
105 బంతులాడి 19 పరుగులా
తన యూట్యూబ్ చానెల్‌లో పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హక్ మాట్లాడుతూ... 'టీమిండియా బ్యాట్స్‌మన్ ఎవరూ ఇంగ్లండ్ బౌలర్లను ఏ మాత్రం ఇబ్బందిపెట్టలేకపోయారు. వారి బ్యాటింగ్ శైలి నాసిరకంగా తయారైంది. తొలి రెండు టెస్టుల్లోనూ భారత బ్యాటింగ్ అంత ఆసక్తికరంగా ఏం కనిపించలేదు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలే దీనికి బాధ్యత వహించాల్సి ఉంది.
నా దృష్టిలో వారిద్దరు బాగా బ్యాటింగ్ చేసుంటే.. పరిస్థితి మరోలా ఉండేది. ఈ మ్యాచ్‌లో రోహిత్ 105 బంతులాడి 19 పరుగులు మాత్రమే చేశాడు. ఓపెనర్‌గా రోహిత్ కాస్త స్ట్రోక్‌ప్లేతో షాట్లు ఆడితే టాపార్డర్, మిడిలార్డ్రర్‌కు ధైర్యంగా ఉండేది' అని అన్నాడు.

భారత్ బ్యాటింగ్ ఇలాగే కొనసాగితే
'విరాట్ కోహ్లీ ప్రదర్శన మరింత దారుణంగా తయారైంది. ఈ సిరీస్‌లో ఒక్క మ్యాచ్‌లోనూ ఆకట్టుకోలేకపోయాడు. లీడ్స్ టెస్టులోనూ విరాట్ అదే ప్రదర్శనను చేశాడు. 31 బంతులాడి కేవలం ఏడు పరుగులు మాత్రమే చేసి పేలవ రీతిలో ఔట్ అయ్యాడు. వీరిద్దరు మాత్రమే కాదు జట్టులో ఉన్న మిగిలిన సీనియర్ బ్యాట్స్‌మన్ చేతేశ్వర్ పుజారా, అజింక్య రహానేలకు కూడా ఇది వర్తిస్తుంది.
ఇక ఇంగ్లండ్ బౌలర్ జేమ్స్ అండర్సన్ టీమిండియా పతనాన్ని శాసిస్తున్నాడు. టెస్టు సిరీస్ ఆరంభం నుంచి అండర్సన్ మంచి ప్రదర్శననే కనబరుస్తున్నాడు. భారత్ బ్యాటింగ్ ఇలాగే కొనసాగితే.. మ్యాచ్ నాలుగు రోజుల్లో ముగిసే అవకాశం ఉంటుంది' అని ఇంజమామ్ ఉల్ హక్ చెప్పుకొచ్చాడు. ఓడిపోతే బాధ్యత వహించాల్సింది మీరే (రోహిత్, కోహ్లీ) అని పేర్కొన్నాడు.

78 పరుగులకే ఆలౌట్
మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా అనూహ్యంగా 78 పరుగులకే ఆలౌట్ అయింది. రోహిత్ శర్మ (19), అజింక్య రహానే (18)లు మాత్రమే రెండంకెల స్కోర్ అందుకున్నారు. లోకేష్ రాహుల్, విరాట్ కోహ్లీ, చేతేశ్వర్ పుజారా, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా దారుణంగా విఫలమయ్యారు. దీంతో ఇంగ్లీష్ గడ్డపై భారత్ చెత్త రికార్డు మూటగట్టుకుంది. ప్రస్తుతం భారత్ రెండో ఇన్నింగ్స్ ఆరంభించింది. 5 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా 6 పరుగులు చేశాడు. రోహిత్ శర్మ 23 బంతుల్లో 3 పరుగులు, లోకేష్ రాహుల్ 8 బంతుల్లో 3 రన్స్ చేశాడు. భారత్ ఇంకా 345 పరుగులు వెనకపడి ఉంది.

ఇంగ్లండ్ ఆలౌట్
ఓవర్‌నైట్ స్కోరు 423/8తో మూడో రోజు అయిన శుక్రవారం ఆట ఆరంభించిన ఇంగ్లండ్ మరీ ఎక్కువ పరుగులేమీ చేయలేదు. క్రెయిగ్ ఓవర్టన్ (32; 42 బంతుల్లో 6×4) మొహ్మద్ షమీ వేసిన 130వ ఓవర్లో వరుసగా రెండు బౌండరీలు బాదాడు. 132వ ఓవర్లో అతడి బౌలింగ్‌లోనే వికెట్ల ముందు దొరికిపోయాడు. మరో ఆటగాడు ఓలి రాబిన్సన్ (0; 15 బంతుల్లో) పరుగుల ఖాతా తెరవలేదు. జస్ప్రీత్ బుమ్రా వేసిన 132.2వ బంతికి బౌల్డ్ అయ్యాడు. జేమ్స్ అండర్సన్ (0) అజేయంగా నిలిచాడు. ఆంగ్లేయులకు 354 పరుగుల ఆధిక్యం దక్కింది. షమీ 4 వికెట్లు పడగొట్టాడు. భారత్ ఈ మ్యాచులో ఓటమి పాలవ్వకుండా ఉండాలంటే అద్భుతమే జరగాలి. ఇంతకన్నా ఎక్కువ స్కోరైనా చేయాలి. లేదంటే మూడు రోజుల పాటు ఆలౌట్ అవ్వకుండా ఆడాలి.
432 పరుగులకు ఇంగ్లండ్ ఆలౌట్.. 354 పరుగుల ఆధిక్యంలో రూట్ సేన! భారత ఓపెనర్లపైనే ఆశలు!!

దిగ్గజాల సరసన రూట్
టీమిండియాపై అత్యధిక సెంచరీలు చేసిన బ్యాట్స్‌మన్‌గా జో రూట్ దిగ్గజాల సరసన చేరాడు. గ్యారీ సోబర్స్, వివ్ రిచర్డ్స్, రికీ పాంటింగ్, స్టీవెన్ స్మిత్ ఇపటివరకు 8 సెంచరీలు చేశారు. భారత్‌తో జరుగుతున్న మూడో టెస్టులో శతకం సాధించిన రూట్.. ఇప్పుడు వారి సరసన చేరాడు.
ఒకే క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక సెంచరీలు చేసిన ఇంగ్లండ్ ఆటగాడిగా కూడా మరో రికార్డు నెలకొల్పాడు ఇంగ్లీష్ కెప్టెన్ రూట్. 1947లో డెన్నిస్ కాంప్టన్, 2002లో మైఖేల్ వాన్ ఆరు శతకాలు బాదారు. తాజాగా రూట్ కూడా కాంప్టన్, వాన్ సరసన చేరాడు. రూట్ ఇప్పటికే ఈ సంవత్సరంలో 6 సెంచరీలు చేశాడు. ఇంకా నాలుగు నెలల సమయం ఉన్న నేపథ్యంలో రూట్ సరికొత్త రికార్డు నెలకొల్పనున్నాడు.

2015 తర్వాత ఇదే తొలిసారి
టీమిండియా విదేశాల్లో 131 ఓవర్లకు పైగా ఒక ఇన్నింగ్స్‌లో ఫీల్డింగ్ చేయడం 2015 తర్వాత ఇదే తొలిసారి. అప్పుడు సిడ్నీ టెస్టులో ఏకంగా 152.3 ఓవర్లు ఫీల్డింగ్ చేయడం గమనార్హం. ప్రస్తుతం లీడ్స్‌లో ఆకాశం మేఘావృతమైంది. అక్కడ ఉదయం చిరుజల్లులు కురిశాయి.
మ్యాచ్ ఆరంభానికి ముందు వర్షం ఆగింది. దీంతో త్వరగానే భారత బౌలర్లు ఇంగ్లండ్ జట్టును ఆలౌట్ చేశారు. మరి ఇలాంటి ప్రమాదకర పరిస్థితుల్లో జేమ్స్ అండర్సన్‌ను తట్టుకొని భారత్ నిలబడటం కష్టమే. భారత ఓపెనర్లు లోకేష్ రాహుల్, రోహిత్ శర్మల ప్రదర్శనపైనే భారత్ ఓటమి ఆధారపడివుంది.


Click it and Unblock the Notifications












