Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs ENG: అందుకే బ్లాక్ రిబ్బన్స్‌తో బరిలోకి దిగిన భారత ఆటగాళ్లు!

Ind vs Eng: India Wearing Black Armbands To Honour Demise Of Shri Vasudev Paranjape
IND vs ENG: బ్లాక్ రిబ్బన్స్‌తో Cricketers | Shri Vasudev Paranjape| #TeamIndia || Oneindia Telugu

ఓవల్: ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్ట్‌లో భారత ఆటగాళ్లు బ్లాక్ రిబ్బన్స్‌తో బరిలోకి దిగారు. ఎంతో మంది దిగ్గజ ఆటగాళ్లను భారత జట్టుకు అందించిన లెజండరీ కోచ్, ముంబై మాజీ ప్లేయర్ వాసూ దేవ్ పరంజాపే గత సోమవారం గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. ఆయన మృతికి సంతాపంగా భారత ఆటగాళ్లు నేటి మ్యాచ్‌లో బ్లాక్ రిబ్బన్స్‌తో బరిలోకి దిగారు. ఈ విషయాన్ని భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ట్విటర్ వేదికగా అభిమానులతో పంచుకుంది. 'శ్రీ వాసువేదవ్ పరంజాపే మృతికి సంతాపంగా భారత ఆటగాళ్లు బ్లాక్ ఆర్మ్ బాండ్స్ బరిలోకి దిగారు'అని ఆటగాళ్లకు సంబంధించిన ఫొటోను ట్వీట్ చేసింది.

ఇక తాజా నాలుగో టెస్ట్‌లో ఇంగ్లండ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోగా.. భారత్‌ బ్యాటింగ్‌ చేస్తోంది. ఓపెనర్లు కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ నిలకడగా ఆడుతున్నారు. ఇక ఇరు జట్లలో రెండేసి మార్పులు చోటు చేసుకున్నాయి. భారత జట్టులో మహమ్మద్ షమీ, ఇషాంత్ శర్మ ఉద్వాసనకు గురవ్వగా.. శార్దూల్ ఠాకూర్, ఉమేశ్ యాదవ్ జట్టులోకి వచ్చారు. ఇక సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌కు మరోసారి మొండిచెయ్యే ఎదురైంది. ఇంగ్లండ్ జట్టులో సామ్ కరన్, జోస్ బట్లర్ స్థానాల్లో ఓలీ పోప్, క్రిస్ వోక్స్ చోటు దక్కించుకున్నారు.

ముంబై, బరోడా జట్ల తరపున 29 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 785 పరుగులు చేసిన పరంజాపే... క్రికెటర్‌గా ఆయన ఆడింది తక్కువే అయినా.. కోచ్‌గా మాత్రం సక్సెస్ అయ్యారు. ఎంతో మంది భారత లెజెండరీ క్రికెట్లను తీర్చిదద్దడంలో పరాంజమే కృషి మరువలేనిది. సునిల్ గవాస్కర్, దిలీప్ వెంగ్‌సర్కార్, సంజయ్ మంజ్రేకర్ , రాహుల్ ద్రవిడ్ , సచిన్ టెండుల్కర్ యువ్‌రాజ్ సింగ్, రోహిత్ శర్మ వంటి క్రికెటర్లకు ఆయన కోచింగ్ ఇచ్చాడు. టాలెంటెడ్ క్రికెటర్లను గుర్తించడంలో పరాంజపేను మించిన కోచ్ లేడని ఇప్పటికీ చెబుతుంటారు. ఒక క్రికెటర్ భవిష్యత్ ఎలా ఉండబోతోందనేది అతడి ఆటను చూసి పరాంజపే చెప్పేవాడంట. 1960, 70లలో ముంబైలో దాదార్ యూనియర్ స్పోర్ట్స్ క్లబ్ అనేది చాలా ఫేమస్. ఆ క్లబ్ తరపున ఆడాలని ఎంతో మంది కలలు కనేవారు. ముంబై నుంచి కాకుండా దేశంలోని చాలా ప్రాంతాలకు చెందిన క్రికెటర్లు దాదర క్లబ్‌లో ఛాన్స్ కోసం ఎదురు చూస్తుండే వాళ్లు. ఆ సమయంలో పరాంజపే ఆ క్లబ్‌లో కెప్టెన్, కోచ్, మెంటార్‌గా ఉన్నాడు. ఎంతో మంది క్రికెటర్ల సహజమైన టాలెంట్‌ను గుర్తించడంలో పరాంజపే సఫలమయ్యాడు.

తాను తొలి సారిగా దాదర్ క్లబ్‌ కోసం ఆడినప్పుడు వాసూ పరాంజపే కెప్టెన్‌గా ఉన్నాడని వెంగ్‌సర్కార్ చెప్పాడు. తన తొలి కెప్టెన్ వాసూ పరాంజపే అని వెంగ్‌సర్కార్ పేర్కొన్నాడు. వెంగ్‌సర్కార్
టీమిండియా కెప్టెన్‌గా ఉన్నప్పుడు ముంబైలోని పార్శీ జింఖానా గ్రౌండ్‌లో ఒక మ్యాచ్ ఆడుతున్నాడు. ఆ సమయంలో వాసూ పరాంజపే అక్కడకు వచ్చి వాసూని తన వెంట రమ్మని చెప్పాడు. ఎందుకు అని ప్రశ్నించగా.. అవన్నీ కాదు నాతో రా అని చెప్పి సీసీఐ గ్రౌండ్‌కు తీసుకొని వెళ్లాడు. అక్కడ ఒక చిన్న పిల్లవాడు అద్భుతంగా ఆడుతుండటం చూపించి.. అతడు అద్భుతాలు సృష్టించగలడు అని చెప్పాడు. ఆ తర్వాత ఆ కుర్రాడు ప్రపంచం మెచ్చే క్రికెటర్ అయ్యాడు. అతనే సచిన్ టెండుల్కర్. ఇలా టాలెంట్ ఎక్కడ ఉన్నా ఇట్టే పసిగట్టేసేవాడని పరాంజపే గురించి వెంగ్‌సర్కార్ గుర్తు చేసుకున్నాడు.

Story first published: Thursday, September 2, 2021, 16:09 [IST]
Other articles published on Sep 2, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+