ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఆఖరి టెస్ట్‌లో టీమిండియా బ్యాటర్లు అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. ధర్మశాల వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో టాప్ -5 బ్యాటర్లు వరుసగా 50 ప్లస్ రన్స్ చేశారు. 15 ఏళ్ల తర్వాత ఓ టెస్ట్ ఇన్నింగ్స్‌లో భారత బ్యాటర్లు 50 ప్లస్ రన్స్ చేయడం ఇదే తొలిసారి.
ఓపెనర్ యశస్వి జైస్వాల్(58 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 57) హాఫ్ సెంచరీతో రాణించగా.. కెప్టెన్ రోహిత్ శర్మ(162 బంతుల్లో 13 ఫోర్లు, 3 సిక్స్‌లతో 103), శుభ్‌మన్ గిల్(150 బంతుల్లో 12 ఫోర్లు, 5 సిక్స్‌లతో 110) సెంచరీలతో చెలరేగారు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన అరంగేట్ర ప్లేయర్ దేవదత్ పడిక్కల్(103 బంతుల్లో 10 ఫోర్లు, సిక్స్‌తో 65), సర్ఫరాజ్ ఖాన్(60 బంతుల్లో 8 ఫోర్లు, సిక్స్‌తో 56) హాఫ్ సెంచరీలతో రాణించారు.

దాంతో టాప్ 5 బ్యాటర్లు 50 ప్లస్ రన్స్ చేసిన రికార్డు నమోదైంది. చివరిసారిగా భారత టాప్ 5 బ్యాటర్లు.. 2009లో శ్రీలంకతో ముంబై వేదికగా జరిగిన మ్యాచ్‌లో 50 ప్లస్ రన్స్ చేశారు. అంతకుముందు 1999లో మోహాలీ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో.. 1998లో కోల్‌కతా వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో ఈ ఫీట్ సాధించారు.
135/1 ఓవర్‌నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆటను కొనసాగించిన భారత్.. భారీ స్కోర్ దిశగా దూసుకెళ్తోంది. ఓవర్ నైట్ బ్యాటర్లు రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ రెండో వికెట్‌కు 171 పరుగులు జోడించారు. రోహిత్‌ను బెన్ స్టోక్స్ ఔట్ చేయగా.. శుభ్‌గిల్‌ను అండర్సన్ పెవిలియన్ చేర్చాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన దేవదత్ పడిక్కల్, సర్ఫరాజ్ ఖాన్ నిలకడగా ఆడారు. నాలుగో వికెట్‌కు 97 పరుగులు జోడించారు.
హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న సర్ఫరాజ్ ఖాన్(56)ను షోయబ్ బషీర్ పెవిలియన్ చేర్చగా.. ధ్రువ్ జురెల్ సాయంతో పడిక్కల్ సిక్సర్‌తో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. సెంచరీ దిశగా సాగిన పడిక్కల్‌ను షోయబ్ బషీర్ క్లీన్ బౌల్డ్ చేయగా.. ధ్రువ్ జురెల్(15) కూడా అతనే పెవిలియన్ చేర్చాడు. టామ్ హార్ట్‌లీ బౌలింగ్‌లో అశ్విన్ క్లీన్ బౌల్డ్ కావడంతో భారత్ 8 వికెట్లకు 428 పరుగులు చేసింది. క్రీజులో కుల్దీప్ యాదవ్‌తో పాటు బుమ్రా ఉన్నాడు.