IND vs ENG: బాత్‌రూమ్‌లో రహానే.. బ్యాటింగ్‌కు జడేజా!

ఓవల్: ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్ట్‌లోనూ టీమిండియా బ్యాట్స్‌మన్ తడబడ్డారు. చల్లని వాతావరణం.. కొత్త బంతి.. పిచ్ నుంచి లభించిన సహకారాన్ని అందిపుచ్చుకున్న ఇంగ్లండ్ పేసర్లు దుమ్మురేపారు. చురకత్తుల్లాంటి బంతులతో వెంటవెంటనే వికెట్లు తీసి కోహ్లీసేనను కోలుకోలేని దెబ్బతీశారు. ఇంగ్లండ్ బౌలర్లు ధాటికి టీమిండియా.. ఫస్ట్ సెషన్‌లోనే మూడు కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. అయితే చతేశ్వర్ పుజారా ఔటైన తర్వాత అజింక్య రహానేకు బదులు ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా బ్యాటింగ్ రావడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఏడో స్థానంలో వచ్చే జడేజాను అప్‌ది ఆర్డర్‌లో ఎందుకు పంపించారా? అనే సందేహం కలిగింది.

డిస్టర్బ్ చేయాలనే..
అయితే జడేజా టాక్టికల్ మూవ్‌కు గల కారణాన్ని భారత మాజీ క్రికెటర్లు, ప్రముఖ కామెంటేటర్లు సంజయ్ మంజ్రేకర్, సునీల్ గవాస్కర్ వెల్లడించారు. పుజారా ఔటయ్యే సమయానికి అజింక్యా రహానే బ్యాటింగ్‌కు సిద్దంగా లేడని, ఆ సమయంలో అతను బాత్‌రూమ్‌లో ఉండటంతోనే జడేజా బ్యాటింగ్‌కు రావాల్సి వచ్చిందని చెప్పారు. ఇదొక కారణమైతే లెఫ్ట్ రైట్ కాంబినేషన్ ఉండాలనేది మరో కారణమని కూడా అంచనా వేసారు. ఇంగ్లండ్ బౌలర్ల బౌలింగ్ లైన్‌ను డిస్టర్బ్ చేయాలనే ఉద్దేశంతోనే జడేజాను బ్యాటింగ్‌కు పంపించారని సునీల్ గవాస్కర్ పేర్కొన్నాడు.

బాత్‌రూమ్‌లో ఉండటంతోనే..
'లెఫ్ట్ రైట్ కాంబినేషన్ కోసమే జడేజా వ్యూహాత్మకంగా అప్‌ది ఆర్డర్‌లో పంపించారనుకుంటున్నా. లెఫ్ట్ రైట్ కాంబినేషన్ ఇంగ్లండ్ బౌలర్ల బౌలింగ్ లైన్ డిస్టర్బ్ చేయాలనేది టీమిండియా వ్యూహం. రిషభ్ పంత్ ఫామ్‌లో లేకపోవడంతోనే అతనికి బదులు జడేజాను ముందుకు పంపించారు. అయితే రహానేను ఎందుకు పంపించలేదనే విషయంలో నాకు కచ్చితమైన సమాధానం దొరకడం లేదు.
అయితే రహానే బ్యాటింగ్ సిద్దంగా లేడనే విషయం.. టీవీ కెమెరాల్లో కనిపించింది. బహుషా పుజారా ఔటైన సమయంలో అతను బాత్‌రూమ్‌లో ఉన్నాడనుకుంటా'అని గవాస్కర్ తన వ్యాఖ్యానంలో చెప్పుకొచ్చాడు. ఇన్నింగ్స్ బ్రేక్‌లో సంజయ్ మంజ్రేకర్ సైతం ఇదే విషయాన్ని చెప్పాడు. ఇక టాక్టికల్ మూవ్ వర్కౌట్ అయితే ప్రశంసలు కురుస్తాయన లేకుంటే విమర్శలు తప్పవని కామెంటేటర్లు అభిప్రాయపడ్డారు.

టాప్-3 టప టపా..
ఇక మ్యాచ్ విషయానికి వస్తే లంచ్ విరామ సమయానికి 25 ఓవర్లలో భారత్ మూడు వికెట్ల నష్టానికి 54 రన్స్ చేసింది. క్రీజులో కెప్టెన్ విరాట్ కోహ్లీ(29 బంతుల్లో 3 ఫోర్లతో 18 బ్యాటింగ్), రవీంద్ర జడేజా(19 బంతుల్లో 2 బ్యాటింగ్) ఉన్నారు. ఇంగ్లండ్ బౌలర్లలో జేమ్స్ అండర్సన్, ఓలీ రాబిన్సన్, క్రిస్ వోక్స్ చెరొక వికెట్ తీశారు.
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. ఇంగ్లండ్ పేసర్ క్రిస్ వోక్స్ తన ఫస్ట్ ఓవర్‌లోనే రోహిత్ శర్మను పెవిలియన్ చేర్చాడు. ఎక్స్‌ట్రా బౌన్స్‌తో క్రీజులో కుదురుకుంటున్న హిట్ మ్యాన్‌ను బొల్తా కొట్టించాడు. దాంతో 28 రన్స్‌కే భారత్ తొలి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత పుజారా క్రీజులోకి రాగా.. ఆ వెంటనే కేఎల్ రాహుల్ రాబిన్సన్ బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోయాడు.

ఔటయ్యే ప్రమాదం...
రాబిన్సన్ వేసిన ఔట్‌సైడ్ ఆఫ్ స్టంప్ బాల్‌ను తప్పుగా అంచనా వేసిన రాహుల్ మూల్యం చెల్లించుకున్నాడు. రివ్యూ తీసుకున్నా ఫలితం లేకుండా పోయింది. ఆ తర్వాత విరాట్ కోహ్లీ క్రీజులోకి రాగా.. పుజారా డిఫెన్స్‌కు పరిమితమయ్యాడు. జిడ్డు బ్యాటింగ్‌తో ఇక క్రీజులో పాతుకుపోతున్న పుజారాను అండర్సన్ తనదైన బౌలింగ్‌తో బోల్తాకొట్టించాడు.
దాంతో టీమిండియా మేనేజ్‌మెంట్ లెఫ్టాండర్ రవీంద్ర జడేజాకు ప్రమోషన్ ఇస్తూ బ్యాటింగ్ పంపించింది. లెఫ్ట్ రైట్ కాంబినేషన్‌తో కోహ్లీ, జడేజా మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడి ఫస్ట్ సెషన్ ముగించారు. ఇక కోహ్లీ స్వేచ్చగా ఆడుతూ రిథమ్ అందుకునే ప్రయత్నం చేస్తున్నాడు. లంచ్ బ్రేక్ తర్వాత బౌండరీ బాదిన అతను.. క్రిస్ వోక్స్ బౌలింగ్‌లో ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. స్లిప్‌లో అతనిచ్చిన క్యాచ్‌ను జోరూట్ నేలపాలు చేశాడు. దాంతో కోహ్లీ ఊపిరి పీల్చుకున్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications