Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs ENG: భారత్‌లో ఎప్పుడూ ఇదే లొల్లి: టీమిండియా బ్యాటింగ్ కోచ్

ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో రాంచీ వేదికగా జరగనున్న నాలుగో టెస్ట్ పిచ్‌పై టీమిండియా బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రాంచీ పిచ్ కూడా భారత్‌లో సహజంగా ఉండే పిచ్ అని పేర్కొన్నాడు. భారత్‌లో ఎప్పుడూ ఆడినా పిచ్‌ల గురించి ప్రశ్నలు వస్తాయన్నాడు. శుక్రవారం నుంచి నాలుగో టెస్ట్ ప్రారంభం కానుంది.

ఈ మ్యాచ్ నేపథ్యంలో విక్రమ్ రాథోడ్ గురువారం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా రాంచీ పిచ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'మేం భారత్‌లో ఆడిన ప్రతీసారి పిచ్ గురించే ప్రశ్నలు వస్తాయి. ఇది ఇండియన్ టైపికల్ పిచ్. వికెట్‌పై క్రాక్స్ ఉంటే టర్న్ అవుతుంది. అయితే టర్న్ ఎంత ఉంటుంది? ఎప్పటి నుంచి లభిస్తుందని మాత్రం కచ్చితంగా చెప్పలేం.

IND vs ENG: India batting coach Vikram Rathour addresses question mark on Ranchi pitch ahead of 4th Test

పిచ్ గురించి జట్టులో ఎప్పుడూ చర్చ జరుగుతోంది. ఎలాంటి పరిస్థితుల్లోనైనా రాణించే విధంగా టీమ్‌ కాంబినేషన్‌ను ఎంపిక చేశాం.'అని విక్రమ్ రాథోడ్ చెప్పుకొచ్చాడు. ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ మాట్లాడుతూ.. ఈ పిచ్‌పై ఓ అంచనాకు రాలేకపోతున్నామని తెలిపాడు. ఈ వికెట్‌పై ఎలా ఆడాలో తెలియట్లేదని, పిచ్‌పై పచ్చికతో పాటు పగుళ్లు కూడా ఉన్నాయని అన్నాడు.

'ఈ వికెట్ మీకు ఆసక్తిగా అనిపిస్తుందా? నాకైతే ఏం తెలియట్లేదు. దీని గురించి ఎక్కువగా మాట్లాడలేకపోతున్నా. ఇంతకుముందు ఇలాంటి పిచ్‌ను ఎప్పుడూ చూడలేదు. 'ఓ ఎండ్‌లో ఒకలా, మరో ఎండ్‌లో భిన్నంగా ఉంది. భారత్‌ వెలుపల మైదానాల్లో ఒక అంచనాకు రావచ్చు. కానీ, ఇక్కడ మాత్రం ఏం అర్థం కావట్లేదు. ఇప్పుడు పిచ్‌పై పచ్చిక ఉంది. కానీ లోతుగా పరిశీలిస్తే.. డిఫ్రెంట్‌గా ఉంది. చాలా డార్క్‌గా, కొన్నిచోట్ల పగుళ్లు కనిపిస్తున్నాయి' అని బెన్ స్టోక్స్ తెలిపాడు.

ఇంగ్లండ్ ఆటగాడు ఓలీ పోప్ కూడా రాంచీ పిచ్ స్వభావాన్ని అంచనా వేయలేకపోతున్నామని తెలిపాడు. ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో ఓడిన భారత్.. వరుసగా రెండు మ్యాచ్‌లు గెలిచి 2-1తో ఆధిక్యంలో నిలిచింది.

భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, రజత్ పటిదార్, సర్ఫరాజ్ ఖాన్, దేవదత్ పడిక్కల్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, ధృవ్ జురెల్ (వికెట్ కీపర్), కేఎస్ భరత్ (వికెట్ కీపర్), మహ్మద్ సిరాజ్, ముకేష్ కుమార్, ఆకాశ్ దీప్

ఇంగ్లండ్ జట్టు: జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఒలీ పోప్, జో రూట్, జానీ బెయిర్‌స్టో, బెన్ స్టోక్స్(కెప్టెన్), బెన్ ఫోక్స్ (వికెట్ కీపర్), రెహాన్ అహ్మద్, టామ్ హర్ట్‌లీ, మార్క్ వుడ్, జేమ్స్ ఆండర్సన్, ఒలీ రాబిన్సన్, డేనియల్ లారెన్స్, గుస్ అట్కిన్సన్ , షోయబ్ బషీర్

Story first published: Thursday, February 22, 2024, 15:09 [IST]
Other articles published on Feb 22, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+