For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND vs ENG: నాలుగో రోజు ఒక గంట ఓపికగా ఆడితే.. భారత్‌దే విజయం!

Ind vs Eng: Indian Team Will 3rd Test If Virat And Pujara doesnt get out for 1st hour of Play
IND VS ENG 3rd Test: Kohli - Pujara నిలబడితే ఇంగ్లండ్‌ బోల్తా, ఒక్క గంట.. ఒక్క గంట| Oneindia Telugu

హైదరాబాద్: ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్ట్‌లో భారత జట్టు దీటుగా ఆడుతోంది. అసలేమాత్రం ఆశలు లేని స్థితి నుంచి, ఓటమి లాంఛనమే అనుకున్న దశనుంచి భారత బ్యాట్స్‌మెన్ జట్టును ఓ మెట్టు ఎక్కించారు. ఇప్పటికీ ఓటమి ముప్పు స్పష్టంగా కనిపిస్తున్నా.. ఇంకా ప్రయాణించాల్సిన దూరం చాలానే ఉన్నా... గట్టెక్కడం తేలికేమీ కాకపోయినా.. భారత బ్యాట్స్‌మెన్ తమ ఆటతో ఏ మూలనో చిన్న ఆశను రేపుతున్నారు. మూడో రోజు ఆటలో కొండంత ఆధిక్యమిచ్చిన ఉత్సాహంతో ప్రత్యర్థిని చుట్టేద్దామనుకున్న ఇంగ్లండ్‌కు ఊహించని షాక్ ఇచ్చారు.

ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 78 పరుగులకే కుప్పకూలి పరువు తీసుకున్న కోహ్లీసేన.. రెండో ఇన్నింగ్స్‌లో స్పూర్తిదాయక పోరాటం చేస్తోంది. విమర్శలకు సమాధానమన్నట్లు దూకుడుగా ఆడిన చతేశ్వర్ పుజారా (180 బంతుల్లో 15 ఫోర్లతో 91 బ్యాటింగ్‌) ఇన్నింగ్స్‌కు వెన్నెముకలా నిలిచిన వేళ.. రోహిత్, కోహ్లీల బాధ్యతాయుత ఇన్నింగ్స్‌ల సాయంతో సమరాన్ని భారత్‌ నాలుగో రోజుకు తీసుకెళ్లింది. చేతిలో 8 వికెట్లున్న భారత్‌ ఇంకా 139 పరుగులు వెనుకబడి ఉంది.

ఒక్క గంట ఓపికగా ఆడితే..

ఒక్క గంట ఓపికగా ఆడితే..

గత మూడు రోజుల ఆటలో తొలి గంట మాత్రమే పిచ్ బ్యాట్స్‌మెన్‌కు ప్రతికూలంగా స్పందించింది. తొలి గంట ఓపికగా ఆడిన తర్వాత బ్యాటింగ్‌కు అనుకూలంగా మారింది. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో భారత జట్టును ఇదే కొంప ముంచింది. కొత్త బంతి బాగా స్వింగ్ అవడంతో పాటు మైదానంలో మబ్బులు ఉంటున్న నేపథ్యంలో తొలి గంట బ్యాట్స్‌మన్ తెగ ఇబ్బంది పడుతున్నారు. కానీ బంతి కాస్త పాతబడిన తర్వాత సులువుగా బ్యాటింగ్ చేస్తున్నారు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్, నిన్నటి భారత ఇన్నింగ్స్ సందర్భంగా ఇది స్పష్టంగా కనిపించింది. పైగా ఇంగ్లండ్ స్టార్ బ్యాట్స్‌మన్ డేవిడ్ మలాన్ సైతం ఇదే విషయాన్ని వెల్లడించాడు. తొలి గంట తర్వాత పిచ్ అనూహ్యంగా మారిందన్నాడు. కాబట్టి భారత్ ఈ మ్యాచ్‌లో నిలవాలంటే నాలుగో రోజు తొలి గంట ఓపికగా ఆడటం అత్యంత కీలకం. క్రీజులో కుదురుకున్న పుజారా, కోహ్లీ ఫస్ట్ అవర్ మొత్తం జాగ్రత్తగా ఆడితే మ్యాచ్‌పై భారత్ పట్టు సాధించినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

పుజారా, కోహ్లీ చెలరేగితే..

పుజారా, కోహ్లీ చెలరేగితే..

తొలి గంట ఓపికగా ఆడి పుజారా, కోహ్లీ చెలరేగితే భారత్‌కు తిరుగుండదు. ఈ ఇద్దరూ గతంలో రాహుల్ ద్రవిడ్(180), వీవీఎస్ లక్ష్మణ్(281) కనబర్చిన అనూహ్య ప్రదర్శనను రిపీట్ చేస్తే భారత్ విజయం ముంగిట నిలిచినట్లే. ఇంకా 139 పరుగుల వెనుకంజలో ఉన్న భారత్.. రేపు ఫస్ట్ సెషన్ వరకు బ్యాటింగ్ చేస్తే లార్డ్స్ టెస్ట్ ఫార్మూలాను రిపీట్ చేయవచ్చు. పైగా ప్రత్యర్థి జట్టును ఒత్తిడిలోకి నెట్టవచ్చు. నిన్న ఆడిన నిలకడనే కొనసాగిస్తూ ఈ రోజు మొత్తం ఆడితే భారత్ స్కోర్ 500 ప్లస్ ధాటి.. 150 నుంచి 170 పరుగుల ఆధిక్యం లభిస్తుంది. చివరి రోజు ఫస్ట్ సెషన్‌లో టేలండర్ల సాయంతో మరో 50-100 పరుగులు చేసి.. చివరి 60 ఓవర్లలో ఇంగ్లండ్‌ను బ్యాటింగ్ ఆహ్వానిస్తే సునాయసంగా గెలవచ్చు.

ఫలితాన్ని నిర్ణయించేది తొలి గంటే..

ఫలితాన్ని నిర్ణయించేది తొలి గంటే..

లార్డ్స్ టెస్ట్ మాదిరి మళ్లీ ఓటమి ముంగిట ఇంగ్లండ్‌ను బోల్తా కొట్టవచ్చు. పైగా ఇంగ్లండ్ వాతావరణ పరిస్థితుల్లో చివరి రోజు బ్యాటింగ్ చేయడం చాలా కష్టం. దీన్ని అడ్వాంటేజ్‌గా తీసుకొని భారత బౌలర్ల చెలరేగితే కోహ్లీసేనకు తిరుగుండదు. పైగా ఇంగ్లండ్‌లో జోరూట్, మలాన్ మినహా పెద్దగా రాణించే బ్యాట్స్‌మన్ ఎవరూ లేరు. అయితే ఇదంతా జరగాలంటే కోహ్లీ, పుజారా ఫస్ట్ అవర్ జాగ్రత్తగా ఆడాలి. ఈ ఇద్దరిలో ఒకరు ఔటైనా భారత్ కొంప మునిగినట్లే. ఒత్తిడికి చిత్తవుతూ వరుసగా వికెట్లు కోల్పోతే ఇన్నింగ్స్ తేడాతో ఓడిపోయే దారుణ పరిస్థితి ఎదురవుతుంది. కాబట్టి ఆశలన్నీ కోహ్లీ, పుజారాపైనే ఉన్నాయి. ఇక పుజారా ఆట చూడ ముచ్చటగా ఉంది. గతానికి భిన్నంగా మంచి స్ట్రైక్ రేట్, పుల్ షాట్స్‌తో పుజారా ఆత్మవిశ్వాసంతో ఆడాడు. అతను జోరు చూస్తుంటే డబుల్ సెంచరీ చేయందే ఔటయ్యేట్టు లేడనిపిస్తోంది.

 సెంచరీకి చేరువగా పుజారా..

సెంచరీకి చేరువగా పుజారా..

మ్యాచ్ విషయానికి వస్తే .. ఓపెనర్‌ రోహిత్‌ శర్మ (156 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్‌‌తో 59) రాణించగా, చతేశ్వర్‌ పుజారా (180 బంతుల్లో 15 ఫోర్లతో 91 బ్యాటింగ్‌) సెంచరీకి చేరువయ్యాడు. కెప్టెన్‌ కోహ్లీ (94 బంతుల్లో 6 ఫోర్లతో 45 బ్యాటింగ్‌) క్రీజులో పాతుకుపోయాడు. 80 ఓవర్లు అంటే దాదాపు రోజంతా (సాధారణంగా 90 ఓవర్లు) బ్యాటింగ్‌ చేసిన టీమిండియా కేవలం రెండే వికెట్లు సమర్పించుకుంది. మూడో రోజు ఆట నిలిచే సమయానికి భారత్‌ రెండో ఇన్నింగ్స్‌లో 2 వికెట్లకు 215 పరుగులు చేసింది. రాబిన్సన్, ఓవర్టన్‌లకు చెరో వికెట్‌ దక్కింది.

Story first published: Saturday, August 28, 2021, 11:27 [IST]
Other articles published on Aug 28, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+