For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND vs ENG: శ్రేయస్ అయ్యర్ బలహీనతపై దెబ్బకొట్టిన మెక్‌కల్లమ్.. డగౌట్ నుంచి ఇంగ్లండ్ బౌలర్లకు సైగలు! (వీడియో)

IND vs ENG: How Brendon Mccullum got shreyas Iyer Wicket

బర్మింగ్‌హామ్: ఇంగ్లండ్‌తో జరుగుతున్న రీషెడ్యూల్ ఐదో టెస్ట్‌లో టీమిండియా భారీ ఆధిక్యం దిశగా కొనసాగుతోంది. 125/3 ఓవర్‌నైట్ స్కోర్‌తో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన భారత్.. లంచ్ బ్రేక్ సమయానికి 7 వికెట్లకు 229 పరుగులు చేసింది. అయితే శ్రేయస్ అయ్యర్ బలహీనతపై దెబ్బకొట్టాలని ఇంగ్లండ్ బౌలర్లకు ఆ జట్టు కోచ్ మెక్‌కల్లమ్ సైగలు చేయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. మెక్‌కల్లమ్‌కు కేకేఆర్ హెడ్ కోచ్‌గా అయ్యర్ బలహీనత బాగా తెలుసు. ఈ క్రమంలోనే అతను క్రీజులో సెట్ అవ్వకుండా తమ బౌలర్లకు సైగలతో పలు సూచనలు చేశాడు.

షార్ట్ పిచ్ బాల్స్ వేయాలంటూ..

షార్ట్ పిచ్ బాల్స్ ఆడటంలో అయ్యర్ సతమతమవుతాడని, ఆ బంతులు వేయాలని మెక్‌కల్లమ్ తన సైగలతో బౌలర్లకు సూచించాడు. కోచ్ సూచనలతో షార్ట్ పిచ్ బాల్స్‌తో అయ్యర్‌ను ఇంగ్లండ్ ఔట్ చేసింది. మాథ్యూ పోట్స్ బౌలింగ్‌లో అయ్యర్ క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. షార్ట్ పిచ్ బాల్స్ అనగానే అయ్యర్ టెంప్ట్ అయి భారీ షాట్ ఆడే ప్రయత్నం చేసి ప్రతీసారి మూల్యం చెల్లించుకుంటాడు. ఇక ఓవర్ నైట్ బ్యాటర్లు పుజారా(66) తన హాఫ్ సెంచరీని శతకంగా మార్చుకోలేకపోయాడు. బ్రాడ్ బౌలింగ్‌లో అతను క్యాచ్ ఔటవ్వగా.. క్రీజులోకి వచ్చిన అయ్యర్‌తో కలిసి పంత్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు.

పంత్ హాఫ్ సెంచరీ..

ఈ క్రమంలోనే అతను హాఫ్ సెంచరీ కూడా పూర్తి చేసుకున్నాడు. కానీ మెక్ కల్లమ్ అయ్యర్‌ను ఔట్ చేసి భారత్‌‌ను దెబ్బకొట్టాడు. ఆ కొద్దిసేపటికే పంత్ సైతం లీచ్ బౌలింగ్‌లో క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. దాంతో భారత్ 207 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయింది. క్రీజులోకి వచ్చిన రవీంద్ర జడేజా( 17 బ్యాటింగ్)తో మహమ్మద్ షమీ(13)తో కలిసి ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపిస్తున్నాడు. ప్రస్తుతం భారత్ ఆధిక్యం 361 పరుగులకు చేరింది.

ఆదుకున్న బెయిర్ స్టో

ఆదుకున్న బెయిర్ స్టో

ఇంగ్లండ్‌ మిడిలార్డర్‌ బ్యాటర్‌ జానీ బెయిర్‌స్టో (140 బంతుల్లో 106; 14 ఫోర్లు, 2 సిక్స్‌లు) వీరోచిత సెంచరీతో అదరగొట్టినప్పటికీ భారత బౌలర్లు సిరాజ్‌ (4/66), షమీ (2/78), బుమ్రా (3/68) ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌ను 61.3 ఓవర్లలో 284 పరుగులకు పరిమితం చేశారు. సామ్‌ బిల్లింగ్స్‌ (36; 4 ఫోర్లు) మెరుగ్గా ఆడాడు. భారత్‌కు తొలి ఇన్నింగ్స్‌లో 132 పరుగుల ఆధిక్యం లభించింది.

Story first published: Monday, July 4, 2022, 17:25 [IST]
Other articles published on Jul 4, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+