బ్రో.. గెలిస్తేనే ఉంటావ్!
నాలుగో టెస్ట్ ఫలితంపైనే అజింక్యా రహానే భవిష్యత్తు ఆధారపడి ఉందని, ఈ మ్యాచ్‌లో గెలిస్తే జట్టులో ఉంటాడని లేకుంటే చోటు కోల్పోతాడని అంచనా వేస్తున్నారు. అదే జరిగితే దాదాపు రహానే కెరీర్ ముగిసిపోయినట్లేనని కామెంట్ చేస్తున్నారు. ఇక రహానే ఆన్ అండ్ హాఫ్ పెర్ఫామెన్స్‌కు ఇది కొత్తేం కాదని, అతను నిలకడగా ఆడిన ధాఖలాలే లేవని అసహనం వ్యక్తం చేస్తున్నారు.
రహానేకు టాటా చెప్పే సమయం వచ్చిందంటూ ఫన్నీ మీమ్స్ కూడా ట్రెండ్ చేస్తున్నారు. అసలు రహానేతో జట్టుకు వచ్చిన లాభం ఏంటని కూడా ప్రశ్నిస్తున్నారు. జట్టుకు భారంగా మారిన రహానేపై వేటు వేసి యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. సూర్యను జట్టులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందంటున్నారు.
బ్యాటింగ్ పిచ్‌లో డకౌట్..
బ్యాటింగ్‌కు అనుకూలిస్తున్న వికెట్‌పై రహానే ఔటవ్వడం అభిమానులను విస్మయ పరుస్తుంది. రోహిత్ శర్మ సెంచరీ, పుజారా హాఫ్ సెంచరీ బాదిన ఈ వికెట్‌పై కోహ్లీ కూడా చాలా స్వేచ్చగా బ్యాటింగ్ చేస్తున్నాడు. అలాంటి పిచ్‌పై రహానే తడబడటాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఇలాంటి బ్యాటింగ్ ట్రాక్‌పైనే విఫలమైతే.. ఇతర పిచ్‌లపై ఎలా ఆడుతావని అసహనం వ్యక్తం చేస్తున్నారు. రహానే టైమ్ అయిపోయిందని, అతనికి గౌరవంగా వీడ్కోలు పలకాలని కూడా సూచిస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా రహానేపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
9 ఇన్నింగ్స్‌లు.. ఒక్క హాఫ్ సెంచరీ..
ఇంగ్లండ్ పర్యటనలో ఇప్పటి వరకు 9 ఇన్నింగ్స్‌లు ఆడిన రహానే.. ఒకే ఒక్క హాఫ్ సెంచరీ చేశాడు. అది కూడా లార్డ్స్ టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో 61 రన్స్ చేశాడు. న్యూజిలాండ్‌తో జరిగిన వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్లో 49, 15 పరుగులు చేసిన రహానే.. ఇంగ్లండ్‌తో సిరీస్‌లో 5, 1, 61, 18, 10, 14, 0 పరుగులు చేసాడు. తాజా మ్యాచ్‌లో ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 14 రన్స్ చేసిన రహానే రెండో ఇన్నింగ్స్‌లో డకౌట్‌గా వెనుదిరిగాడు. వేటు వేద్దామనే సమయానికి సెంచరీ లేదా హాఫ్ సెంచరీ చేయడం మరో ఏడు ఎనిమిది ఇన్నింగ్స్‌లు విఫలమవడం రహానేకు అలవాటే. ఈ తరహా బ్యాటింగ్‌తో అతను గొప్ప ఆటగాడు కాలేకపోయాడు.
కోహ్లీ హాఫ్ సెంచరీ మిస్..
270/3 ఓవర్‌నైట్ స్కోర్‌తో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన భారత్‌కు ఆదిలోనే గట్టిషాక్ తగిలింది. ఓవర్‌నైట్ బ్యాట్స్‌మన్ రవీంద్ర జడేజా(17) 8 పరుగులే జోడించి పెవిలియన్ చేరాడు. క్రిస్ వోక్స్ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. రివ్యూ తీసుకున్నా ఫలితం లేకుండా పోయింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన అజింక్యా రహానే(0 బ్యాటింగ్) ఎల్బీగా వెనుదిరగ్గా.. హాఫ్ సెంచరీకి చేరువైన కోహ్లీ(44) మొయిన్ అలీ బౌలింగ్ స్లిప్‌లో దొరికిపోయాడు. దాంతో 312 పరుగులకు భారత్ 6 కీలక వికెట్లు కోల్పోయింది. క్రీజులో రిషభ్ పంత్(12 బ్యాటింగ్), శార్దూల్ ఠాకూర్(0 బ్యాటింగ్) ఉన్నారు. ప్రస్తుతం భారత్ 213 పరుగుల ఆధిక్యంలో ఉంది. మరో 50-60 పరుగులు చేస్తేనే విజయంపై కన్నేసే పరిస్థితి ఉంటుంది.


Click it and Unblock the Notifications












