For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND vs ENG: చెలరేగిన బెన్‌ స్టోక్స్.. కుప్పకూలిన భారత్! ఇంగ్లండ్ లక్ష్యం 378

IND vs ENG: India 245 all out, set England Target 378

బర్మింగ్‌హామ్: ఇంగ్లండ్‌‌తో జరుగుతున్న రీషెడ్యూల్ ఐదో టెస్ట్‌లో టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో 245 పరుగులకు ఆలౌటైంది. 125/3 ఓవర్ నైట్‌ స్కోర్‌తో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన భారత్‌ను బెన్ స్టోక్స్(4/33) దెబ్బతీసాడు. ఓవర్ నైట్ బ్యాటర్ చతేశ్వర్ పుజారా(66)భారీ ఇన్నింగ్స్ ఆడటంలో విఫలమవ్వగా.. రిషభ్ పంత్ (57) హాఫ్ సెంచరీతో రాణించాడు. కానీ ఇతర బ్యాటర్లు శ్రేయస్ అయ్యర్, రవీంద్ర జడేజా(27), మహమ్మద్ షమీ(13), జస్‌ప్రీత్ బుమ్రా(7) విఫలమవడంతో భారత్‌ స్వల్ప స్కోర్‌కే పరిమితమైంది.

అయితే 132 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కలుపుకొని ఇంగ్లండ్ ముందు 378 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. ఇంగ్లండ్ బౌలర్లలో బెన్ స్టోక్స్‌‌కు తోడుగా స్టువర్ట్ బ్రాడ్, మాథ్యూ పోట్స్ రెండేసి వికెట్లు తీయగా.. అండర్సన్, జాక్ లీచ్ ఓ వికెట్ పడగొట్టాడు. అయితే టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇంగ్లండ్ ఇప్పటి వరకు ఇంతటి లక్ష్యాన్నిఛేదించలేదు. 2019లో ఆస్ట్రేలియాతో లీడ్స్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో 359 పరుగులను మాత్రమే ఇంగ్లండ్ చేజ్ చేసింది. భారత్ విధించిన ఈ లక్ష్యాన్ని ఇంగ్లండ్ చేధిస్తే ఆ జట్టుకు రికార్డు అవుతోంది.

ఇక భారత్ విధించిన ఇంతటి భారీ లక్ష్యాన్ని కూడా ఏ జట్టు చేధించలేదు. 1977లో పెర్త్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో భారత్ విధించిన 339 పరుగులను ఆస్ట్రేలియా చేజ్ చేసింది. ఇదే టెస్టుల్లో భారత్ కాపాడుకోలేకపోయిన భారీ స్కోర్. భారీ లక్ష్యచేధనకు దిగిన ఇంగ్లండ్ తమ ఇన్నింగ్స్‌ను ధాటిగా ప్రారంభించింది. ఓపెనర్లు అలెక్స్ లీస్(46 బ్యాటింగ్), జాక్ క్రాలీ(22 బ్యాటింగ్) ధనాధన్ బ్యాటింగ్‌తో స్కోర్ బోర్డును పరుగెత్తిస్తున్నారు. 15 ఓవర్లు ముగిసేసరికి ఆ జట్టు వికెట్ నష్టపోకుండా 70 పరుగులు చేసింది.

సంక్షిప్త స్కోర్లు..

భారత్ తొలి ఇన్నింగ్స్: 416 ఆలౌట్(రిషభ్ పంత్ 146, రవీంద్రజడేజా 104, జేమ్స్ అండర్సన్ 5/60)

ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 284 ఆలౌట్(జానీ బెయిర్ స్టో 106, సామ్ బిల్లింగ్స్ 36, మహమ్మద్ సిరాజ్ 4/66)

భారత్ రెండో ఇన్నింగ్స్ 245 ఆలౌట్( పుజారా 66, రిషభ్ పంత్ 57, బెన్ స్టోక్స్ 4/33)

ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ 15 ఓవర్లలో 70/0

Story first published: Monday, July 4, 2022, 19:38 [IST]
Other articles published on Jul 4, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+