Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs ENG: కొంపముంచిన గంభీర్ ప్రయోగం!

ఇంగ్లండ్‌తో మూడో టెస్ట్‌లో టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ చేసిన ప్రయోగం వికటించింది. స్పిన్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్‌ బ్యాటింగ్ ఆర్డర్‌ను ప్రమోట్ చేస్తూ గంభీర్ తీసుకున్న నిర్ణయం టీమిండియా కొంపముంచింది. 193 పరుగుల లక్ష్య చేధన‌లో టీమిండియా 170 పరుగులకు ఆలౌటైం 22 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. రవీంద్ర జడేజా(181 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 61 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో ఆఖరి వరకు చేసిన పోరాటం వృథా అయ్యింది. అతనికి తోడుకు ఒక్క బ్యాటర్ క్రీజులో నిల్చినా ఫలితం మరోలా ఉండేది.

58/4 ఓవర్‌నైట్ స్కోర్‌తో ఆఖరి రోజు ఆటను ప్రారంభించిన టీమిండియాకు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. పిచ్ నుంచి లభించిన సహకారాన్ని అందిపుచ్చుకున్న ఇంగ్లండ్ బౌలర్లు వరుస విరామాల్లో వికెట్లు తీసారు. జట్టును ఆదుకుంటాడని భావించిన రిషభ్ పంత్‌ను జోఫ్రా ఆర్చర్ క్లీన్ బౌల్డ్ చేయగా.. క్రీజులో సెట్ అయిన కేఎల్ రాహుల్‌ను బెన్ స్టోక్స్ వికెట్ల ముందు బోల్తా కొట్టించాడు. దాంతో భారత్ 81 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది.

IND vs ENG India Head Coach Gautam Gambhir s Strategy Backfires Against England In Lord s Test

ఈ సమయంలో నితీష్ కుమార్ రెడ్డిని కాకుండా వాషింగ్టన్ సుందర్‌ను గౌతమ్ గంభీర్ బ్యాటింగ్‌కు పంపించాడు. కానీ అతను డకౌట్‌గా వెనుదిరగడంతో టీమిండియా పరుగు వ్యవధిలోనే వికెట్ కోల్పోయింది. వరుసగా వికెట్లు కోల్పోవడం టీమిండియాను ఒత్తిడిలోకి నెట్టింది. జడేజా సహకారంతో నితీష్ పోరాడినా.. క్రిస్ వోక్స్‌ అతన్ని పెవిలియన్ చేర్చాడు. నితీష్ కుమార్ రెడ్డినే ముందుకు బ్యాటింగ్ పంపించి ఉంటే.. టీమిండియా పరిస్థితి మెరుగ్గా ఉండేది. చివర్లో వాషింగ్టన్ సుందర్ జడేజాకు అండగా ఉండేవాడు. అప్పుడు ఈ మ్యాచ్ ఫలితం మరోలా ఉండేది.

Take a Poll

అయితే రెండో టెస్ట్‌తో పాటు ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో వాషింగ్టన్ సుందర్ నిలకడగా ఆడటంతోనే గంభీర్ అతన్ని ముందుకు పంపించినట్లు అర్థమవుతోంది. కానీ గంభీర్ పెట్టుకున్న నమ్మకాన్ని వాషింగ్టన్ సుందర్‌ నిలబెట్టుకోలేకపోయాడు. జోఫ్రా ఆర్చర్ అద్భుతమైన రిటర్న్ క్యాచ్‌కు వెనుదిరిగాడు. దాంతో గంభీర్‌పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గంభీర్ అనాలోచిత నిర్ణయం కారణంగానే టీమిండియా కష్టాలు రెట్టింపు అయ్యాయని నెటిజన్లు మండిపడుతున్నారు.

సంక్షిప్త స్కోర్లు:

ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ 387 ఆలౌట్ (జోరూట్ 104, బుమ్రా 5/74)

భారత్ తొలి ఇన్నింగ్స్ 387 ఆలౌట్(కేఎల్ రాహుల్ 100, క్రిస్ వోక్స్ 3/84)

ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ 192 ఆలౌట్(జోరూట్ 40, వాషింగ్టన్ సుందర్ 4/22)

భారత్ రెండో ఇన్నింగ్స్170 ఆలౌట్(రవీంద్ర జడేజా 61 నాటౌట్, బెన్ స్టోక్స్ 3/48)

Story first published: Monday, July 14, 2025, 19:54 [IST]
Other articles published on Jul 14, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+