Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs ENG: చెలరేగిన పంత్, శార్దూల్ ఠాకూర్.. ఇంగ్లండ్ ముందు భారీ లక్ష్యం!

India set England 368-run target to win

ఓవల్: ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో రిషభ్ పంత్(50), శార్దూల్ ఠాకూర్(60) హాఫ్ సెంచరీలకు ఉమేశ్ యాదవ్(25), జస్‌ప్రీత్ బుమ్రా(24) విలువైన పరుగులు జోడించడంతో భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 466 పరుగులకు ఆలౌటైంది. ఫలితంగా ఇంగ్లండ్ ముందు 367 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. 70/3 ఓవర్‌నైట్ స్కోర్‌తో నాలుగు రోజు ఆటను ప్రారంభించిన టీమిండియా ఫస్ట్ సెషన్‌లోనే మూడు కీలక వికెట్లు కోల్పోయింది. ఓవర్‌నైట్ స్కోర్‌కు రవీంద్ర జడేజా(17)8 పరుగులు జత చేయగా.. రహానే డకౌట్‌గా పెవిలియన్ చేరాడు. ఇక నిలకడగా ఆడుతూ హాఫ్ సెంచరీకి చేరువైన కోహ్లీ.. మొయిన్ అలీ బౌలింగ్‌లో స్లిప్‌లో దొరికి పోయాడు. దాంతో భారత్ లంచ్ బ్రేక్ సమయానికి 6 వికెట్లకు 329 పరుగులు చేసింది.

లంచ్ బ్రేక్ అనంతరం రిషభ్ పంత్, శార్దూల్ ఠాకూర్ సమయోచితంగా బ్యాటింగ్ చేస్తూ టీమిండియా భారీ స్కోర్‌కు బాటలు వేసారు. పిచ్ నుంచి లభించిన సహకారాన్ని అందిపుచ్చుకున్న ఈ ద్వయం.. వీలుచిక్కిన బంతిని బౌండరీకి తరలించింది. ఈ క్రమంలో శార్దూల్ 65 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్స్‌తో హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు. అతనికి ఈ మ్యాచ్‌లో రెండో హాఫ్ సెంచరీ. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో ధనాధన్ ఇన్నింగ్స్‌తో(57) టీమిండియా గౌరవప్రదమైన స్కోర్‌కు బాటలు వేసాడు. అదే జోరును సెకండ్ ఇన్నింగ్స్‌లో కొనసాగించాడు. ఆ వెంటనే రిషభ్ పంత్ సైతం 105 బంతుల్లో 4 ఫోర్ల సాయంతో హాఫ్ సెంచరీ చేసి ఫామ్ అందుకున్నాడు. క్రీజులో కుదురుకున్న ఈ జోడీని విడదీసేందుకు ఇంగ్లండ్ బౌలర్లు తీవ్రంగా శ్రమించారు. చివరకు బంతిని అందుకున్న కెప్టెన్ జోరూట్.. శార్దూల్‌ను ఔట్ చేసి ఏడో వికెట్‌కు నమోదైన 100 పరుగుల భాగస్వామ్యానికి తెరదించాడు. ఆ మరుసటి ఓవర్‌లోనే అలీకి పంత్ రిటర్న్ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దాంతో భారత్ ఇన్నింగ్స్ ముగుస్తుందని అంతా భావించారు. కానీ ఉమేశ్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా నిలకడగా బ్యాటింగ్ చేసి కీలక పరుగులు జత చేశారు. బుమ్రాను క్రిస్ వోక్స్, ఉమేశ్‌ను ఓవర్టన్ ఔట్ చేయడంతో భారత్ ఇన్నింగ్స్ 466 పరుగులకు ముగిసింది.

అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ నిలకడగా బ్యాటింగ్ చేస్తుంది. డ్రింక్స్ బ్రేక్ సమయానికి 15 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 37 రన్స్ చేసింది. మూడో రోజు ఆటలో రోహిత్ శర్మ అద్వితీయ సెంచరీ (127) చేయగా, ఛతేశ్వర్ పుజారా (61) అర్ధ శతకం సాధించిన విషయం తెలిసిందే..ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్ 3 వికెట్లు పడగొట్టాడు. ఓలీ రాబిన్సన్, మొయిన్ అలీ తలో రెండు వికెట్లు తీశారు.

Story first published: Sunday, September 5, 2021, 22:17 [IST]
Other articles published on Sep 5, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+