For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

James Anderson అరుదైన ఘనత.. టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే తొలి బౌలర్‌గా..!

IND vs ENG: James Anderson Bowls Most Number Of Madien Overs vs India

లీడ్స్: భారత్‌తో జరుగుతున్న మూడో టెస్ట్‌లో ఇంగ్లండ్ పేసర్ జేమ్స్ అండర్సన్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే భారత జట్టుకు అత్యధికంగా మెయిడిన్ ఓవర్లు వేసిన బౌలర్‌గా గుర్తింపు పొందాడు. తాజా టెస్ట్‌తో అండర్సన్ ఈ ఘనతను అందుకున్నాడు. ఇప్పటి వరకు అండర్సన్ భారత్‌కు 330 మెయిడిన్ ఓవర్లు వేసాడు. దాంతో ఈ రికార్డు హోల్డర్‌గా ఉన్న ఇంగ్లండ్ మాజీ బౌలర్ డెరెక్ అండర్‌వుడ్‌ను అండర్సన్ అధిగమించాడు. అండర్‌వుడ్ భారత్‌కు 322 మెయిడిన్ ఓవర్లు వేసాడు.

టెస్ట్‌ల్లో ఓవరాల్‌గా 1529 ఓవర్లు వేసిన అండర్సన్.. ఈ జాబితాలో నాలుగో స్థానంలో ఉన్నాడు. శ్రీలంక స్పిన్నర్ ముత్తయ్య మురళీదరణ్ 1792 మెయిడిన్ ఓవర్లు వేయగా.. ఆస్ట్రేలియా దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్ 1762, భారత మాజీ స్పిన్నర్ అనిల్ కుంబ్లే 1575 మెయిడిన్ ఓవర్లు వేసి అండర్సన్ కన్నా ముందున్నారు. పేసర్‌గా మాత్రం అండర్సనే టాప్‌లో ఉన్నాడు.
టెస్ట్‌ల్లో ఇప్పటి వరకు 165 మ్యాచ్‌లు ఆడిన అండర్సన్ 629 వికెట్లు పడగొట్టాడు.

ఇక మ్యాచ్ విషయానికి వస్తే టీమిండియా దీటుగా ఆడుతోంది. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 78 పరుగులకే కుప్పకూలి పరువు తీసుకున్న కోహ్లీసే.. రెండో ఇన్నింగ్స్‌లో స్పూర్తిదాయక పోరాటం చేస్తోంది. ఓపెనర్‌ రోహిత్‌ శర్మ (156 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్‌‌తో 59) రాణించగా, చతేశ్వర్‌ పుజారా (180 బంతుల్లో 15 ఫోర్లతో 91 బ్యాటింగ్‌) సెంచరీకి చేరువయ్యాడు. కెప్టెన్‌ కోహ్లీ (94 బంతుల్లో 6 ఫోర్లతో 45 బ్యాటింగ్‌) క్రీజులో పాతుకుపోయాడు. 80 ఓవర్లు అంటే దాదాపు రోజంతా (సాధారణంగా 90 ఓవర్లు) బ్యాటింగ్‌ చేసిన టీమిండియా కేవలం రెండే వికెట్లు సమర్పించుకుంది. మూడో రోజు ఆట నిలిచే సమయానికి భారత్‌ రెండో ఇన్నింగ్స్‌లో 2 వికెట్లకు 215 పరుగులు చేసింది. రాబిన్సన్, ఓవర్టన్‌లకు చెరో వికెట్‌ దక్కింది.

ప్రస్తుతం భారత్‌ ఇంకా 139 పరుగులు వెనుకబడే ఉంది. ఆట నాలుగో రోజు పుజారా, కోహ్లీసుదీర్ఘ ఇన్నింగ్స్‌ ఆడటంతోపాటు ఇతర బ్యాట్స్‌మెన్‌ రహానే, జడేజా, పంత్‌ కూడా కదంతొక్కితే ఈ మ్యాచ్‌లో భారత్‌ కోలుకునే అవకాశం ఉంది. ఇక సెకండ్ ఇన్నింగ్స్‌లో 19 ఓవర్లు వేసిన అండర్సన్ 8 మెయిడిన్స్ వేయడం విశేషం. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో మొత్తం 8 ఓవర్లే వేసిన ఈ ఇంగ్లండ్ స్టార్ పేసర్ 5 మెయిడిన్ చేసి మూడు వికెట్లు తీశాడు.

Story first published: Saturday, August 28, 2021, 14:06 [IST]
Other articles published on Aug 28, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+