు తీసాడు. అక్షర్ పటేల్‌కు ఓ వికెట్ దక్కింది.

దాంతో భారత్‌కు 143 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది.

Story first published: Sunday, February 4, 2024, 10:27 [IST]
Other articles published on Feb 4, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+