IND vs ENG: వారీ.. వాన్ 400 అంటివి కదరా? 100కే సుట్టేసారు మీవోళ్లు! నీ దరిద్రపు నోరు తగలెయ్యా! పేలుతున్న సెటైర

లండన్: 'టీమిండియాతో తొలి వన్డేలో ఇంగ్లండ్ 400 పరుగులు చేసినా నేను ఆశ్చర్యపోను.'.. మ్యాచ్‌కు ముందు ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ చేసిన కామెంట్. కానీ ఇంగ్లండ్ మాత్రం వాన్ చెప్పిన టార్గెట్‌లో సగం 200 పరుగులు కూడా చేయలేకపోయింది. టీమిండియా స్టార్ పేసర్, యార్కర్ల కింగ్ జస్‌ప్రీత్ బుమ్రా(6/19) నిప్పులు చెరిగే బౌలింగ్‌తో సిక్సర్ కొట్టడంతో ఇంగ్లండ్ 25.2 ఓవర్లలో 110 పరుగులకే కుప్పకూలింది. పరిస్థితులకు తగ్గట్లు బౌలింగ్ చేసిన భారత బౌలర్లు అద్భుత విజయాన్ని తమ ఖాతాలో వేసుకున్నారు. దాంతో 400 పరుగులు చేస్తుందని బీరాలు పలికి మైకేల్‌వాన్‌ను ఇండియన్ ఫ్యాన్స్ ఓ ఆట ఆడుకుంటున్నారు.
నీ దరిద్రపు నోరు తగలెయ్యా..
మైకేల్ వాన్ అంచనాలు ఎప్పుడూ తలకిందులు అవుతాయని, తాజా మ్యాచ్ ఫలితం మరో ఉదహారణనని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. గతంలో కూడా వాన్ చెప్పిన ప్రిడిక్షన్స్ అన్ని తప్పు అయ్యాయని, అతనిది దరిద్రపు నోరని మండిపడుతున్నారు. అతను క్రికెట్ ఎక్స్‌పర్ట్‌లా మాట్లాడటం మానేయాలని సలహా ఇస్తున్నారు. రీషెడ్యూల్ టెస్ట్‌లో కూడా భారత్ గెలుస్తుందని చెప్పాడని, కానీ అతని దరిద్రపు నోరు కారణంగా గెలిచే మ్యాచ్‌లో కూడా టీమిండియా ఓటమిపాలైందని గుర్తు చేస్తున్నారు. ఇంకొందరైతే మైకేల్ వాన్‌కు ధన్యవాదాలు తెలుపుతున్నారు. ఇలానే ఇంగ్లండ్‌కు అనుకూలమైన ప్రిడిక్షన్ చెప్పాలని సూచిస్తున్నారు.
ఫ్లాట్ వికెట్లు అయితేనే..
వాన్ చెప్పినట్లు ఇంగ్లండ్ ఆటగాళ్లు 400 పరుగులు చేస్తారని, కానీ ఇలాంటి స్వింగ్ కండిషన్స్‌లో కాదని, ఫ్లాట్ వికెట్స్ కావాలని సెటైర్లు పేల్చుతున్నారు. ఈ మ్యాచ్ ఫలితం మైకేల్ వాన్‌ను తలెత్తుకోకుండా చేసిందని కామెంట్ చేస్తున్నారు. ఇక వసీం జాఫర్ సైతం మైకేల్ వాన్‌పై తనదైన శైలిలో సెటైర్లు పేల్చాడు. ఈ మ్యాచ్ ఫలితం అనంతరం మైకేల్ వాన్ కనిపించకుండా పోయాడని కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ట్రోల్స్ నవ్వులు పూయిస్తున్నాయి.
రోహిత్ హాఫ్ సెంచరీ..
మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' జస్‌ప్రీత్ బుమ్రా (6/19) సంచలన బౌలింగ్‌కు, మహ్మద్ షమీ (3/31) మెరుపులు కూడా తోడవడంతో మొదట ఇంగ్లండ్ 25.2 ఓవర్లలో 110 పరుగులకే కుప్పకూలింది. కెప్టెన్ జోస్ బట్లర్ (30; 32 బంతుల్లో 6×4) టాప్‌స్కోరర్. అనంతరం కెప్టెన్, ఓపెనర్ రోహిత్ శర్మ (76 నాటౌట్; 58 బంతుల్లో 7×4, 5×6) చెలరేగడం.. మరో ఓపెనర్ ధావన్ (31 నాటౌట్; 54 బంతుల్లో 4×4) కూడా నిలకడగా ఆడడంతో భారత్ 18.4 ఓవర్లలో ఒక్క వికెట్టూ నష్టపోకుండా లక్ష్యాన్ని ఛేదించింది. భారత పేసర్లు విజృంభించిన పిచ్ మీద ఇంగ్లిష్ బౌలర్లను అసలేమాత్రం లెక్క చేయలేదు రోహిత్.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications